రిజిస్ట్రేషన్‌ శాఖలో ఇ?స్టాంపింగ్‌

ఆదాయాన్ని ఆర్జించే శాఖలపై ముఖ్యమంత్రి జగన్‌ సవిూక్షించారు. ప్రజలకు అత్యుత్తమమైన సేవలు అందించేలా చూడాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ సేవల్లో మానవ ప్రమేయాన్ని తగ్గించి… . అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సేవలందించే విధానాలపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. మెరుగైన విధానాలను రూపొందించాలని సూచించారు.
ఇక రిజిస్ట్రేషన్‌ శాఖలో ఇ?స్టాంపింగ్‌ సేవలను ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి క్యాంప్‌ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ప్రారంభించారు. ఫలితంగా రిజిస్ట్రేషన్‌ సేవలు ఇక సులభతరం కానున్నాయి. ఇ ?స్టాంపింగ్‌ సేవలు ప్రారంభం కావటంతో ప్రజలే నేరుగా స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజులు చెల్లించే అవకాశం ఏర్పడిరది. ప్రజలే స్వయంగా దస్తావేజులు తయారు చేసుకుని సులభతరంగా రిజిస్ట్రేషన్‌ చేసుకునే విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఇ?స్టాంపింగ్‌ ప్రయోజనాలు
ఈ విధానం సురక్షితమైనది, భద్రతగలది మరియు ఎలాంటి సాంకేతిక సమస్యలు లేనిది.లిలిలి.బష్ట్రఞతిశ్రీవబబిజీఎజూ.ఞనీఎ వెబ్‌సైట్‌లో మరియు ఇ?స్టాంపింగ్‌ మొబైల్‌ యాప్‌ ద్వారా ఇ?స్టాంపులు ఆన్‌లైన్‌లో ధ్రువీకరించుకోవచ్చు.నగదు,చెక్కు,ఆన్‌లైన్‌ (నెఫ్ట్‌, ఆర్టీజీఎస్‌, పీఓఎస్‌,యూపీఐ) ద్వారా సులభంగా చెల్లింపులు చేయవచ్చు.ఎస్‌బీఐ,ఆప్కాబ్‌, యూనియన్‌ బ్యాంకులకు చెందిన ఎంపిక చేసిన బ్రాంచ్‌లు, సీఎస్‌సీ కేంద్రాలు, స్టాంప్‌ అమ్మకందార్లు, స్టాక్‌హోల్డింగ్‌ బ్రాంచ్‌లు కలిపి మొత్తం 1400 కు పైగా కేంద్రాల వద్ద ఈ సదుపాయం అందుబాటులో ఉంటుందిమరొక 1000కి పైగా కేంద్రాల వద్ద త్వరలో ఈసేవలు అందుబాటులోకి రానున్నాయిఇప్పుడు ఏపీలో క్రయవిక్రయాలు నిర్వహించే పౌరులందరూ 1400 కు పైగా ఎంపిక చేసిన కేంద్రాల వద్ద ఇ?స్టాంపింగ్‌ ద్వారా స్టాంప్‌ పేపర్లు కొనుగోలు చేసి సులభంగా స్టాంప్‌ డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ ఫీజు, యూజర్‌ ఛార్జీలను చెల్లించవచ్చు.స్టాంప్‌ మరియు రిజిస్ట్రేషన్‌ శాఖ సెంట్రల్‌ రికార్డు నిర్వహించే ఏజెన్సీ అయిన స్టాక్‌ హోల్డింగ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా ద్వారా ఏపీ ప్రభుత్వం అందిస్తున్న మరొక ప్రజాహితమైన కార్యక్రమం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *