నేడు కేంద్ర మాజీ మంత్రి టైగర్‌ ఆలె నరేంద్ర వర్థంతి

ఆలె నరేంద్ర 1946, ఆగష్టు 21న హైదరాబాదులోని నారాయణగూడలో పుష్పవతి, రామలింగం దంపతులకు జన్మించారు. ఇంటి పేరు ఆలె బదులు అంతా టైగర్‌ నరేంద్ర అని పిలిచేవారు. స్థానికంగా హైదరాబాదులోనే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బియస్సీ పూర్తిచేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు క్రియాశీలక కార్యకర్తగా పదిహేడేళ్ల వయసులో రాజకీయాల్లోకి వచ్చారు. సిమ్లా ఒప్పందానికి వ్యతిరేకంగా సాగిన ఉద్యమంలో పాల్గొని తీహార్‌ జైల్లో నెలపాటు శిక్షననుభవించారు. 1975లో ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా ఉద్యమించి 18 నెలలపాటు జైల్లో ఉన్నారు. 1969`1972 వరకూ జన్‌సంఫ్‌ుకు ఫుల్‌టైమర్‌గా పని చేశారు. జనసంఫ్‌ు జనతా పార్టీలో విలీనమైన తర్వాత 1980లో మొదటిసారిగా ఆ పార్టీ అభ్యర్థిగా హైదరాబాద్‌ పార్లమెంట్‌కు పోటీ చేసి ఓడిపోయారు. 2003 వరకు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్‌ విభాగములో చెప్పుకోదగిన పాత్ర పోషించారు. నరేంద్ర 2004 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ నుండి బయటికి వచ్చి ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనకై తెలంగాణ సాధన సమితి అనే ఒక రాజకీయ వేదికను ప్రారంభించాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పతాకస్థాయిలో ఉన్న దశలో తను స్థాపించన వేదికను కె.చంద్రశేఖరరావు ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర సమితిలో విలీనం చేశారు. ప్రారంభం నుంచి రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు సభ్యుడైన నరేంద్ర 1983 నుంచి 1994 మధ్యకాలంలో భారతీయ జనతా పార్టీ తరఫున ఆంధ్రప్రదేశ్‌ శాసనసభకు హిమాయత్‌నగర్‌ నియోజకవర్గం నుంచి మూడు పర్యాయాలు ఎన్నికైనాడు. 1978లో ఖైరతాబాదు నియోజకవర్గంలో పోటీ చేసి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పి.జనార్థనరెడ్డి చేతిలో కేవలం 659 ఓట్ల తేడాతో ఓడిపోయారు. 1980లో హైదరాబాదు లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేసి కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కె.ఎస్‌.నారాయణ చేతిలో పరాజయం పొందారు. 1983లో హిమయత్‌ నగర్‌ శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి పి.ఉపేంద్ర పై గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టారు. 1985లో మళ్ళీ అదే స్థానం నుంచి పోటీ చేసి కె.ప్రభాకరరావుపై గెలుపొందాడు. 1992లో హిమయత్‌ నగర్‌ శాసనసభ నియోజకవర్గంలో గెలుపొంది మూడవసారి శాసనసభలో అడుగుపెట్టాడు. 1994లో తెలుగుదేశం పార్టీకి చెందిన కృష్ణయాదవ్‌ పై ఓడిపోయాడు.1999లో భారతీయ జనతా పార్టీ తరఫున లోక్‌సభకు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన బాగారెడ్డిపై విజయం సాధించి తొలిసారి లోక్‌సభ సభ్యులైయ్యారు. 2003 వరకు భారతీయ జనతా పార్టీలో మంచి పేరు సంపాదించుకొని అభిమానులచే టైగర్‌గా పిలుపించుకున్నాడు. ప్రత్యేక తెలంగాణా వాదంతో కె.చంద్రశేఖర్‌ రావు ప్రారంభించిన పార్టీలో చేరి ఆ పార్టీలో రెండో ముఖ్య నాయకుడిగా వ్యవహరించారు. 2004లో మళ్ళీ మెదక్‌ నియోజకవర్గం నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి తరఫున పోటీ చేసి భారతీయ జనతా పార్టీకు చెందిన పి.రామచంద్రారెడ్డిపై 1,23,756 ఓట్ల మెజారిటీతో గెలిచి రెండో పర్యాయం లోక్‌సభలో అడుగుపెట్టడమే కాకుండా మే 23 న కేంద్రంలో మన్మోహన్‌ సింగ్‌ నేతృత్వంలోని యుపిఏ ప్రభుత్వంలో గ్రావిూణాభివృద్ధి శాఖా మంత్రిపదవిని పొందారు.నకిలీ వీసా కేసులో చిక్కుకొని ఏప్రిల్‌ 2007లో తెలంగాణా రాష్ట్ర సమితి నుంచి బహిష్కృతుడై , ఆ తర్వాత తెలంగాణ రాష్ట్ర సమితి (నరేంద్ర) అనే కొత్త పార్టీని స్థాపించాడు. ఆ పార్టీకి జనాదరణ లభించకపోవడంతో 2008 జనవరి 8న హైదరాబాదులో మాయావతి సమక్షంలో బహుజన సమాజ్‌ పార్టీలో చేరారు. అమెరికాతో అణుఒప్పందం విషయంలో వామపక్షాలు యు.పి.ఏ.ప్రభుత్వానికి మద్దతును ఉపసంహరించుకున్న పిదప జరిగిన పరిణామాలతో నరేంద్ర యు.పి.ఏ.ప్రభుత్వానికి మద్దతు ఇచ్చి ఆ అనంతరం కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు. 2009 ఎన్నికలకు ముందే కాంగ్రెస్‌ పార్టీ తరఫున రాజ్యసభకు ఎన్నికైయ్యాడు. అనంతర కాలంలో భారతీయ జనతా పార్టీలో చేరి పనిచేశాడు.అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్‌కు చెందిన నాంపల్లి లోని కేర్‌ ఆసుపత్రిలో ఏప్రిల్‌ 9, 2014న మరణించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *