తెలుగు ప్రేక్షకుల ముందుకు రూ. 100 కోట్లు రాబట్టిన చిత్రం.. ఎప్పుడంటే?

ఓటీటీలు వచ్చాక.. ప్రేక్షకులు భాషతో సంబంధం లేకుండా.. మంచి సినిమా అని టాక్ వస్తే చాలు ఎగబడిపోతున్నారు. అది థియేటరా, ఓటీటీనా అని చూడటం లేదు. కేవలం మౌత్ టాక్ పాజిటివ్‌గా వస్తే చాలు.. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర కోట్ల వర్షం కురుస్తోంది. ఇప్పుడలాంటి ఓ చిత్రాన్ని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు నిర్మాత బన్నీ వాసు (Bunny Vas). మలయాళంలో ఒక సినిమా రూ. 100 కోట్లు రాబట్టిందంటే.. ఆ సినిమాలో ఎలాంటి మ్యాటర్ ఉందో అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే మలయాళంలో రూ. 100 కోట్లు కలెక్ట్ చేసిన చిత్రాలు చాలా అరుదు. అలాంటిది విడుదలైన కేవలం 10 రోజులలోనే రూ. 100 కోట్లు రాబట్టి.. అందరినీ ఆశ్చర్యపరిచింది ‘2018’ చిత్రం.

ఇటీవల కాలంలో క్రిస్టి, ఇరట్టా, రోమాంచం వంటి మలయాళం సినిమాలు రిలీజై ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. రీసెంట్‌గా మే 5న విడుదలైన మలయాళం సినిమా ‘2018’.. ఈ సినిమా మొదటి రోజు రాష్ట్రవ్యాప్తంగా కేవలం రూ.1.85 కోట్లు మాత్రమే రాబట్టింది. ఆ తర్వాత అనూహ్యంగా ఈ సినిమా కేవలం మౌత్ టాక్‌తోనే పదిరోజుల్లోనే వంద కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఇప్పటికీ అదే బ్లాక్ బస్టర్ (Malayalam Blockbuster) టాక్‌తో బీభత్సమైన కలక్షన్స్‌ను రాబడుతూ దూసుకెళుతోంది. ఇది పాన్ ఇండియా సినిమా కాకపోయినా సంచలనాలకు ఏ మాత్రం తగ్గడం లేదు. మలయాళంలో సంచలనం సృష్టిస్తున్న ఈ సినిమా హక్కులను తెలుగు నిర్మాత బన్నీ వాసు సొంతం చేసుకున్నారు. అలానే నైజాం ఏరియాలో ఆయనే ఓన్‌గా విడుదల చేస్తునట్టుగా తెలుస్తోంది. మే 26న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది.

2018’ ఆగస్ట్ నెలలో ఋతుపవనాల కారణంగా కురిసిన అధిక వర్షాలు వలన కేరళలో భారీగా వరదలు సంభవించిన విషయం తెలిసిందే. ఈ వరదలలో సుమారుగా 164 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. కేరళ చరిత్రలో సుమారు ఓ శతాబ్దంలో ఇవే అతి పెద్ద వరదలు అని చెప్పొచ్చు. దీనిని బేస్ చేసుకుని జూడ్ ఆంథనీ జోసెఫ్ (Director Jude Anthany Joseph) ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కేరళలోని ఒక మారుమూల పల్లెటూరు నేపథ్యంలో ఈ కథ నడుస్తుంది. దొంగ మెడికల్ సర్టిఫికేట్‌తో ఆర్మీలో చేరి.. అక్కడ ఉండడం ఇష్టం లేక పారిపోయి వచ్చే యువకుడిగా టోవినో థామస్ (Tovino Thomas) ఇందులో అనూప్ పాత్రలో కనిపిస్తాడు. కున్చాకో బోబన్, వినీత్ శ్రీనివాసన్, అసిఫ్ అలీ, లాల్, అపర్ణ బాలమురళి.. లాంటి ప్రముఖ నటీనటులు ఈ సినిమాలో నటించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *