మే 10న ఇంటర్‌ రిజల్ట్స్‌, 15న టెన్త్‌ ఫలితాలు

తెలంగాణలోపదోతరగతి, ఇంటర్‌ పరీక్షలు పూర్తిచేసిన విద్యాశాఖ అధికారులు ఇక ఫలితాలపై దృష్టి సారించారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ప్రారంభమైంది. దీంతో ఇక ఫలితాల విడుదలపై అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఎంసెట్‌, నీట్‌, జేఈఈ ప్రవేశ పరీక్షలు ఉన్న నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఇంటర్‌ వాల్యుయేషన్‌ ప్రక్రియను పూర్తిచేసి మే 10న ఇంటర్‌ ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్‌ బోర్డు భావిస్తోంది. ఈ ఏడాది ఇంటర్‌ పరీక్షలకు 9 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు. షెడ్యూలు ప్రకారం మార్చి 15 నుంచి ఏప్రిల్‌ 4 వరకు ఇంటర్‌ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇంటర్‌ పరీక్షలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో ఏప్రిల్‌ 3న పదోతరగతి పరీక్షలు ప్రారంభించారు. ఏప్రిల్‌ 11తో ప్రధాన పరీక్షలు ముగియగా. ఇక ఏప్రిల్‌ 11తో ఒకేషనల్‌ పరీక్షలు, ఏప్రిల్‌ 13తో ఓరియంటెల్‌ పరీక్షలు ముగిశాయి. మూల్యాంకన ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభమైంది. ఈనేపథ్యంలో వీలైనంత త్వరగా ఫలితాలను విడుదల చేసేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఏప్రిల్‌ 21 వరకు మూల్యాంకనం చేపట్టి, ఆ తర్వాత టాబ్యులేషన్‌ నిర్వహించి మే 15న టెన్త్‌ ఫలితాలను వెల్లడిరచేందుకు అధికారులు కసరత్తులు చేస్తున్నారు. ఈ ఏడాది పదోతరగతి పరీక్షలకు 4,84,384 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. అయితే దీనిపై అధికారుల నుంచి ఇంకా పూర్తిస్థాయి స్పష్టత రావాల్సి ఉంది.
తెలంగాణలో జూనియర్‌ కళాశాలల అకడమిక్‌ ?క్యాలెండర్‌?ని ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని జూనియర్‌? కళాశాలలు జూన్‌? 1న ప్రారంభమవుతాయిన బోర్డు అధికారులు ఏప్రిల్‌ 1న వెల్లడిరచారు. జూన్‌ 1 నుంచే తరగతులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ మేరకు 2023`24 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక విద్యా క్యాలెండర్‌ బోర్డు వెలువరించింది. కటించిన క్యాలెండర్‌ ప్రకారం.. జూనియర్‌ కాలేజీలకు అక్టోబర్‌ 19 నుంచి 25 వరకు దసరా సెలవులు, 2024, జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. కాగా, ఇంటర్మీడియట్‌ విద్య కోసం ఈ ఏడాది మొత్తం 227 పని దినాలు ఉంటాయని బోర్డు తెలిపింది. ఇక ఫిబ్రవరి రెండో వారం నుంచి ఇంటర్‌ ప్రాక్టికల్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. థియరీ పరీక్షలను మార్చి మొదటివారం నుంచి నిర్వహిస్తారు. ఏప్రిల్‌ 1 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *