సడెన్‌ గా ప్లేటు ఫిరాయించిన గులాబీ

నిన్నటి వరకు తమకు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అన్న బీఆర్‌ఎస్‌ సడెన్‌ గా ప్లేటు మార్చింది. బీజేపీతో యుద్దం చేసి అలసిపోయినట్టుంది బీఆర్‌ఎస్‌ నాయకత్వం. ఏకంగా ఎన్నికల స్ట్రాటజీ ని మార్చేసింది. బీజేపీ విూద తీవ్ర ఆరోపణలు చేసిన బీఆర్‌ఎస్‌ ఈ కొత్త పల్లవి బీఆర్‌ఎస్‌ ప్లీనరీలో పురుడుపోసుకుంది. తెలంగాణలోనే కాదు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో బీజేపీ నామా రూపాలు లేకుండా చేయాలని బీజేపీ కలలు కన్నది. బీజేపీ, కాంగ్రెస్‌ లకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమి ఏర్పాటు చేయడానికి బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కే. చంద్రశేఖరరావు దేశమంతా అలుపుసొలుపు లేకుండా బొంగరంలా తిరిగారు. మొన్న ఔరంగాబాద్‌ లో కూడా బీజేపీని టార్గెట్‌ చేశారు. మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చేవెళ్ల సభలో అమిత్‌ షా చేసిన ప్రసంగాన్ని సీరియస్‌ గా మరాఠాప్రజల ముందు పెట్టారు. రెండ్రోజుల్లో ఏమయ్యిందో తెలియదు కానీ బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కె. తారకరామారావ్‌ మాట మార్చి కాంగ్రెస్‌ విూద విరుచుకుపడ్డారు.బీఆర్‌ ఎస్‌ ఆవిర్బావం రోజు కూడా కేసీఆర్‌ బీజేపీ యేతర పార్టీలను ఆహ్వానించారు. కాంగ్రెస్‌ పార్టీని కూడ దూరం పెట్టినప్పటికీ బీజేపీని మరీ దూరంగా పెట్టింది బీఆర్‌ ఎస్‌. మద్యం కుంభకోణంలో ఉన్న బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కూతురు కవితను ముద్దు పెట్టుకుంటారా అని బీజేపీ చీఫ్‌ బండి సంజయ్‌ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి. పదో తరగతి ప్రశ్నా పత్రం లీకేజీ కేసులో బీజేపీని బీఆర్‌ఎస్‌ టార్గెట్‌ చేసింది.తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ప్రశ్నా పత్రం లీకేజీ వ్యవహారంలో కేటీఆర్‌ హస్తముందని బీజేపీ ఆరోపించింది. యుపిలో గ్యాంగ్‌ స్టర్‌ అతీక్‌ కంటే కేసీఆర్‌ యమ డేంజర్‌ అంటూ బుధవారం బండి సంజయ్‌ ట్వీట్‌ చేశారు. పచ్చ గడ్డి వేస్తే కూడా భగ్గుమనే స్థాయికి బీజేపీ, బీఆర్‌ ఎస్‌ రాజకీయాలు మారాయి. ఔరంగా బాద్‌ తర్వాత బీఆర్‌ఎస్‌ తన ప్రత్యర్థి స్థాయి తగ్గిద్దామన్న నిర్ణయించుకున్నట్టు కనబడుతోంది. బీజేపీ స్థానే కాంగ్రెస్‌ తన ప్రధాన ప్రత్యర్థి అని స్టేట్‌ మెంట్‌ ఇచ్చింది.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు గల్లంతు అవుతాయని గురువారం బీఆర్‌ఎస్‌ ప్లీనరీ సమావేశంలో కేటీఆర్‌ అన్నారు. దేశంలో ఉన్న పొలిటికల్‌ వాక్యూమ్‌ ను 2024 లోకసభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ పూడుస్తుందన్నారు. ప్రతీరోజు బీజేపీని విమర్శిస్తే దాని స్థాయి పెరుగుతోందని బీఆర్‌ఎస్‌ భావన. సైలెంట్‌ అయితే ప్రత్యర్థిని దొంగ దెబ్బ కొట్టవచ్చని కేసీఆర్‌ వ్యూహంగా కనిపిస్తోంది. మహరాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాల్లో బీఆర్‌ఎస్‌ ని బలోపేతం చేయాలని ఆయన ఆలోచనగా కనబడుతోంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్‌ విూద ఫోకస్‌ పెడితే లాభపడవచ్చని కేసీఆర్‌ యోచిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *