అంతర్మధనంలో టీ బీజేపీ నేతలు

అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ పాలిటిక్స్‌ ఆసక్తిని రేపుతున్నాయి. కీలక నేతలు పార్టీలు మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా బీజేపీలోకి వెళ్లిన కొందరు కీలక నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి.తెలంగాణలో రాజకీయాలు తెగ హీటెక్కుతున్నాయి. మరికొద్ది నెలల్లోనే ఎన్నికల శంఖారావం మోగబోతుంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎవరికి వారుగా…. వ్యూహలు, ప్రతివ్యూహాలు రచించటంలో బిజీ అయిపోతున్నారు. ప్రత్యర్థిని ఢీకొట్టే అస్త్రాలను సిద్ధం చేస్తున్నారు. ఓవైపు హ్యాట్రిక్‌ అంటూ బీఆర్‌ఎస్‌ ముందుకెళ్తుంటే…. ఈసారి కారుకు బ్రేకులు వేస్తామంటోంది కాంగ్రెస్‌. కర్ణాటక ఫలితాల ఊపుతో… ఏ చిన్న ఛాన్స్‌ వచ్చినా వదులుకోకుండా… అమలు చేసే దిశగా అడుగులు వేస్తోంది. ఇదే టైంలో పార్టీని వీడిన కీలక నేతలను తమవైపు తిప్పుకునే పనిలో ఉంది. ఆపరేషన్‌ ఆకర్ష్‌ ను పకడ్బందీగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో….. బీజేపీలోని చేరిన నేతలను తిరిగి సొంత గూటికి రప్పించే ప్రయత్నాలను ముమ్మురం చేయటమే కాదు… దాదాపు సఫలీకృతమయ్యే అవకాశం ఉందన్న టాక్‌ వినిపిస్తోంది. ఈ క్రమంలోనే…. బీజేపీకి చెందిన కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డితో పాటు మరికొందరి పేర్లు ప్రధానంగా తెరపైకి వస్తున్నాయి. ఇది కాస్త… కమళదళంలో హాట్‌ టాపిక్‌ గా మారింది.కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి…. కాంగ్రెస్‌ ను వీడి బీజేపీలో చేరిన నేత. ఏకంగా ఎమ్మెల్యే సభ్యత్వానికి రాజీనామా చేసి మునుగోడులో బీజేపీ తరపున కూడా బరిలో నిలిచారు. అయితే ఈ ఉపఎన్నికలో బీఆర్‌ఎస్‌ గెలవటంతో…. బీజేపీ ప్లాన్‌ వర్కౌట్‌ కాలేదు. అయినప్పటికీ…. కోమటిరెడ్డి గట్టి పోటీనిచ్చారు. కేవలం పది వేల మెజార్టీ తేడాతో ఓడిపోయారు. అప్పటివరకు పార్టీలో యాక్టివ్‌ గా ఉన్న ఆయన…. ఆ తర్వాత పెద్దగా కనిపించిన పరిస్థితిలేదు. ఇదిలా ఉంటే…. అధికార బీఆర్‌ఎస్‌ ను మాత్రం సమయం దొరికిన ప్రతిసారి ఏకిపారేస్తూ వచ్చారు. లిక్కర్‌ కేసులో కవిత అరెస్ట్‌ కావటం ఖాయమంటూ పదే పదే చెబుతూ వచ్చారు. సీన్‌ కట్‌ చేస్తే ప్రస్తుతం సీన్‌ మారినట్లు కనిపిస్తోంది. కోమటిరెడ్డిని తిరిగి కాంగ్రెస్‌ లోకి రప్పించేందుకు రాష్ట్రానికి చెందిన నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లు కొద్దిరోజులుగా వార్తలు వస్తున్నాయి. వీటిపై రాజగోపాల్‌ రెడ్డి కూడా స్పందించారు. కాంగ్రెస్‌ లో చేరే అవకాశం లేదని చెప్పారు. అయితే ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే….. రాజగోపాల్‌ రెడ్డి బీజేపీని వీడే అవకాశం ఉందన్న టాక్‌ గట్టిగా వినిపిస్తోంది. ఆయన సోదరుడు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి కూడా…. తమ్ముడితో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఢల్లీి పెద్దలతో కూడా చేరిక విషయంపై సమాలోచనలు జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్యనే ప్రియాంకగాంధీతో భేటీ అయిన కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి…. విూడియాతో మాట్లాడారు. ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నామని… పార్టీని వీడిని నేతలందర్నీ పార్టీలోకి రప్పిస్తామని క్లారిటీ ఇచ్చారు. ఇదే సమయంలో బీజేపీ ` బీఆర్‌ఎస్‌ ఒక్కటే అన్న భావన ప్రజల్లో ఉందంటూ తాజాగా రాజగోపాల్‌ రెడ్డి కామెంట్స్‌ చేయటం కూడా…. హాట్‌ టాపిక్‌ గా మారింది. వీట్ననింటిని చూస్తే రాజగోపాల్‌ రెడ్డి…. బీజేపీకి గుడ్‌ బై చెప్పే అవకాశం ఉందన్న చర్చ గట్టిగా ఉంది. ఇక ఆయన పోటీ చేసే స్థానం కూడా మారే అవకాశం ఉందన్న వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నాయి.ఇక హుజురాబాద్‌ నుంచి గెలిచిన ఈటల రాజేందర్‌ కూడా…. బీజేపీలో ఇబ్బందిపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీలో పెద్దగా ప్రాధాన్యత లేకపోవటంతో….అసంతృప్తితో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇటీవలనే ఢల్లీికి వెళ్లిన ఆయన…బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారు. ఆయనకు కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందన్న చర్చ ఉన్నప్పటికీ… ఆయన కూడా పార్టీ మారే అవకాశం ఉందన్న లీక్‌ లు వస్తున్నాయి. కర్ణాటకలో బీజేపీ ఓటమి, కేసీఆర్‌ పై పోరాడే విషయంలో ఆశించిన స్థాయిలో కదలికలు లేకపోవటంతో పాటు కేడర్‌ నుంచి ఒత్తిడి ఉన్న నేపథ్యంలో…. కోమటిరెడ్డితో పాటు ఈటల వంటి నేతలు కూడా అంతర్మథనంలో పడినట్లు తెలుస్తోంది. అయితే పార్టీ మార్పును ఖండిస్తూ వచ్చిన ఈ ఇద్దరు నేతలు…. రాబోయే రోజుల్లో ఏ దిశగా అడుగులు వేస్తానేది టాక్‌ ఆఫ్‌ ది తెలంగాణగా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *