సముద్రంలో కలిసిపోతున్న చినమైనవానిలంక గ్రామం

ఏలూరు, ఆగస్టు 8
కన్న తల్లిగా సముద్రాన్ని పూజిస్తారు. నిత్యం కడలి ఒడిలో ఉండే మత్సకారులు ఇప్పుడు సముద్రమంటే నే భయపడిపోతున్నారు. గడచిన దశాబ్ద కాలంలో రెండు కిలోవిూటర్ల మేర సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది. ఆటు పోటుల సమయంలో అమాంతం విూదకు వస్తుంది. తుఫాను వస్తుంది అంటే గ్రామస్తులకు కంటి విూద కునుకు ఉండటం లేదు. తుఫానుల సమయంలో సముద్రం ముందుకు రావడంతో ఇప్పటికే నరసాపురం మండలంలోని చినమైనవానిలంక కడలి గర్భంలో కలసి పోయింది. ఇక బియ్యపుతిప్ప, పెదమైనవాని లంక గ్రామాలలోని వేలాది ఎకరాలు కడలి గర్భంలో కలసి పోయాయి..అక్కడ సముద్రం వికటాట్టహాసం చేస్తూ గ్రామాల పైకి ముంచుకు వస్తుంది. సముద్రం కొంచెం కొంచెంగా నేలను కోసేస్తూ గ్రామాలు మింగేస్తూ గుండె కోతను మిగులుస్తుంది. ఇది కంటిన్యూ అయితే మాయమయ్యే మరో ఊరు ఏదంటే..? పశ్చిమలో 19 కి.విూ తీరప్రాంతం ఉందా ఊరు. సముద్రంను ఆనుకుని ఏడు గ్రామాలు ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మత్సకారులు, సముద్రంతోనే వీరి జీవితం ముడి పడి ఉంటుంది. కన్న తల్లిగా సముద్రాన్ని పూజిస్తారు. నిత్యం కడలి ఒడిలో ఉండే మత్సకారులు ఇప్పుడు సముద్రమంటే నే భయపడిపోతున్నారు. గడచిన దశాబ్ద కాలంలో రెండు కిలోవిూటర్ల మేర సముద్రం ముందుకు చొచ్చుకు వచ్చింది. ఆటు పోటుల సమయంలో అమాంతం విూదకు వస్తుంది. తుఫాను వస్తుంది అంటే గ్రామస్తులకు కంటి విూద కునుకు ఉండటం లేదు. తుఫానుల సమయంలో సముద్రం ముందుకు రావడంతో ఇప్పటికే నరసాపురం మండలంలోని చినమైనవానిలంక కడలి గర్భంలో కలసి పోయింది. ఇక బియ్యపుతిప్ప, పెదమైనవాని లంక గ్రామాలలోని వేలాది ఎకరాలు కడలి గర్భంలో కలసి పోయాయి. పెదమైనవనిలంకకి సముద్రం అర కిలోవిూటరు దూరంలో మాత్రమే ఉంది. తుఫానులు వస్తున్నాయంటేనే ప్రాణాలు అరచేతిలో పెట్టుకు బ్రతుకుతున్నారు గ్రామస్తులు. సముద్ర అలలు హోరును జోల పాటగా భావించే మత్సకారులు ఇప్పుడు ఆ శబ్దం వింటేనే ఉలిక్కి పడే పరిస్థితి ఏర్పడిరది. కడలి పుత్రులు నిత్యం జీవనం సాగించేది, జీవించేది ప్రకృతి ఒడిలోనే. సముద్రంలో వేట కోసం తీర ప్రాంతాన్ని తమ ఆవాసంగా మత్స్యకారులు మార్చుకుంటారు. ఈ ప్రాంతంలో సర్వీ, కొబ్బరి, కూరగాయలు సాగు చేస్తూ, ఉప్పు తయారు చేస్తూ జీవనం సాగిస్తుంటారు. గ్రామాలవిూదకు సముద్రం రాకుండా పూర్వం మడ అడవులు రక్షణ గా ఉండేవి. సముద్రతీరం వెంబడి దట్టమైన మడ అడవులు, సరుగుడు చెట్లు ఉండేవి. తుపానులు, విపత్తులు,ఉప్పెనలు వచ్చినప్పుడు అవి నష్ట తీవ్రతను తగ్గించేవి. కాని పశ్చిమ గోదావరి తీరంలో ప్రస్తుతం మడ అడవులు కనుమరుగై పోయాయి. మడఅడవుల వలన చేపలు సంతతి పెరుగుతుంది . అదేసమయంలో కోతకు తీరం నష్ట పోకుండా కాపాడుతుంది. వాతావరణ సమతుల్యంలో ఈ మడ అడవులు పాత్ర చాలా ముఖ్యం. ప్రస్తుతం అభివృద్ధి పేరుతో విచక్షణా రహితంగా చెట్లు కొట్టే యడం వల్లే అనేక తుపానులు, సముద్రకోతలు సంభవిస్తున్నాయి. ఇటీవల సంభవించిన పలు పెను తుపానులే వీటికి నిదర్శనం.గోదావరి జిల్లాలో గోదావరి సముద్రంలో కలిసే అంతర్వేదికి, సముద్ర ముఖద్వారానికి ఎదురుగా ఉండే దర్భరేవు ప్రాంతంలో గతంలో అటవీశాఖ మడ అడవులను అభివృద్ధి చేసింది. అదేవిధంగా ఉప్పుటేరు సముద్రంలో కలిసి స్ట్రయిట్‌ కట్‌ ప్రాంతానికి అనుసంధానంగా పాతపాడు, నాగిడిపాలెం గ్రామాల్లో దశాబ్దాల కిందట వేశారు. కాల క్రమంలో అవి కూడా అంతర్థానం అయ్యాయి. బురద నేలలో ఉప్పునీటి కయ్యల్లో ఈ అడవులు ఏర్పాటు చేయడం వల్ల మత్య సంపద అభివృద్ధికి దోహ దపడుతుంది. రొయ్యలు, పీతలు ఎదుగుదలకు ఈ ప్రాంతం అనువుగా ఉండటం వల్ల సముద్ర ఉత్పత్తులు పెరిగి మత్స్యకారులకు ఉపాధి అవకాశలు మెరుగవుతాయి. గతంలో మడ అడవులను పెంచిన అటవీశాఖ వాటి సంరక్షణ బాధ్యత మత్స్యకారులతో ఏర్పాటైన సొసైటీలకు అప్పగించింది. సాసైటీ సభ్యులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో అడవులు కనుమరుగై చేపలు, రొయ్యలు చెరువులుగా మారిపోయాయి. ప్రభుత్వం, ఆటవీశాఖ అధికారులు స్పందించి స్వామినాదన్‌ ఫౌండేషన్‌ కేంద్ర ప్రభుత్వానికి సూచించిన విధంగా స్వచ్ఛంద సంస్థలు, వనసంరక్షణ సమితులు సహకారం తీసుకొని మడఅడవులు అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ప్రస్తుతం కనిపిస్తుంది. దీని వల్ల పర్యావరణ పరిరక్షణతో పాటం జలచరాలు అభివృద్ధికి, మత్యకారులు తమ ఆదాయం పెంచుకొనేందుకు వీలుంటుంది. అయితే ఈ విషయంలో కనిపిస్తున్న నిర్లక్ష్యం వల్ల భావి తరాలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పని పరిస్థితి ఇపుడు నెలకొంది.పశ్చిమ గోదావరి జిల్లాలో తీరప్రాంతం నరసాపురం, మొగల్తూరు మండలాల్లో 19 కిలోవిూటర్లు విస్తరించి ఉంది . 9 మత్స్యకార గ్రామాలు తీరంను ఆనుకుని ఉన్నాయి. వీటిలో 1500 మంది వరకు వేటపై ఆధారపడి జీవిస్తున్నారు. నరసాపురం మండలం బియ్యపుతిప్ప, చినమైన వానిలంక, పెదమైన వానిలంక, మొగల్తూరు మండలం వేడిపాలెం సౌత్‌, పేరుపాలెం సౌత్‌ పంచాయతీలు ఉన్నాయి. సముద్రంలోని అలజడి సంభవించిన ప్రతి సందర్భంలోనూ ఈ గ్రామాలు కోతకు గురవుతున్నాయి. తీరంలో నిత్యం ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని జీవించే వీరికి వానకాలంలో సంభవించే వాయుగుండాలు, తుపానులు ఒక రకమైన భయాందోళనకు గురిచేస్తుంటే నిత్యం ముందుకు వస్తున్న సముద్ర అలలు కంటివిూద కునుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో నరసాపురం మండలం బియ్యపుతిప్ప, చినమైనవానిలంక గ్రామాలు కోతకుగురై కాలక్రమములో సముద్రగర్భంలో కలసిపోయాయి. 2001 లో వచ్చిన సునావిూతో తీరంలో ప్రజలు ఒక్కసారిగా ఉలికిపడ్డారు. కొంత మంది. తమ ప్రాణాలు కోల్పోయారు.వేలాది ఎకరాల్లో పంట భూములు, నివాసాలు సముద్రంలో కలిసి పోయాయి. దీంతో వీరు సముద్రానికి 4 కిలోవిూటర్ల దూరంలో గ్రామాలు ఏర్పాటు చేసుకున్నారు. అప్పటి వరకు సముద్రమంటే భయపడని స్థానికులు ఈ అనుభవం తర్వాత ఏ చిన్న విపత్తు సంభవించినా హడలిపోతున్నారు. గత కొంత కాలంగా పెదమైనవానిలంక గ్రామం కోతకు గురవుతోంది. రెండే ళ్లుగా ఇది మరీ ఎక్కువైంది. దీంతో ఎప్పుడు ఏ ప్రమాదం పొంచి వుందోనని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీలం తుఫాను మొదలు లైలా, థానే, లెహర్‌ తుఫాను లకు తీరం వాసులు గడగడ వణికిపో యారు. ప్రస్తుతం సముద్ర కోతతో మత్సకారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ధానే తుపాను సమయంలో పెద మైనవాని లంక తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. కెరటాలు ఉద్ధృతికి కొబ్బరి చెట్టు సర్వీ, తాటిచెట్లు నేలకొరిగి కడలి గర్భంలో కలసిపో యాయి. సముద్రం క్రమేపీ కోత కోస్తూ సుమారు 20 విూటర్లు ముందుకు చొచ్చుకొచ్చింది. ఈ ప్రభావంతో గట్ల కోతకు గురయ్యాయి. దీంతో తీరప్రాంత ప్రజలు భయంతో బిక్కుబిక్కుమంటూ కాలం గడిపేపరిస్థితి నెలకొంది.సముద్రం నుంచి వచ్చే అలలు తీరాన్ని తాకే ప్రదేశంలో బలంగా విచ్ఛిన్నం కావడం వల్ల సముద్రం కోతకు గురవుతుంటుంది. అది సముద్రంలో అలల తీవ్రత, తీరం వద్ద ఉండే లోతు, దాని ఆకారం తదితర అంశాలపై ఆధారపడి కోతకు గురవడం లేదా మేట వేయడం జరు గుతుంది అని నిపుణులు చెబుతున్నారు. జిల్లాలో 110 కిలోవిూటర్లు తీరం ప్రాంతంలో పెదమైనవానిలంక వద్ద ప్రస్తుతం అలలు కేంద్రీకృతం అవుతుండటంతో కోత ఎక్కువగా పెరుగుతుంది . కాలానుగుణంగా సరైన పరిశీలన చేసి నిరోధించడానికి ప్రయత్నం చేయాలి. సాధారణంగా ఈ పరిస్థితుల్లో తీరం వెంబడి మడ ఆడవులు, సర్వేతోటలు, పెంచడం ద్వారా ఈ సమస్యను తగ్గించవచ్చని లేదా తీరం వెంబడి పెద్ధ పెద్ద బండరాళ్లను అడ్డుగోడలుగా వేయవచ్చని పలువురు నిపుణులు ఇప్పటికే సూచించారు. ఈ క్రమంలో స్వయంగా అప్పటి ముఖ్య మంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సమస్యను చూపించే యత్నం జరిగింది . అదే సమయంలో తీర ప్రాంతం పటిష్టతకు సుమారు రూ. 540 కోట్లతో సంబంధిత అధికారులు ప్రతిపాదనలు పంపించారు. అయితే ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ప్రతిపాదనలు తర్వాత కనుమరుగైపోయాయి. నరసాపురం సముద్ర తీరం వెంబడి రక్షణ గోడ నిర్మించాలనే డిమాండ్‌ చాలా కాలంగా వినిపిస్తోంది. కేంద్ర మంత్రి నిర్మలా సీతా రామన్‌ లంకను దత్తత తీసుకోవ డంతో సముద్రకోత నివారణకు అవసర మైన చర్యలు చేపట్టారు. డిలైట్‌ కంపెనీ,మద్రాస్‌ ఐఐటీ వారు కలసి ఇక్కడ రక్షణ గోడ నిర్మించేందుకు సర్వే చేశారు. ముంబై లో సముద్రం కోతకు గురవ్వ కుండా ఏర్పాటు చేసినట్లు ట్యూబ్లర్‌ పద్దతిలో రక్షణ గోడ నిర్మించేందుకు ఏర్పాట్లు చేశారు. ట్యూబ్‌ లర్‌ పద్దతి అంటే భారీ ట్యూబ్‌ లలో ఇసుకను నింపి సముద్రం కోతకు గురవుతున్న ప్రదేశాల్లో ఉంచుతారు దీనివలన సముద్రం అలలు తీరంను బలంగా తాకకుండా అడ్డుకోవడంతో సముద్ర తీరం కోతకు గురవకుండా ఉంటుంది. అయితే ఆ ప్రాజెక్ట్‌ ఇప్పటి వరకు ప్రారంభం కాలేదు. ఈ ప్రాజెక్ట్‌ పూర్తి అయితే తీర ప్రాంత ప్రజలకు ఊరట కలిగినట్లే..!

Leave a comment

Your email address will not be published. Required fields are marked *