మళ్లీ పీకే టీమ్‌ ఎంట్రీ

జగన్‌ మరోసారి ముఖ్యమంత్రి పదవిని అందుకోవాలని ఆశిస్తున్నారు. అందుకోసం గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారు. గత ఎన్నికల్లో వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌ చెప్పినట్లే నడుచుకున్నారు. ఆయనిచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ తో పాటు సూచనలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. గత ఎన్నికల్లో ప్రశాంత్‌ కిషోర్‌ చెప్పినట్లుగానే 90 శాతం నిర్ణయాలు తీసుకున్నారు. కానీ ఈసారి ప్రశాంత్‌ కిషోర్‌ లేరు. ఆయన తన రాజకీయం కోసం బీహార్‌ లో బిజీబిజీగా ఉన్నారు. దీంతో ఆయన టీం మాత్రం జగన్‌ కు అండగా ఉంది. వరసగా సర్వేలు చేస్తూ జగన్‌ కు నేరుగా నివేదికలను అందిస్తుంది. ముఖ్య కార్యకర్తలు… పీకే టీం ఇస్తున్న నివేదికలు జగన్‌ ను సయితం ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయట. అనేక నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతతో పాటు క్యాడర్‌ కూడా నిరుత్సాహంలో ఉంది. గత ఎన్నికలలో పనిచేసిన కార్యకర్తలు ఇప్పుడు అనేక నియోజకవర్గాల్లో పార్టీకి దూరంగా ఉంటున్నారు. ముఖ్య కార్యకర్తలను పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దూరం పెట్టడం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని పీకే టీం నివేదిక ఇచ్చినట్లు తెలిసింది. ఎమ్మెల్యేలు పక్కన పెట్టి…. ముఖ్య కార్యకర్తలు మౌనంగా ఉండటం పార్టీకి మంచిది కాదని, వారు 2019 ఎన్నికల్లో ఏదీ ఆశించకుండా ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారని పీకే టీం తెలిపింది. కానీ అధికారంలోకి రావడంతో వారు కొంత ఆశలు పెంచుకున్న మాట వాస్తవమేనని, పదవులకు, ఇతర పనులకు ఎమ్మెల్యేలు దూరంగా ఉంచడంతోనే వారు పార్టీకి దూరంగా ఉంటున్నారని పీకే టీం నివేదిక ఇచ్చింది. వారు మరే ఇతర పార్టీలకు వెళ్లకుండా తమకు వైసీపీలో అన్యాయం జరిగిందని ప్రభుత్వం చేస్తున్న అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు కూడా ప్రజల చెంతకు తీసుకెళ్లడానికి ఇష్టపడటం లేదు. అందుకే జగన్‌ ఈ నిర్ణయం… ఈ విషయాన్ని పీకే టీం జగన్‌ దృష్టికి తీసుకెళ్లడంతోనే ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని జగన్‌ ఏర్పాటు చేశారని చెబుతున్నారు. నియోజకవర్గాల వారీగా యాభై మంది కార్యకర్తలను ఎంపిక చేసే బాధ్యత కూడా పీకే టీం కు జగన్‌ ఇవ్వడం వెనక కూడా వారిలో తిరిగి జోష్‌ నింపేందుకేనంటున్నారు. జగన్‌ నేరుగా మాట్లాడి వారికి హావిూలు ఇవ్వడంతో పాటు భవిష్యత్‌ లో పదవులు, పనులపై ప్రాముఖ్యత ఇచ్చే దిశగా కొన్ని ప్రామిస్‌ లను వారికి ఇవ్వనున్నారని తెలిసింది. ఎమ్మెల్యేలకు కూడా ముఖ్య కార్యకర్తల విషయంలో కొన్ని సూచనలు చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈరోజు జరిగే కార్యకర్తల సమావేశంలో జగన్‌ ఏం చెబుతారన్నది ఆసక్తికరంగా మారింది. ఎమ్మెల్యేలు కూడా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *