ప్రపంచంలోనే వింత ప్రయాణాలు

చాలా తక్కువ సమయంలో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి చేరుకోవడానికి విమానం పనిచేస్తుంది. ఈ ప్రయాణ ధర ఎక్కువగానే ఉంటుంది. టైమ్ ఆదా అవుతుంది కాబట్టి.. ఎక్కువ మనీ చెల్లించడానికి ప్రజలు సిద్ధమవుతున్నారు. అలాగే, ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్లడానికి కూడా విమాన ప్రయాణం ప్రయోజనకరంగా ఉంది. ఐతే.. మరీ ఎక్కువ దూరం ప్రయాణం ఉంటే.. దానికి సమయం కూడా ఎక్కువ పడుతుంది. ఈ ప్రయాణాన్ని సరదాగా చేయడానికి కొన్ని విమానయాన సంస్థలు వివిధ ఆప్షన్స్‌ను అనుసరిస్తున్నాయి.Flight attendants in bikini wear : వియట్ జెట్ ఏవియేషన్ (VietJet Aviation)…. బికినీ ధరించిన మహిళలను విమాన ఎయిర్‌హోస్టెస్‌లుగా తీసుకురావడానికి కొత్త వ్యూహాన్ని అమలు చేసింది. వియట్జెట్ ఏవియేషన్ CEO అయిన గ్యుయెన్ థి ఫుఓంగ్ థావ్ (Nguyen Thi Phuong Thao) ఈ ప్లాన్ వేశారు. ఫోర్బ్స్ ప్రకారం, ఈ వర్ధమాన బిలియనీర్… హవాయి‌ డ్యాన్స్ చేస్తూ… బికినీలో మాత్రమే పనిచేసే మహిళలు తన స్వదేశీ విమానయాన సంస్థలో పనిచేస్తే బాగుంటుందని భావించారు.

Hello, Kitty airline services: హలో కిట్టి ఎయిర్‌లైన్ సర్వీస్ అనేది జపనీస్ డిజైనర్ యుకో షిమిజు రూపొందించిన… ప్రసిద్ధ కార్టూన్ హలో కిట్టి ఆధారంగా ఏర్పడిన ఎయిర్‌లైన్. ఈ తైవాన్ విమానయాన సంస్థ ప్లాన్‌ను జపాన్‌లోని హలో కిట్టి తయారీదారులు ఆమోదించారు. విమానం మొత్తం హలో కిట్టి కార్టూన్‌తో రూపొందించారు. దిండ్లు, న్యాప్‌కిన్‌లు, సీట్లతో సహా విమానంలోని అన్ని సౌకర్యాలూ హలో కిట్టియే.

Hooters air: ప్రసిద్ధ అమెరికన్ రెస్టారెంట్ చైన్ హూటర్స్ చమత్కారమైన ఆలోచనతో ముందుకు వచ్చింది. ఎయిర్‌లైన్స్ కంపెనీలతో ఈ సంస్థ డీల్ కుదుర్చుకుంది. హూటర్స్ ఎయిర్ సేవల్ని కొంతకాలం తర్వాత నిలిపివేసినప్పటికీ… ప్రారంభంలో ఇద్దరు హూటర్స్ గర్ల్స్, ఫ్లైట్ అటెండెంట్లు… చిన్నచిన్న దుస్తులు, స్కర్టులు ధరించి ప్రయాణికులను పలకరించేవారు. వారికి రకరకాల ఆతిథ్య సేవలు అందించేవారు.Rayani Airline: 2015లో మలేషియాలో ప్రారంభించబడిన రయానీ ఎయిర్‌లైన్స్‌ని తర్వాతి సంవత్సరంలో నిషేధించారు. మహిళా ఫ్లైట్ అటెండెంట్లందరూ హిజాబ్ ధరించాలని ఎయిర్‌లైన్.. కఠినమైన ట్రావెల్ కోడ్‌ను తెచ్చింది. ప్రార్థనలు చేసిన తర్వాతే ప్రయాణికులను విమానంలోకి అనుమతించేవారు. విమానంలో మద్యపానాన్ని నిషేధించారు. ప్రయాణికులకు హలాల్ మాంసం ఇచ్చేవారు. విమానాల ప్రయాణం మొత్తం ఇస్లామిక్ చట్టాల ప్రకారమే జరిగేది. చివరకు మూసివేశారు.

German nude airline service : జర్మన్ నగరమైన ఎర్ఫర్ట్ నుంచి ప్రముఖ బాల్టిక్ సీ రిసార్ట్‌కు ఎటువంటి బట్టలూ లేకుండా ప్రయాణికులను తీసుకెళ్లాలనే వింత ఆలోచనతో ఒక జర్మన్ ఎయిర్‌లైన్ కంపెనీ ముందుకు వచ్చింది. 2008లో దీన్ని ప్రారంభించారు. ప్రయాణికులు విమానం ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు మాత్రమే దుస్తులు ధరించాలని కోరారు. అయితే, విమానంలో ఉన్నప్పుడు వారు పూర్తిగా నగ్నంగా ఉండేందుకు అనుమతించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *