మౌనంగా జేసీ బ్రదర్స్‌

మేం ట్రెండ్‌ సెట్‌ చేస్తాం తప్ప? ఫాలో కాము. ? ఇదీ? జేసీ బ్రదర్స్‌ తమ పనుల ద్వారా బయటి ప్రపంచానికి చెప్పే మాట. అందులోనూ దివాకర్‌రెడ్డి కంటే ప్రభాకర్‌రెడ్డికి ఇంకా దూకుడు ఎక్కువ. అవతలోడు ఎవడైతే నాకేంటి అన్న రీతిలో ఉంటాయి ఆయన చర్యలు. అయితే? జగన్‌ సర్కార్‌ వచ్చాక ఈ పరిస్థితిలో కొంత మార్పు వచ్చింది. అయినా వైఖరి మాత్రం మారలేదు. తాడిపత్రిలో దశాబ్దాలుగా కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు నడుస్తోంది. అంతకుముందు జేసీ ఫ్యామిలీ ఆధిపత్యమే నడిచినా?.2019 ఎన్నికల తరువాత పెద్దారెడ్డి పట్టుబిగించారు. ఆయన ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాక పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. నియోజకవర్గంలో జరిగే పనుల విషయంలో ఎమ్మెల్యే పెద్దారెడ్డి ? మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి మధ్య అభిప్రాయ భేదాలు తీవ్రం అయ్యాయి. దీంతో నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు టెన్షన్‌ వాతావరణం నెలకొంటోంది. ఎమ్మెల్యేను ఉద్దేశించి ప్రభాకర్‌రెడ్డి ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్య చేయడం.. దాని విూద రచ్చ కావడం సర్వ సాధారణమైపోయింది. కానీ? ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఏమనుకున్నారో ఏమో రూట్‌ మార్చారు. ఎప్పుడూ ఎదుటి వాళ్ళని తిడుతూ కూర్చుంటే? మనకు వచ్చేదేంటన్న రియలైజేషన్‌ వచ్చిందో ఏమో కానీ? ఆయన తాత్కాలికంగా తిట్ల దండకానికి బ్రేక్‌ ఇచ్చారు. సాధారణంగా జేసీ బ్రదర్స్‌ ఎప్పుడూ జనంలోనే ఉంటారు. కానీ? ఇప్పుడు ఇంకాస్త డోస్‌ పెంచారు ప్రభాకర్‌రెడ్డి.ప్రత్యర్థి విూద రాజకీయ సవాళ్ళు, ప్రతి సవాళ్ళను పక్కనపెట్టి నియోజకవర్గంలోని సమస్యల విూద మాత్రమే స్పందిస్తున్నారు ప్రభాకర్‌రెడ్డి. ఎక్కడెక్కడ ఏయే సమస్యలున్నాయి? వాటికి పరిష్కారం ఎలాగన్న విషయాలను అనుచరులు, కార్యకర్తల మధ్య కూర్చుని చర్చిస్తున్నారు. తరచూ అందర్నీ కలుస్తూ? వాళ్ళలో ఒకడిగా మారిపోతున్నారు తప్ప ఎమ్మెల్యే విూద ఎలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం లేదు. అదే టైంలో విచిత్రంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి జేసీ స్టెల్లోకి వచ్చారు. ప్రస్తుతం పాదయాత్రల పేరుతో జనం మధ్యకు వెళ్తున్నారు ఎమ్మెల్యే. ఇప్పటికే పెద్దవడుగూరు, పెద్దపప్పూరు మండలాల్లో పాదయాత్ర ముగించారు. అక్కడ ఆయన మాట్లాడే మాటలు హీట్‌ పెంచేస్తున్నాయి. ఇంకాస్త ఎక్కువైతే మొదటికే మోసం తెచ్చేలా ఉన్నాయన్నది లోకల్‌ వైసీపీ టాక్‌.జనం మధ్యకు వెళ్తున్న ఎమ్మెల్యే ప్రజల సమస్యలు వినకుండా? జేసీ ప్రభాకర్‌ రెడ్డిని దూషించేందుకు ఎక్కువ టైం కేటాయిస్తున్నారన్న చర్చ ప్రజల్లో జరుగుతోంది. దీనికి తోడు ఎమ్మెల్యే వెంట వచ్చిన ఇతర నేతలు సైతం మాజీ ఎమ్మెల్యేని టార్గెట్‌ చేసి మాట్లాడుతున్నారు. ఇంత మంది ఎన్ని మాట్లాడినా.. జేసీ మౌనంగా ఉండటం మాత్రం ఆశ్చర్యంగా ఉందంటున్నారు స్థానికంగా గమనిస్తున్నవారు. ప్రత్యర్థి ఎవరైనా చిన్న మాట అంటేనే తోకతొక్కిన తాచులా విరుచుకపడే జేసీ? ఇంత కూల్‌గా ఎందుకు ఉంటున్నారనేది అందరి మెదళ్ళను తొలుస్తున్న ప్రశ్న. తన ప్రత్యర్థులు ఎంత తిట్టినా.. ఆయన మాత్రం నో మేటర్‌ అన్నట్టుగా కనిపిస్తున్నారు. అంతే కాదు.. నియోజకవర్గంలో గతంలో మాదిరి నిరసనలు తెలియజేసే ప్రయత్నం ఎక్కడా కనిపించలేదు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాల సమయంలో మాత్రం సీఎం జగన్‌ పై విమర్శలు చేసిన ప్రభాకర్‌రెడ్డి తర్వాత సైలెంటైపోయారు.జేసీ ప్రభాకర్‌రెడ్డిలో ఉన్నట్టుండి ఈ మార్పు ఎందుకు వచ్చిందన్న చర్చ ఇప్పుడు తాడిపత్రి పొలిటికల్‌ సర్కిల్స్‌లో జరుగుతోంది. ఇది దేనికి సంకేతమని మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో గతానికి భిన్నంగా ఎమ్మెల్యే పెద్దారెడ్డి దూషణల పర్వానికి తెరలేపడాన్ని కొత్తగా చూస్తున్నారు నియోజకవర్గ ప్రజలు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *