అంజు కేసులో కొత్త ట్విస్ట్.. భర్త బయటపెట్టిన సంచలన రహస్యాలు.. మరో రెండు రోజుల్లో..

Anju Pakistan: రాజస్థాన్‌కు చెందిన అంజు అనే మహిళ గుర్తుందా? అదేనండి.. ఫేస్‌బుక్‌లో పరిచయమైన నస్రుల్లా అనే వ్యక్తి కోసం భర్త, పిల్లల్ని వదిలేసి పాకిస్తాన్‌కి వెళ్లింది. మొదట్లో అతడు కేవలం స్నేహితుడు మాత్రమేనని చెప్పిన అంజు, ఆ తర్వాత అతడ్ని పెళ్లి చేసుకుంది. అప్పుడే ఇస్లాం మతంని స్వీకరించి, ఫాతిమాగా మారింది. అప్పటి నుంచి ఫాతిమా, నస్రుల్లా దాంపత్య జీవితం సజావుగానే సాగింది. ఇప్పుడు వీరి వ్యవహారంలో కొత్త ట్విస్ట్ వెలుగు చూసింది. మరో రెండు రోజుల్లో ఫాతిమా అలియాస్ అంజు తిరిగి భారతదేశానికి రాబోతోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె భర్త నస్రుల్లా ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అంతేకాదు.. తానే అంజును భారత సరిహద్దు వద్ద దింపబోతున్నట్టు తెలిపాడు. ఇంకా మరెన్నో విషయాల్ని బయటపెట్టాడు.

ఓ పాకిస్తానీ యూట్యూబర్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నస్రుల్లా మాట్లాడుతూ.. తనకు, అంజుకి ఫేస్‌బుక్ ద్వారా పరిచయం ఏర్పడిందని, ఆమ్‌వే (Amway) కంపెనీ ఉత్పత్తికి సంబంధించి తమ మధ్య తొలి సంభాషణ ప్రారంభమైందని అన్నాడు. అప్పటి నుంచి క్రమంగా తమ సంభాషణ సాగిందని.. ఈ క్రమంలోనే తామిద్దరం ప్రేమలో పడ్డామని పేర్కొన్నాడు. మొదట్లో తానే తన ప్రేమని అంజుకి వ్యక్తపరిచానని, ఆమె వెంటనే అంగీకరించిందని తెలిపాడు. తన కోసం అంజు రావల్పిండికి వచ్చిందని.. తాను ఆమెని పికప్ చేసుకోవడానికి వెళ్లానని చెప్పాడు. సీమా హైదర్‌ను అంజుతో ఏమాత్రం పొల్చవద్దని కోరాడు. సీమా అక్రమంగా భారత్‌కు వెళ్లగా.. అంజు మాత్రం పర్యాటక వీసాతో పాకిస్తాన్‌కు వచ్చిందని వివరించాడు. ప్రస్తుతం అంజు విడాకుల కోసం భర్తతో గొడవ పడుతోందని, అతడు మాత్రం విడాకులపై సంతకాలు చేయడం లేదని వెల్లడించాడు.

అంజు ఒక క్రిస్టియన్ అని, తన ప్రేమ కోసం ఆమె మతాన్ని త్యాగం చేసి ఇప్పుడు ఫాతిమాగా మారిందని చెప్పుకొచ్చాడు. తమ ప్రేమకథ గురించి తెలిసి పాకిస్తానీయుల వద్ద నుంచి ఎన్నో బహుమతులు వచ్చాయని, ఇప్పటికీ వస్తూనే ఉన్నాయని నస్రుల్లా తెలిపాడు. ఇండియాలో అంజుకి ఇద్దరు పిల్లలు ఉన్నారని, కేవలం వారి కోసమే అంజు భారత్‌కి వెళ్తోందని చెప్పాడు. ఈ నెలాఖరున అంజు ఇండియాకి వెళ్తుందని, అందుకు సంబంధించిన పత్రాలు సిద్ధంగా ఉన్నాయని అన్నాడు. పిల్లల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నది అంజుకే వదిలేశానన్నాడు. తమ ప్రేమ కరోనా కంటే ముందే మొదలైందని, గత నాలుగేళ్లుగా తాను అంజుని ప్రేమిస్తున్నానని నస్రుల్లా స్పష్టం చేశాడు. అటు.. అంజు సైతం తనపై వచ్చిన ప్రతి ఆరోపణకు భారతదేశానికి వచ్చి సమాధానం ఇస్తానని క్లారిటీ ఇచ్చింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *