సీఎంగా ఈ సారి కేటీఆరే..?

హైదరాబాద్‌, అక్టోబరు 5
బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్కు త్వరలోనే ప్రమోషన్‌ దక్కనుందని ఆ పార్టీలో జోరుగా చర్చ జరుగుతోంది. కేటీఆర్ను సీఎం చేస్తానని కేసీఆర్‌ తన వద్ద ప్రపోజల్‌ పెట్టారంటూ ఇందూరు సభలో ప్రధాని మోదీ కామెంట్స్చేసిన నేపథ్యంలో ‘ఇక రామన్నే సీఎం’ అనే ప్రచారం మళ్లీ జోరందుకుంది. కేటీఆర్ను సీఎం చేయాలని కుటుంబసభ్యులతో పాటు ఆయన సన్నిహితులు కోరుతున్నారని బీఆర్‌ఎస్‌ లీడర్లు చెబుతున్నారు. ఇప్పుడది నెరవేరే టైమ్‌ వచ్చిందని అంటున్నారు. కేసీఆర్‌ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే కేటీఆర్కు వర్కింగ్ప్రెసిడెంట్పదవి ఇచ్చారు. పార్టీ అధ్యక్షుడికి ఉన్న అధికారాలన్నీ కట్టబెట్టారు. 2019లో కేటీఆర్ను సీఎం చేయాలనే డిమాండ్పై పార్టీలో డిఫరెంట్టాక్‌ఉన్నప్పటికీ, రెండేండ్లు తిరిగే సరికి కేటీఆర్నాయకత్వంలో పని చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని సీనియర్లీడర్లు ప్రకటించారు. దీంతో కేటీఆర్కు పట్టాభిషేకం ఖాయమని అప్పట్లోనే ప్రచారం సాగింది. కేటీఆర్‌ సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారంటూ పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కామెంట్లు చేశారు.వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ గెలిస్తే, కేటీఆర్‌ కు పట్టాభిషేకం ఖాయమని బీఆర్‌ఎస్‌ లీడర్లు చెబుతున్నారు.ప్రధాని చెప్పిన దాని ప్రకారం రెండున్నరేండ్ల కిందనే కేటీఆర్సీఎం కావాల్సిందని, వచ్చే ఎన్నికల తర్వాత అది జరిగి తీరుతుందని కేటీఆర్సన్నిహితులతో పాటు ప్రగతి భవన్తో నిత్యం టచ్లో ఉండే లీడర్లుపేర్కొంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్గెలిస్తే, కేటీఆర్ను సీఎం చేసి కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై ఫోకస్‌ చేస్తారని తెలుస్తోంది. తాను నేషనల్‌ పాలిటిక్స్లో బిజీగా ఉండేందుకే టీఆర్‌ఎస్‌ ను బీఆర్‌ఎస్‌ గా మార్చానని తన సన్నిహితులతో కేసీఆర్‌ చెప్పినట్టు సమాచారం. ఈసారి అసెంబ్లీ ఎన్నికలను కేసీఆర్ఫేస్తోనే ఎదుర్కొన్నప్పటికీ, కేటీఆర్కు పట్టం కట్టడం ఖాయమనే ప్రచారం పార్టీలో జోరుగా సాగుతోంది. ఈ ఊహాగానాలకు ప్రధాని కామెంట్స్‌ మరింత ఊతమిచ్చాయని పార్టీ ముఖ్య నేతలు చెబుతున్నారు.ఒకానొక దశలో ఈ కామెంట్లపై కేసీఆర్‌ సీరియస్‌ అయ్యారు. కేటీఆర్‌ సీఎం అయితే తానేం చేయాలని పార్టీ లీడర్లను ప్రశ్నించారు. అలాంటి కామెంట్స్చేస్తే కాళ్లు పట్టి బండకేసి కొడ్తానని హెచ్చరించారు. కానీ అదే సమయంలో కేటీఆర్ను సీఎం చేస్తానని, తమ పార్టీ ఎన్డీయేలో చేరేందుకు అనుమతించాలని ప్రధానిని కేసీఆర్‌ కోరినట్టుగా మోదీ కామెంట్లను బట్టి తెలుస్తోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *