కలవరపెడుతోన్న మంకీపాక్స్‌

చాలామంది అనుకుంటున్నట్లుగా మంకీపాక్స్‌ అనేది కొత్త జబ్బు కాదు. దీన్ని మొదటిసారిగా 1970ల్లోనే గుర్తించారు. ఈ వైరస్‌ కోతులు, రాడెంట్స్‌ ద్వారా వస్తుంది. అయితే ఇది మనుషులతో మరీ దగ్గరగా మసలితేనే మనుషుల్లో విస్తరిస్తున్నదని ప్రస్తుతం భారత్‌లో ఉన్న కేసుల ద్వారా డాక్టర్లు తెలుసుకున్నా రు. మన దేశంలో మంకీపాక్స్‌ మొదటి కేసు ఈ నెలలోనే కేరళలో గుర్తించారు. మంకీపాక్స్‌ మశూచితో పోలిస్తే సారూప్యత కలిగి ఉంది. కానీ తేలికపాటి లక్షణాలను కలిగి ఉంటుంది, ఇది కూడా ఒక అంటువ్యాధి. కోవిడ్‌`19 యితర అంటువ్యాధుల వలె మంకీపాక్స్‌ గాలిసోకితే విస్తరించే వ్యాధి కాదు. కానీ ప్రమాదకరమే. దీని పూర్తి లక్షణాలు బయటపడేసరికి ఒకటి రెండు వారాల సమయం పడుతుంది. సుమారు 75 దేశాల్లో ఈ అంటువ్యాధి లక్షణాలు కనిపించాయి. ఇప్పటివరకూ ఆఫ్రికాలో నలుగురు మరణించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూ హెచ్‌ ఓ ప్రకటించింది. ఇది ఎంతో త్వరగానే ఇతరులకు విస్తరిస్తుంది. కానీ దీన్ని గుర్తించే పరీక్షలు కష్టసాధ్యం. భారతదేశంలో ఇప్పటివరకూ అయిదు కేసులు నమోదయినప్పటికీ, పరీక్షలకు ఇంకా వీలు కలగడం లేదుగనుక ఈ కేసు ల సంఖ్య పెరగవచ్చని ఆరోగ్యశాఖ అధికారులు ఆందోళనపడుతున్నారు. పేరు విచిత్రంగా ఉండడంతో, కేవలం కోతుల ద్వారానే ఈ అంటువ్యాధి విస్తరిస్తుందని, మనుషులతో ఇది విస్తరించదన్న అభిప్రాయం ప్రచారంలో ఉంది. అయితే ఇది ఇప్పుడే తెలిసింది గనుక దీన్ని గురించిన ప్రచారాలతో ఖంగారుపడవద్దని ఆరోగ్యశాఖ హెచ్చిస్తోంది. ఎలాంటి వదంతులు నమ్మవద్దని అధికారులు అంటున్నారు. కోతులు, యితర జంతువులకు దూరంగా ఉండడం వల్ల ఇది రాకుండా జాగ్త త్త పడవచ్చన్న విషయంలో వాస్తవం లేదని అంటున్నారు. మంకీపాక్స్‌ వచ్చినవారు, ఆ లక్షణాలు ఉన్నవారితో సన్నిహితంగా ఉండేవారికి అది విస్తరించే అవకాశం ఉంది తప్ప కోవిడ్‌వలె విస్తరిం చదని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొన్నది. మంకీపాక్స్‌తో బాధపడుతున్నవారికి సన్నిహితంగా, దూరంగా ఉన్న వారు కూడా సరయిన ఆరోగ్య జాగ్ర త్తలు పాటించాల్సి ఉంటుది. అయితే దీన్ని గురించి తప్పుడు సమా చారం, అర్ధంలేని పుకార్లతోనే ప్రపంచ దేశాల్లో భయాందోళనలు నెలకొన్నాయని అంటున్నారు. శరీరం విూద ఎర్రటి మచ్చలు ఏర్ప డడం, నోటినుంచి ఉమ్మిరావడం, నోటి నుంచి తుప్పర్లు పడడం వాటి వల్ల ఈ మంకీపాక్స్‌ త్వరగా విస్తరించే అవకాశం ఉంది. శరీరం విూద ఎర్రటి మచ్చలు, పుండ్లు వంటివి ఏర్పడితే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా డాక్టరును సంప్ర దించడమే మేలు. మంకీపాక్స్‌ అనుమానాలు ఉంటే త్వరపడి చికిత్సకు డాక్టర్లను సంప్రదించాలి. లేకుం టే మంకీపాక్స్‌ కూడా తీవ్రరూపం దాల్చే అవకాశాలు లేకపోలేదు. ఇప్పటికే కోవిడ్‌`19తో ప్రపంచ దేశాల ప్రజలు ఆరోగ్య, సామాజిక పరిస్థితులు దెబ్బతిని ఎంతో నష్టపోయారు. ఈ అనుభవంతో మంకీపాక్స్‌ను ముందే గ్రహించి తగు జాగ్రత్తలు పాటించడం ఎంతయినా అవసరం.మంకీపాక్స్‌ వచ్చిందనే అనుమానాలు వస్తే తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఆరోగ్యసంస్థ ప్రకటించింది. అవే మంటే.. మంకీపాక్స్‌ లక్షణాలు ఉన్న వ్యక్తికి దూరంగా ఉండాలి. అంటే ఎవరన్నా ఎర్రటి మచ్చలు, దుర దలు వంటివి ఉంటే వారికి దూరంగా ఉండాలి. రోగ నిరోధక శక్తి బలంగా ఉంటే పలు వ్యాధులు దూరమవుతాయి. ఈక్రమంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్నవారు మంకీపాక్స్‌ను చాలా వరకు అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే, దీనికి ఎటువంటి రుజువులు లేవు. కానీ విటమిన్‌ సి ద్వారా రోగనిరోధక శక్తిని మెరుగుపర్చుకోవచ్చు. ఇందుకోసం నిమ్మకాయ వంటి పుల్లగా ఉండే సిట్రస్‌ ఫుడ్స్‌ను బాగా తీసుకోవాలి. ఒకవేళ పుల్లటి పండ్లు నచ్చకపోతే బొప్పాయి వంటి తీపి పండ్లను కూడా తీసుకోవచ్చు. ఇవి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.ఆయుర్వేదంలో తులసి ఆకులకు ఎంతో ప్రాధాన్యముంది. ఎందుకంటే అవి ఔషధంగా పనిచేస్తాయి. తులసి ఆకులతో చేసిన పానియాలు, టీ తీసుకోవడం ద్వారా ఇమ్యూనిటీని వేగంగా పెంచుకోవచ్చు. ఇది వివిధ వ్యాధుల నుంచి కూడా రక్షణ కల్పిస్తుంది.వంటల్లో రుచిని పెంచే పుదీనాను ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. ఇది అనేక వ్యాధులకు నివారిణగా పరిగణిస్తారు. ముఖ్యంగా ఉదర సంబంధిత వ్యాధులకు ఇది మంచి ఆహారం. దీనితో తయారు చేసిన వాటిని తినడం వల్ల కండరాలలోని ఒత్తిడి తొలగిపోతుంది. అలాగే ఆస్తమా వంటి తీవ్రమైన వ్యాధుల నుండి కూడా మిమ్మల్ని రక్షిస్తుంది. కావాలంటే పుదీనాతో తయారుచేసిన హెర్బల్‌ టీని తాగొచ్చు. ఇది దగ్గు, జలుబు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.ఆ అనుమానాలు ఉన్న వ్యక్తి కి సంబంధించిన ఏ వస్తు వులనూ పంచుకోరాదు. కోవిడ్‌`19 సమయంలో ఉపయోగించినట్టు శానిటైజర్‌ను నిత్యం ఉపయోగించాలి. ప్రస్తుతం ఈ జాగ్రత్తలను పాటించాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *