రాహుల్‌ పాదయాత్రకు సిద్ధం

దేశంలో విపక్షాలన్నీ బీజేపీని గద్దె దింపాలన్న సంకల్పంతో ఉన్నాయి. బీజేపీయేతర పార్టీల పాలన లో ఉన్న రాష్ట్రాల్లో పాలన అస్తవ్యస్థం చేసేలా కేంద్రం వ్యవహరిస్తోందనీ, బీజేపీయేతర రాష్ట్రాల పాలనలో ఉన్న రాష్ట్రాలలో పరిస్థితులను దుర్భరం చేస్తోందని, అక్కడి అధికారంలోని పార్టీల్లో విభేదాలు సృష్టించి అధికారం చేజిక్కించుకోవాలన్న తపన తప్ప అసలు ప్రజాసమస్యల్నే పట్టించుకోవడం లేదని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.అందుకు ఉదాహరణగా మహారాష్ట్ర పరిణామాలను చూపుతున్నాయి. అలాగే మనీ లాం డరింగ్‌ కేసులో కాంగ్రెస్‌ అధినేత సోనియా గాంధీని ఈడీ విచారణ వెనుక కూడా బీజేపీ నాయకుల ప్రేరణ ఉందని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. అనారోగ్యంతో బాధ పడుతూన్న కాంగ్రెస్‌ అధినేత్రిని విచారణ పేరిట ఈడీ కార్యాలయానికి పిలిపించుకుని రోజుల తరబడి ప్రశ్నించడం దారుణమని దుమ్మెత్తి పోస్తున్నాయి. కేంద్రంలోని బీజేపీని దీటుగా ఎదుర్కొనాలంటే బీజేపీయేతర పార్టీలన్నీ ఏకతాటివిూదకు రావాల్సిన అవసరాన్ని విపక్షాలు గుర్తించాయి. సోనియా గాంధీ విచారణను వ్యతిరేకిస్తూ కాంగ్రెస్‌ చేపట్టిన ఆందోళనల్లో బీజేపీయేతర పక్షాలన్నీ కలిసి రావడం ఇందులో బాగమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో విపక్షాలను పార్టీ బలోపేతం లక్ష్యంగా కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ సుదీర్ఘ పాద యాత్రకు నిర్ణయించుకున్నారు. ఆయన అక్టోబర్‌ 2వ తేదీన కాశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకూ భారత్‌ జోడో పేరుతో పాదయాత్రం ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా తెలంగాణాలోనూ దాదాపు 350 కిలోవిూటర్ల పాద యాత్రకు టీపీసీసీ ఏర్పాట్లు చేపట్టింది. మొత్తం 17 రోజుల పాటు రాష్ట్రంలో ఈ పాదయాత్రం కొనసాగుతుంది.డిసెం బర్‌ లో కర్ణాటక నుంచి రాహుల్‌ యాత్ర జరగనుంది. 15 నియోజక వర్గాలు కవర్‌ అయ్యేలా యాత్రకు ప్లాన్‌ చేస్తున్నారు. ఇదిలా ఉండగా, తెలంగాణా మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్‌ అధిష్టానం త్వరలో నిర్ణయం తీసుకోనున్నదని తెలుస్తోంది. ఢల్లీిలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌తో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, సీనియర్‌ నేత జానారెడ్డి భేటీ అయ్యారు. పదేపదే కాంగ్రెస్‌ పై విమర్శలు చేస్తున్న రాజగోపాల్‌పై సస్పెన్షన్‌ వేటు వేసే అంశాన్ని ఈ సందర్భంగా పరిశీలించినట్లు సమాచారం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *