భర్తను హత్య చేసి..

అల్లూరి జిల్లా పాడేరులో దారుణ ఘటన జరిగింది. భర్తను హత్య చేసి అనారోగ్యంతో మృతి చెందినట్లు క్రియేట్‌ చేసిందో మహిళ. జి.మాడుగుల మండలం నేరేడువలస గ్రామానికి చెందిన ఉద్రాక్ష హరి విజయ్‌ ను ఈ నెల 18న అతని భార్య ప్రీతి… తన భర్తను ఆరోగ్యం బాలేదని పాడేరు గవర్నమెంట్‌ ఆసుపత్రికి తీసుకువచ్చింది. పాడేరు ఆసుపత్రిలో జాయిన్‌ చేసి ఏ అనుమానం రాకుండా చికిత్స పొందుతూ మరణించినట్లు చిత్రీకరించింది. విజయ్‌ మృతిపై అనుమానస్పద కేసు నమోదు చేసిన పోలీసులు.. పోస్టుమార్టం, కాల్‌ డేటా ఆధారంగా విజయ్‌ ది సహజమరణం కాదు హత్యగా నిర్ధారించారు. ప్రీతి, ఆమె తండ్రి శంకర్‌ రావు, మరికొంత మంది కలిసి చోడవరం మారుతీ నగర్‌ లోని వారి ఇంటి వద్దనే విజయ్‌ ను హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. మృతుని మామ, ప్రీతి తండ్రి సమారెడ్డి శంకర్‌ రావు ను అరెస్టు చేసిన పాడేరు పోలీసులు.. కేసును చోడవరం పోలీసులకు బదిలీ చేశారు.అల్లూరి జిల్లాలో ఫైనాన్స్‌ వ్యాపారి భార్య ఘాతుకానికి పాల్పడిరది. తండ్రితో కలిసి భర్తను హత్య చేసింది. జి.మాడుగుల మండలం నేరేడువలస గ్రామానికి చెందిన లోంజ ఉద్రాక్ష హరి విజయ్‌ ది హత్యేనని పోలీసులు తేల్చారు. ముంచంగిపుట్టు మండలం దారెల పంచాయతీ చివుకుచింతకి చెందిన సమరెడ్డి ప్రీతితో హరి విజయ్‌ కు 2014లో ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఒక పాప ఉంది. విజయ్‌ ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తుంటాడు. ఫైనాన్స్‌ వ్యాపారం విషయంలో భార్యాభర్తలిద్దరికి తరచూ గొడవలు వచ్చేవి. విజయ్‌ ను చంపేయాలని ప్రీతి, ఆమె తండ్రి కుట్ర పన్నారు. ఈనెల 17వ తేదీ రాత్రి విజయ్‌ కు స్నేహితులతో కలిసి మద్యం తాగించారు. మత్తులో ఉన్న విజయ్‌ ముఖంపై దిండుతో నొక్కి హత్య చేశారు. 18వ తేదీ ఉదయం మృతదేహాన్ని కారులో పాడేరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి గుండెపోటుతో కోమాలోకి వెళ్లిపోయాడని డ్రామా ఆడారు. అప్పటికే విజయ్‌ మృతి చెందినట్లు వైద్యులు స్పష్టం చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసిన పోలీసులు… కాల్‌ డేటా, పోస్ట్‌ మార్టం నివేదిక ఆధారంగా ప్రీతి సహా ఏడుగురిని నిందితులను గుర్తించారు. ప్రీతి తండ్రి శంకరరావును అరెస్టు చేశారు. పరారీలో ఉన్న విజయ్‌ భార్య ప్రీతితో పాటు మరొక ఐదుగురి కోసం గాలింపు చేపట్టారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *