చేరికల కోసం ఎదురు చూపులు

ఎన్నికల ఏడాది కావడంతో పార్టీలు చేరికలపై దృష్టి సారించాయి. గతంలో మునుగోడు ఉప ఎన్నిక సమయంలో మందగించిన చేరికల పర్వం తాజాగా మరోసారి ఊపందుకుంటోంది. కలిసి వచ్చే నేతల కోసం ప్రధాన పార్టీలు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీలోకి నేతలు వరుసగా వచ్చి చేరుతున్నారు. తాజాగా టీజేఎస్‌ ను వీడిన వెంకట్‌ రెడ్డి, దివంగత హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కుమారుడు ఇంద్రసేనా రెడ్డి, మహిళా పారిశ్రామిక వేత్త జుటుర్‌ కీర్తిరెడ్డి, అదం విజయ్‌ కుమార్‌ లు శుక్రవారం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. మరో వైపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా పని చేసిన నల్లారి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఢల్లీిలో ఇవాళే కాషాయ కండువా కప్పుకున్నారు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీలోకి చేరికల పర్వం ఆసక్తిని పెంచుతుంది. అయితే ఓ వైపు బీజేపీ, కాంగ్రెస్‌ గట్టి పోటీ ఇస్తున్న సమయంలో రాష్ట్రంలోని నేతలన తమ వైపు తిప్పుకోవాల్సిన కేసీఆర్‌ మాత్రం ఇక్కడి నేతలను వదిలేసి పొరుగున ఉన్న మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నేతలకు కండువాలు కప్పడంలో బీజీగా ఉంటున్నారు. ఇటీవల మహారాష్ట్రకు చెందిన పలువురు రైతు సంఘాల నాయకులను బీఆర్‌ఎస్‌ లో చేర్చుకున్నారు. దీంతో తెలంగాణను వదిలేసి పొరుగు రాష్ట్రాల నేతలపై పోకస్‌ పెట్టడం వల్ల అసలుకే ఎసరు రాదా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయిమరోవైపు గతంలో చేరికలతో సందడిగా మారిన గాంధీ భవన్‌ లో ప్రస్తుతం అటువంటి కార్యక్రమాలేవి జరగడం లేదు. రేవంత్‌ వర్గం వర్సెస్‌ సీనియర్ల విబేధాల కారణంగా చేరికలకు బ్రేక్‌ పడిరదనే చర్చ హస్తం పార్టీలో వినిపిస్తోంది. గతంలో టీడీపీలో పని చేసిన వారినందరిని రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలోకి చేర్చుకుంటున్నారని ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్‌ లో టీ కాంగ్రెస్‌ కాస్తా టీటీడీపీకి మరో సెంటర్‌ గా మారుతుందనే విమర్శలు వినిపించాయి. ఈ క్రమంలో చెప్పుకునే నేతలెవరూ కాంగ్రెస్‌ లో ఇటీవల చేరలేదు. ఇదే సమయంలో తెలంగాణలో తిరిగి పునరుత్తేజం కావాలని చూస్తున్న టీటీడీపీ సైతం చేరికలపై దృష్టి సారించింది. గతంలో టీడీపీ తరపున ఎమ్మెల్యేకు పోటీ చేసి అనంతరం బీఆర్‌ఎస్‌ లో చేరిన కూన వెంకటేష్‌ గౌడ్‌ గులాబీ పార్టీకి షాకిచ్చారు. పార్టీలో సరైన గుర్తింపు లేదని ఆరోపిస్తూ బీఆర్‌ఎస్‌ కు రాజీనామా చేశారు. త్వరలో టీడీపీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. దీంతో రాబోయో రోజుల్లో పార్టీల మధ్య చేరికలు ఏ మేరకు స్పీడందుకోబోతున్నాయనే చర్చ పొలిటికల్‌ సర్కిల్స్‌ లో చక్కర్లు కొడుతోం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *