దిగొస్తున్న బంగారం ధరలు

విూరు గోల్డ్‌ ఇప్పుడు కొనాలనుకుంటున్నారా? అయితే సరైన సమయమే.. ఇటీవల రికార్డు స్థాయిలకు చేరిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు వరుసగా తగ్గుకుంటూ వస్తున్నాయి. మళ్లీ సామాన్యులు కొనేందుకు అందుబాటులోకి వస్తున్నాయి. అంతర్జాతీయంగా వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉండటం.. యూఎస్‌ ఫెడ్‌ కూడా ఈ ఏడాది మరో రెండు సార్లు వడ్డీ రేట్లను పెంచుతామని సంకేతాలు ఇవ్వడం కారణంగా అక్కడ బాండ్‌ ఈల్డ్స్‌, డాలర్‌కు గిరాకీ పెరిగి బంగారం విలువ పడిపోతుంది. ఇది రానున్న రోజుల్లో మరింత కిందికి చేరే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్‌ మార్కెట్లో స్పాట్‌ గోల్డ్‌ రేటు ఔన్సుకు 1915 డాలర్లకు దిగొచ్చింది. ఇక వెండి కూడా భారీగా పడిపోయింది. కొద్దిరోజుల కిందటి వరకు 25 డాలర్ల పైన ట్రేడ్‌ కాగా.. ఇప్పుడు స్పాట్‌ సిల్వర్‌ ఔన్సుకు 22.20 డాలర్ల వద్ద కొనసాగుతోంది.ఇంటర్నేషనల్‌ మార్కెట్లో గోల్డ్‌ రేట్లు పడుతున్న క్రమంలోనే దేశీయంగా కూడా భారీగా దిగొస్తున్నాయి. హైదరాబాద్‌లో బంగారం ధర వరుసగా పడుతుంది. ఇవాళ 22 క్యారెట్లకు చెందిన బంగారం రేటు రూ. 200 పడిపోయి ప్రస్తుతం 10 గ్రాములకు రూ. 54,500 వద్ద కొనసాగుతోంది. మరోవైపు 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ.220 పడిపోయి 10 గ్రాములకు రూ. 59,450 మార్కుకు చేరింది. వరుసగా 6 రోజులుగా బంగారం ధర పెరగలేదు. ఈ క్రమంలో సుమారు రూ.700 వరకు రేటు తగ్గింది.హైదరాబాద్‌తో పాటే దిల్లీ మార్కెట్లో కూడా బంగారం రేటు దిగొచ్చింది. ఇక్కడ 22 క్యారెట్లకు చెందిన తులం బంగారం ధర రూ.200 తగ్గి ప్రస్తుతం 10 గ్రాములకు రూ.54,650 వద్ద ట్రేడవుతోంది. మరోవైపు 24 క్యారెట్స్‌ గోల్డ్‌ రేటు రూ.220 పడిపోగా తులానికి ఇప్పుడు రూ.59,600 వద్ద ఉందిఇక వెండి రేట్ల పరంగా చూస్తే దిల్లీలో రెండు రోజుల వ్యవధిలో రూ.2000 పతనమైంది. వరుసగా రూ.1000 చొప్పున తగ్గింది. దీంతో కేజీ సిల్వర్‌ రేటు దేశ రాజధానిలో రూ. 72000 వద్ద ఉంది. ఇక హైదరాబాద్‌లో తాజాగా కిలో వెండి ధర రూ.1500 పడిపోయింది. 3 రోజుల్లోనే ఏకంగా రూ.4000 పడిపోవడం విశేషం. దీంతో ఇప్పుడు హైదరాబాద్‌ మార్కెట్లో కిలో వెండి రేటు రూ.75000 వద్ద కొనసాగుతోంది. ఇక బంగారం, వెండి ధరలు ప్రాంతాలను బట్టి హెచ్చుతగ్గులు కనిపిస్తుంటాయి. స్థానిక పన్నుల్లో మార్పులు ఇందుకు కారణంగా చెప్పొచ్చు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *