బీజేపీకి బ్రహ్మస్త్రంగా ఈడీ…

గతంలో సిబిఐని పంజరంలో బంధించబడి, అయ్యవారి పలుకులనే పలికే చిలుక అని ఏకంగా సుప్రీం కోర్టు పేర్కొన్నది. సరిగ్గా పదేళ్ల తర్వాత స్వేచ్ఛపొందిన ఆ చిలుకలు.. అదే కేంద్ర ఏజెన్సీ లు..సిబిఐ, ఈడీ, ఐటీ.. వాటి యజమానుల పలుకులు పలకడమేగాకుండా తమ యజమాని ఆదేశాలను తిరస్కరించిన వారి భరతం పడుతున్నాయి. దురదృష్టమేమంటే, అవి వాటి ప్రత్యేకతల్ని కోల్పోయి రాజకీయ అస్త్రాలుగా మారి, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలను మాత్రమే రామాజ్ఞలా పాటిస్తున్నాయి. కేంద్రం చేతిలో కీలుబొమ్మల్లా మారిన వాటిలో ఈడీ ఇటీవల బీజేపీకి బ్రహ్మాస్త్రంలా మారింది. కాగా సిబిఐ తమ విచారణ చేపట్టడానికి ఇంకా రాష్ట్ర ప్రభుత్వాల అనుమతిని కోరాల్సివస్తోంది. మనీలాండరింగ్‌ ప్రివెన్షన్‌ చట్టం`2002 క్రింద ఈడీ ఆ చట్టం అమలు విషయంలో స్పష్టమైన విచారణ చేపట్టడంలో అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఇటీవల సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు అడ్డంకులను తొలగించింది. 2022 జులై 26న రాజ్యసభలో ఒక సభ్యుని ప్రశ్నకు ఆర్ధిక మంత్రి సమా ధానం చెబుతూ, గత ప్రభుత్వంలో సుప్రీం కోర్టు 112 కేసులు చేపట్టిందని, 2014లో బీజీపే ప్రభు త్వం వచ్చిన తర్వాత తొలి ఎనిమిదేళ్లలో 3,010 కేసులు చేపట్టడం గమనార్హమని అన్నారు. భారతదేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కోర్టులో కేసు విచారణకంటే ముందే శిక్ష అమలు జరిగిపో తోవడం సమస్యలకు ఒక సమాధానంగా కనపడుతోంది. అసలు కేసు విచారణ కాలమే శిక్షగా మారడమే శిక్షల రేటు తగ్గడానికి కారణమవుతోంది. నిత్యం కాకపోయినా, పాక్షికంగా చేపట్టిన విచారణ ఆధారంగా, వాస్తవాలను సరిగా చూపలేకపోవడం పైనా ఛార్జీషీటు ఆధారపడి ఉంటోంది. ఈ రకంగా ప్రతిపక్షాలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడటానికి వీలవుతోంది. విచారణ పూర్తయ్యే సమయానికే జరగా ల్సిన నష్టం జరిగిపోతోంది. ఇటీవలి మహారాష్ట్రా రాజకీయ పరిణామాల్లో అనేకమంది ఎమ్మెల్యే లు, ఎంపీలు చాలామందిపై ఈడీ ఛార్జీలు ఎదుర్కొంటున్నందువల్లనే అవతలకి దాటేసేరు. అలాగే అనేకమంది ఎంపీలు కూడా ఈడీ చర్య ల పట్ల కాస్తంత భయపడ్డారు. అంతెందుకు, శివసేన మాజీ ఎమ్మె ల్యే అర్జున్‌ ఖోట్కర్‌ ఏకంగా విూడియా సమావేశంలో కన్నీళ్లపర్యంతమయ్యారు. కారణం ఏక్షణాన్నయినా అరెస్టు చేస్తారేమోనని, ఫలితంగా తన కుటుంబం రోడ్డు విూదకి వస్తుందన్న భీతి ఆయన్ను కలవర పెట్టిం ది. ఆయన ఆస్తులు ఈడీ లాగేసు కుంది. దీంతో ప్రత్యర్ధికి మద్దతు పలకడం తప్పనిసరి అయింది. ఈ సంఘటనల దృష్ట్యా, ప్రతీవారికి బీజేపీ నీడలోకి చేరడమే దాదాపు ప్రతీవారికీ శ్రీరామరక్షగా మారింది. పార్టీ అయినా ఎవరయినా నియమ నిబద్ధంగా ఉంటే రూలుకు కట్టుబడి వ్యవహరించి తన దారినే పోతుంటే ప్రభుత్వ అధీనంలోని సంస్థలు తప్పకుండా శిక్షిస్తున్నాయి. అదీ చట్టబద్ధంగా కాదు, దాడు లు, వేధిం పులు, తప్పుడు ఛార్జీలనే అస్త్రాలతోనే. మహారాష్ట్రలో రెబెల్స్‌ అధికారపగ్గాలు చేపట్టడానికి బీజేపీ నీడ లోకి వెళ్లాయి. కానీ సంజయ్‌ రౌత్‌ మాత్రం కేంద్రం ఒడిగడుతున్న దారుణ పాలనకు ఒగ్గేదే లేదన్నట్టు వ్యవహరించి ఈడీ దాడికి, అరెస్టుకు గురయ్యారు. ఆసక్తికరవిషయమేమంటే, బీజీపీ పవిత్ర నీడలోకి వచ్చినవారికి వారి గత తప్పిదాలను మాఫీ చేస్తోంది. వారిని సచ్ఛీలురుగానూ ప్రకటించేస్తోంది. 2014 నుంచి కనీసం 609 రాజకీయనాయకులను వారి కుటుం బాలను లక్ష్యంగా పెట్టుకుని దాడి చేస్తున్నాయి. వీరిలో కేవలం 39 మంది బీజేపీకి చెందినవారు కాగా, 570 మంది ప్రధాన ప్రతిపక్షానికి చెందినవారు. కాంగ్రెస్‌కి చెందినవారు గనుక బీజేపీ తీర్ధంపుచ్చుకుంటే ఈ దాడులు, కేసులకు కొంత దూరమై ఊపిరిపీల్చుకోగల్గుతారు. అసలు ఈ దాడులు, కేసుల మోతా హడా వుడి అంతా చిత్రంగా బీజేపీయేతర పార్టీల పాలనలోని రాష్ట్రాలకే పరిమితం కావడం. ఇలా ఏకపక్ష, కక్ష సాధింపు చర్యల్లో భాగంగా జరుగుతున్న దాడులు క్రమేపీ మరింత పకడ్బందీగా కొనసాగు తున్నాయి. ఇక ఇక్కడ సమస్యల్లా, 2018లో డైరక్టర్‌ పదవిలో ఉన్న వ్యక్తి సర్వీసును మరో ఏడాది పొడిగిస్తే ఏ విధంగా పదవిలో నిలబడగల్గుతారన్నది. వాస్తవానికి ఆయన మరో రెండు మూడు రోజుల్లో రిటైరు కానుం డగా పదవీ కాలాన్ని మరో ఏడాది పొడిగించారు. అందుకు సంబంధించి ఆదేశాలను సుప్రీంకోర్టు జారీ చేసింది. అన్నింటికంటే చిత్రమేమంటే ఈడీ చట్టం అమలు విషయం ఏమంటే, ఇడిసి ఐ నివేదిక బయటపెట్ట కుండానే రివ్యూకి ఆట్టే అవకాశం ఉండదు , చర్యలు వేగిరం చేయవచ్చు. ఈ రకమైన కొత్త విధానంతో ప్రాథమిక హక్కులకు భంగం చేకూరే అవకాశాలే ఎక్కువ. అందువల్ల దీని విషయంలో విపక్షాలు చట్టం అమలు గురించిన అంశాల్లో పునర్విచారణ చేపట్టాలని కోరుతున్నారు. ప్రస్తుత ప్రభుత్వం రూల్‌ ఆఫ్‌ లా స్థానంలో రూల్‌ బై లా నే ఎక్కువగా అనుసరిస్తున్నది. రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, వ్యాపారస్తుల విూద బీజేపీ ప్రభుత్వం కక్షగట్టినట్టుగా వేటాడుతోంది. ఇక ప్రతిపక్షాల విూద మరింత విరుచుకుపడడం, వేధించడం చూస్తుంటే ఇదంతా దీనికి అంతం ఎప్పుడు దేవా అని ప్రజలు కూడా గోడు పెడుతున్నారు. ప్రజాస్వామ్యం, అంతిమంగా మన దేశం ఇందుకు పెను సమస్యల్ని ఎదుర్కొంటున్నది. దీన్ని గురించి పార్లమెంటులో అసలు చర్చే లేకపోవడం, ప్రశ్నించే వారిని అణచి వేయడం, బాధ్యతా రాహిత్యం అన్నీ వెరసీ దేశంలో స్వేచ్ఛాస్వాతంత్య్రాలకు అవకాశం లేకుండా పోతుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *