రెడ్‌?క్రాస్‌?బ్లడ్‌?బ్యాంకులో విస్తుపోయే నిజాలు

హైదరాబాద్‌లోని నల్లకుంట విద్యానగర్‌?పరిధిలో ఉంటే రెడ్‌?క్రాస్‌?బ్లడ్‌?బ్యాంకులో రోజుకో రీతిలో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. దానిని అన్‌?క్వాలిఫైడ్‌?స్టాఫ్‌తో మెయింటెన్‌?చేస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. వారి నిర్లక్ష్యంతోనే ఇటీవల తలసేమియాతో బాధపడుతున్న ఓ బాలుడికి హెచ్‌ఐవీ సోకిందని స్థానికులు చెబుతున్నారు. సరైన ట్రైనింగ్‌?లేకుండా తప్పుడు సర్టిఫికెట్‌లు సృష్టించి చాలా మంది స్టాఫ్‌ ఇక్కడ పని చేస్తున్నట్టు సమాచారం. టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, అకౌంటెంట్లు, స్టోర్‌?కీపర్‌, టెక్నికల్‌?సూపర్‌?వైజర్లు, సైంటిఫిక్‌ వంటి స్టాఫ్‌తో పాటు మెడికల్‌?ఆఫీసర్‌ కూడా అర్హత లేకున్నా వర్క్‌ చేస్తున్నట్టు సమాచారం. అనుభవం ఉన్న వారిని తొలగిస్తున్న సదరు మెడికల్‌?ఆఫీసర్‌?తన అనుకున్న వారికి మాత్రమే రిక్రూట్‌?చేసుకున్నట్లు ఓల్డ్‌?స్టాఫ్‌?ఆరోపించారు.ఈ బ్రాంచ్‌లో అవకతవకలు జరుగుతున్నాయని ఇటీవల హెడ్‌?బ్రాంచ్‌?అధికారులు ఎంక్వైరీ చేశారు. కానీ జరిగే తప్పిదాలు కనిపించకుండా మెడికల్‌? ఆఫీసర్‌? ముందస్తుగానే జాగ్రత్త పడినట్టు చర్చ సాగుతున్నది. డ్రగ్‌? అండ్‌ ?కాస్మోటిక్స్‌ ?యాక్ట్‌? ప్రకారం 20 వేల యూనిట్లు ఉండే ఈ బ్లడ్‌? బ్యాంకులో ఎండీ పాథాలజిస్ట్‌? ఉండాలి. ఎంబీబీఎస్‌? పూర్తి చేసి కనీసం ఐదేండ్లు వైద్య సేవలందించి ఉండాలి. ఇవేవిూ అర్హతలు లేకున్నా ఆయన మెడికల్‌? ఆఫీసర్‌గా కొనసాగుతున్నట్లు కొందరు బాధితులు ఆరోపిస్తున్నారు.రెండేండ్ల క్రితం ఈ బ్రాంచ్‌లో ఆర్మీ క్యాంపు నుంచి వచ్చిన 12 బ్యాచ్‌ల బ్లడ్‌ను కేవలం ఒక టెక్నిషియన్‌ మాత్రమే ఒవర్‌?నైట్‌లో స్క్రీనింగ్‌?పూర్తి చేయడం గమనార్హం. 1,200 బ్లడ్‌?బ్యాగ్‌లకు ఒక్కరు ఎలా టెస్టులు చేశారనేది.. ఇప్పటికీ ఆ బ్రాంచ్‌? స్టాఫ్‌తో పాటు ఆఫీసర్లకూ సందేహాలొస్తున్నాయి. వాస్తవానికి ఒక్కో బ్యాచ్‌కు 100 బ్యాగులుంటాయి. ఒక్కో బ్యాగులో 100 యూనిట్లు రక్తం ఉంటుంది. ఒక బ్యాచ్‌కు చెందిన రక్తం బ్యాగ్‌లకు స్క్రీనింగ్‌, ప్లాస్మా వేరు చేయడం, హెచ్‌ఐవీ, వివిధ రకాల పరీక్షలను ఇద్దరు వ్యక్తులు కలిసి చేస్తే కనీసం 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది.కానీ 12 బ్యాచ్‌లకు చెందిన బ్యాగ్‌లను ఒక వ్యక్తితో తెల్లవారే సరికి స్క్రీనింగ్‌ పరీక్షలు చేయించడం ఎలా సాధ్యమైందనేది అంతుచిక్కని ప్రశ్న. బ్యాచ్‌కు రూ.1000 చొప్పున అంటే రూ.12 వేల కమిషన్‌ కోసం ఆ వ్యక్తి అలాంటి దారుణానికి పాల్పడినట్టు తెలిసింది. ఆ బ్యాగులను మెడికల్‌?ఆఫీసరే స్వయంగా ఆ టెక్నిషియన్‌కు ఇవ్వడం గమనార్హం. ఇప్పటికీ ఇలాంటివి జరుగుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి.బ్లడ్‌?బ్యాంకులో స్క్రీనింగ్‌? సమర్థవంతంగా జరగాలని అప్పటి ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌..? సీఎస్‌ఐఆర్‌? విధానంలో జర్మనీ టెక్నాలజీకి చెందిన ఓ మిషన్‌ను ఈ బ్రాంచీలో లాంచ్‌?చేశారు. కొద్ది రోజుల పాటు పని బాగానే సాగింది. ఈ క్రమంలో ఆ మిషన్‌?విూద పనిచేసే స్టాఫ్‌ను సదరు మెడికల్‌ ?ఆఫీసర్‌? తొలగించారు. నేటి వరకూ కొత్త స్టాఫ్‌ రిక్రూర్‌మెంట్‌ చేయలేదు. దీంతో సుమారు రూ.30 లక్షల విలువ చేసే మిషన్‌?మూల పడిరది. ఈ రెడ్‌?క్రాస్‌ ?బ్లడ్‌ ?బ్యాంక్‌? ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న..డ్రగ్‌? కంట్రోల్‌ ?అధికారులు పత్తా లేకుండా పోయారు. కొన్ని సార్లు తనిఖీ చేస్తున్న.. వచ్చారా..వెళ్లారా అన్న తీరులో ఉన్నదని స్వయంగా ఆ బ్లడ్‌ ?బ్యాంకుకు చెందిన ఓ వ్యక్తి చెప్పడం గమనార్హం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *