స్వీట్‌.. స్వీట్‌ మామిడి

మామిడి.. ఈ పేరు చెబితేనే నోరూరుతుంది.. ఇది పండ్లలో రారాజు.. అందుకే మధుర ఫలంగా ప్రసిద్ధి చెందింది. మన దేశంలో పండే పలు రకాల మామిడి పండ్లు విదేశాలకు ఎగుమతి అవుతుంటాయి.ఇంతటి ప్రాముఖ్యత ఉన్న మామిడికి కొన్నేళ్లుగా కష్టకాలం వచ్చింది. మామిడి పండిరచడంలో వచ్చిన మార్పులు ఆ మధుర ఫలాన్ని విష తుల్యం చేస్తున్నాయి. దిగుబడి కోసం, పంట నిల్వ కోసం, రవాణా కోసం ఈ మామిడి సాగులో వాడుతున్న రసాయనాలు మధు ఫలాన్ని విష ఫలంగా మారుస్తున్నాయి. ఇప్పటి వరకూ చెప్పుకున్న పోషకాల సంగతి పక్కకుపెడితే.. ఈ రసాయనాల కారణంగా మనిషి ఆరోగ్యం నిలువునా హరించుకునేపోయే ప్రమాదం కనిపిస్తోంది. మామిడి సాగులో అనేక దశల్లో పురుగుమందులు, రసాయనాలు వాడుతున్నారు. అలా వాడుతున్న రసాయనాల అవశేషాలు ఈ మధుర ఫలంలో మిగిలిపో తున్నాయి. ఇలాంటి పండ్లు విదేశాలకు వెళ్లినప్పుడు అక్కడ పరీక్షల్లో ఈ రసాయనాల అవశేషాలు వెలుగు చూస్తున్నాయి.అందుకే ఈ ఎథిపాన్‌ వంటి మందుల వాడకాన్ని పూర్తిగా నిరోధించాలి. అది జరగాలంటే బహుముఖంగా కృషి జరగాలి. ప్రభుత్వాలు చొరవచూపడంతో పాటు ప్రజారోగ్యం కోసం అవగాహన పెంచాల్సిన అవసరమూ చాలానే ఉంది. ఇలాంటి కృత్రిమ రసాయనాలు చేసే కీడును ప్రజలకు వివరించాలి. మామిడి ఎక్కువగా వచ్చే వేసవి సీజన్‌లో ఈ ఎథిపాన్‌ వంటి మందుల వాడకంపై ప్రజారోగ్యం కోసం నడుంబిగించే సంస్థలూ ఓ కన్ను వేయాలి. ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తుండాలి. అప్పుడే అసలైన మధుర ఫలం రుచి అందరికీ లభిస్తుంది. ఆరోగ్యవంతమైన మామిడి అందరికీ చేరుతుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *