వానలతో… నగరం పులకింత

తెలంగాణలో గత కొన్ని రోజులుగా వాతావరణం చల్లబడిరది. సాయంత్రానికి ఉరుమురులు మెరుపులత వానలు పడుతున్నాయి. కొన్ని చోట్ల అయితే పెద్ద పెద్ద వడగళ్లు కూడా పడుతున్నాయి. మూడు రోజుల క్రితం రాత్రి సమయంలో పడిన కుండపోతు వానతో హైదరాబాద్‌ వర్షాకాలాన్ని తలపించింది. ఇవాళ అదే పరిస్థితి కనిపిస్తుంది. రాత్రంతా ఆకాశం మేఘావృతమై కనిపించి నగరవాసులను చల్లబరిచింది వాతావరణం. ఉదయాని కల్లా చాలా ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో వాన కుమ్మేస్తోంది. హైదరాబాద్‌ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఏకధాటిగా కురుస్తోంది. ఎల్బీనగర్‌ నుంచి మొదలుకొని కోఠీ, అసెంబ్లీ, పంజాగుట్ట, అవిూర్‌ పేట్‌, యూసఫ్‌గూడ, బంజారాహిల్స్‌, జూబ్లీ హిల్స్‌, హైటెక్‌ సిటీ, మాదాపూర్‌ , కూకట్‌ పల్లి, ఎస్‌ఆర్‌ నగర్‌ ప్రాంతాల్లో రెండు గంటల నుంచి వర్షం కురుస్తోంది.ఉదయాన్నే విధులకు వెళ్లే ఉద్యోగులు వర్షంతో ఇబ్బంది పడుతున్నారు. శనివారమే అయినా ట్రాఫిక్‌ జామ్‌లు కాకుండా మురికి కాలువలు రోడ్లపైకి రాకుండా జీఎప్‌ాఎంసీ సిబ్బంది రంగంలోకి దిగారు. వర్షపు నీరు నిల్వ లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు బ్లాక్‌ల సమస్యను పరిష్కరిస్తున్నారు. అయినా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో సమస్య ఉండనే ఉంది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. తెలంగాణలో మూడో తేదీ వరకు ఇలాంటి వాతావరణమే ఉంటుందని హైదరాబాద్‌ వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. తెలంగాణలో చాలా ప్రాంతాల్లో ఇలాంటి చల్లని వాతావరణమే ఉంటుందంటున్నారు. ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మె7దక్‌, కామారెడ్డిలో వడగళ్ల వాన పడే అవకాశం ఉందని ఇవాళ 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ ఇచ్చారు అధికారులు. ఎల్లో అలర్ట్‌ ఇచ్చిన జిల్లాలు సూర్యపేట, మహబూబ్‌నగర్‌, యాదాద్రి భవనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్‌, మేడ్చల్‌, వికారాబాద్‌, సంగారెడ్డి, మెదక్‌, నాగర్‌కర్నూల్‌లో ఇదే పరిస్థితి ఇవాళ రేపు ఉంటుందంటున్నారు వాతావరణ శాఖాధికారులు. ఎల్లుండి… ఆదిలాబాద్‌, కుమ్రం భీమ, మంచిర్యాల, నిర్మల్‌, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబాబాద్‌, వరంగల్‌, హనమకొండ, యాదాద్రి భువనగిరి, నాగర్‌ కర్నూల్‌, వనపర్తి, నారాయణ్‌పేట్‌, జోగులాంబ గద్వాల్‌ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వడగండ్ల వాన పడేందుకు అవకాశం ఉంది. హైదరాబాద్‌లో గరిష్ట ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సీయస్‌, కనిష్ణ ఉష్ణోగ్రతలు 25 డిగ్రీల సెల్సీయస్‌గా నమోదు అయ్యే అవకాశం ఉంది. నిన్న కనిష్‌ ఉష్ణోగ్రత 25 డిగ్రీలు అయితే గరిష్టం 32.8 డిగ్రీలుగా రిజిస్టర్‌ అయింది. ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం ఆంధ్రప్రదేశ్‌లో కూడా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం చెబుతోంది. అన్ని జిల్లాలను అప్రమత్తం చేసింది. యానం పరిసర ప్రాంతాలు, రాయలసీమ ప్రాంతాల్లో పిడుగులు, ఉరుములతో కూడిన వర్షం పడొచ్చని అమరావతి వాతావరణ కేంద్రం చెబబుతోంది. నలభై నుంచి యాభై కిలోవిూటర్ల వేగంతో గాలులు కూడా వీయొచ్చని ప్రకటించింది. రెండో తేదీ వరకు ఇలాంటి పరిస్థితి ఉంటుందని ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న అన్ని జిల్లాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *