ఓటరు లిస్ట్‌ వెరిఫికేషన్‌ ఇలా

హైదరాబాద్‌, ఆగస్టు 10
మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. 18 ఏళ్లు దాటిన వారు ఎన్నికల గుర్తింపు కార్డు కోసం దరఖాస్తులు చేసుకుంటున్నారు. అయితే ఇప్పటికే ఓటింగ్‌ కార్డు ఉన్నవారిలో కొన్ని తప్పులు కూడా ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో చాలావరకు మార్పులు చేర్పులు చేయల్సి ఉంది. అయితే రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల సంఘం విస్తృత కసరత్తు చేస్తోంది. ఓటరు జబితాలో నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపు ప్రక్రియలో మునిగి తేలుతోంది. తప్పులు లేని ఓటర్‌ జాబితా తయారీ లక్ష్యంగా ఓటర్లకు పలు సూచనలు చేస్తోంది.తప్పులు లేని ఓటరు జాబితా ఉండాలనే లక్ష్యంతో హైదరాబాద్‌ జిల్లాలోని ఓటరు జాబితాలో తమ పేరు ఉందో లేదో చెక్‌ చేసుకోగలరని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కవిూషనర్‌ రోనాల్డ్‌ రోస్‌ సూచించారు. ఓటరు జాబితాలో పేరులో ఉన్న అక్షర దోషాలు, మిస్‌ మ్యాచ్‌ ఫోటోలు, జాబితాలో ఫోటోలు, ఇంటి నెంబర్‌, అడ్రస్‌, పుట్టిన తేదీ, జెండర్‌, మొబైల్‌ నంబర్‌ నమోదు, ఓటరుతో ఉన్న కుటుంబ సభ్యుల పేర్లు, రిలేషన్‌ లాంటి జాబితాలో తప్పుగా నమోదైనా, అంతే కాకుండా ఒకే కుటుంబానికి సంబంధించిన ఓటర్లు అదే నియోజకవర్గం ఒకే పోలింగ్‌ స్టేషన్‌ లోనే కాకుండా అదే నియోజకవర్గంలో గల వేర్వేరు పోలింగ్‌ స్టేషన్‌ లో గాని బార్డర్‌ నియోజకవర్గంలో ఉన్నటువంటి సంబంధించిన తప్పులు అన్నింటినీ సరి చేసుకోవడానికి జాబితాలో మార్పులు, చేర్పుల కోసం కేంద్ర ఎన్నికల కమిషన్‌ రెండవ స్పెషల్‌ సమ్మరీ రివిజన్‌ ద్వారా వెసులుబాటు కల్పించింది.ఈ నేపథ్యం లో ఓటరు జాబితాలో మార్పులు, చేర్పుల కోసం అన్నింటికీ ఫారం`8 ద్వారా ఆన్‌ లైన్‌ ద్వారా, లిలిలి.లనీబివతీబ.ణనీల.తిని లేదా ఓటర్‌ హెల్ప్‌ లైన్‌ యాప్‌?ను డౌన్‌ లోడ్‌ చేసుకొని నమోదు చేసుకోగలరని జిల్లా ఎన్నికల అధికారి సూచించారు. నిబంధనల ప్రకారం ఓటర్ల జాబితాలో పేరు లేకుండా కేవలం ఇఖఎఅ కలిగి ఉన్న తమ ఓటు హక్కు వినియోగం చేసుకునే అవకాశం లేనందున.. అలాంటి వారు ఫారం`6 ద్వారా పైన తెలిపిన వెబ్‌ సైట్‌ ద్వారా నమోదు చేసుకోవాలని తెలిపారు. వెబ్‌ సైట్‌ నమోదు సందర్భంగా అవసరమైన సహాయం కొరకు ఓటర్‌ హెల్ప్‌ లైన్‌ నెంబర్‌ 1950 కి ఫోన్‌ చేయాలని హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి, జిహెచ్‌ఎంసి కమిషనర్‌ కోరారు. కార్యాలయ పని వేళలో ఉదయం 10`30 గంటల నుండి సాయంత్రం 5 గంటలకు సంప్రదించవచ్చని తెలిపారు. ఓటర్‌ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాలనుకునేవారు తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
తెలంగాణలో త్వరలో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా ప్రజలు తమ ఓటు హక్కును నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అదనపు అవకాశాన్ని కల్పిస్తోంది. ఆగస్టు 21 నుంచి సెప్టెంబర్‌ 19 వరకు ఓటర్ల జాబితాల్లో తమ పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఆ తరువాత ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే సెప్టెంబర్‌ 28 నుంచి అభ్యంతరాలు, దరఖాస్తులను పరిశీలించి అక్టోబర్‌ 4 న ఓటర్ల తుది జాబితాను ప్రకటిస్తారు. ఎన్నికల కమిషన్‌ వివరాల ప్రకారం.. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు శేరిలింగంపల్లి (6,44,072 ఓటర్లు) నియోజకవర్గంలో ఉండగా.. అతి తక్కువ ఓటర్లు భద్రాచలం (1,42,813) నియోజకవర్గంలో ఉన్నారు.2023 జనవరి వరకు రాష్ట్రంలో మొత్తం ఓటర్లు 2 కోట్ల 99 లక్షల 77 వేల 6 వందల 59 మంది (2,99,77,659) ఉన్నారు. వీరిలో పురుష ఓటర్లు 1 కోటి 50 లక్షల 50 వేల 4 వందల 64 మంది (1,50,50,464) కాగా, మహిళా ఓటర్లు 1 కోటి 49 లక్షల 25 వేల 243 మంది (1,49,25,243) ఉన్నారు. యువ ఓటర్లలో పురుషులు 64 లక్షల 89 వేల 5 వందల 2 (64,89,502 మంది) కాగా, యువ ఓటర్లలో మహిళలు 63 లక్షల 93 వేల 7 వందల 3 (63,93,703 మంది) ఉన్నారు. 18 నుంచి 39 ఏళ్ల వయసున్న వారు 1 కోటి 28 లక్షల 83 వేల 2 వందల 5 (1,28,83,205) మంది ఉన్నారని ఎన్నికల కమిషన్‌ పేర్కొంది.
2023 జనవరి నాటికి అత్యధికంగా ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు ఏవంటే..
1. శేరిలింగంపల్లి` 6,44.072
2. కుత్బుల్లాపూర్‌` 6,12,700
3.మేడ్చల్‌` 5,53,785
4. ఎల్బీనగర్‌` 5,34,742
5. రాజేంద్రనగర్‌` 4,97,937
అతి తక్కువ ఓటర్లు ఉన్న నియోజకవర్గాలు
1. భద్రాచలం` 1,42,813
2.అశ్వారావుపేట` 1,49,322
3. బెల్లంపల్లి` 1,61,249
4.చెన్నూరు` 1,76,455
5.బాన్సువాడ` 1,82,492

Leave a comment

Your email address will not be published. Required fields are marked *