వైన్‌ కంపెనీ చీటింగ్‌

మంచిర్యాల జిల్లాలో వైన్‌ కంపెనీలో పెట్టుబడి పేరుతో భారీ మోసం జరిగింది. వాట్సాప్‌ గ్రూప్‌, యాప్‌ ద్వారా కేటుగాళ్లు కోట్లలో డబ్బులు కట్టించుకుని బోర్డు తిప్పేశారు.: మంచిర్యాల జిల్లాలో ఘరానా మోసం వెలుగుచూసింది. ది వైన్‌ కంపెనీ పేరుతో సోషల్‌ విూడియాలో గ్రూప్‌ క్రియేట్‌ చేసిన కేటుగాళ్లు… ఒక వైన్‌ బాటిల్‌ కొంటే 60 రోజుల్లో మూడిరతలు ఇస్తామని అమాయకులకు వల విసిరారు. అధిక డబ్బుకు ఆశపడిన చాలా మంది కొనుగోలు చేశారు. కేటుగాళ్లు కొద్దిరోజులకే యాప్‌ క్లోజ్‌ చేశారు. దీంతో బాధితులు లక్షల్లో నష్టపోయారు. చైన్‌ మార్కెటింగ్‌ పచ్చిమోసం అని తెలిసినా… ప్రజలు ఈజీగా మోసపోతున్నారు. తక్కువ టైంలో ఎక్కువ సంపాదన అనే ఆశతో ఉన్న కాస్త డబ్బును కూడా పోగొట్టుకుంటున్నారు. తాజాగా మంచిర్యాల జిల్లాలో వైన్‌ బాటిల్‌ కొనుగోలు పేరిట కేటుగాళ్లు కోట్లు కొల్లగొట్టారు. పెట్టుబడి పెడితే రెట్టింపు వస్తుందని ఆశ చూపి డబ్బులు కట్టించుకుని పత్తాలేకుండా పోయారు.ది వైన్‌ కంపెనీలో.. ఒక వైన్‌ బాటిల్‌ కొనుగోలు చేస్తే… 60 రోజుల్లో మూడిరతలు ఇస్తామని సైబర్‌ నేరగాళ్లు వల విసిరారు. ముందు కొందరిని జాయిన్‌ చేస్తే నెల నెలా జీతం కూడా ఇస్తామన్న ప్రకటించారు. డబ్బు వస్తుందని గుడ్డిగా నమ్మిన కొందరు.. ఆన్‌ లైన్‌ లో లక్షలు పెట్టి వైన్‌ బాటిల్స్‌ కొన్నారు. ముందుగా జనాన్ని నమ్మించేందుకు కొన్ని రోజుల పాటు రెట్టింపు నగదు ఇచ్చారు. ప్రజలతా నమ్మడంతో అవకాశం కోసం ఎదురుచూసి, పెట్టుబడి కోట్లకు చేరుకున్న తర్వాత… సేకరించిన సొమ్ముతో పరారయ్యారు. తెలంగాణ వ్యాప్తంగా వేలాది మంది ఈ స్కామ్‌ లో డబ్బులు పోగొట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఎక్కువ మంది మంచిర్యాల జిల్లాకు చెందిన వారే ఉన్నట్లు సమాచారం .వాట్సాప్‌ లో ది వైన్‌ గ్రూప్‌ పేరుతో నిర్వాహకులు గ్రూప్‌ ను క్రియేట్‌ చేశారు. ఇందులో కొందరిని యాడ్‌ చేసి… తాము ఈ కంపెనీలో పెట్టుబడి పెడుతున్నామని నమ్మించారు. ఓ లింక్‌ పంపించి.. దాని ద్వారా పెట్టుబడి పెట్టాలని సూచించారు. ఒక వైన్‌ బాటిల్‌ కొనుగోలు చేస్తే రెండు నెలల్లో మూడు రెట్లు ఇస్తామని నమ్మించారు. రూ. 85 వేలతో వైన్‌ బాటిల్‌ కొనుగోలు చేస్తే ప్రతి రోజూ రూ. 12,300 చొప్పున ఇస్తామన్నారు. నమ్మించేందుకు ముందు కొన్ని రోజుల పాటు కొంతమందికి డబ్బులు చెల్లించారు. డబ్బులు వస్తున్నాయని ఆశపడి చాలా మంది ఈ గ్రూప్‌ లో జాయిన్‌ అయ్యారు. ఒక యాప్‌ క్రియేట్‌ చేసి.. గోవా కేంద్రంగా పనిచేస్తున్నామని ప్రజల్ని నమ్మించారు. వైన్‌ బాటిల్‌ పై పెట్టుబడి పెట్టడమే కాకుండా చైన్‌ సిస్టమ్‌ లో 230 మందిని ఈ సంస్థలో జాయిన్‌ చేస్తే నెల నెలా రూ. 20 వేల వరకు జీతం వస్తుందన్నారు. దీంతో చాలా మంది తమకు తెలిసిన వారిని ఈ గ్రూప్‌ లో జాయిన్‌ చేయించారు. మే 30 వరకూ యాప్‌ లో నగదు చెల్లింపులు బాగానే చేశారు. మే 30 నుంచి డబ్బులు చెల్లించడం ఆగిపోయింది. డబ్బులు రాకపోవడంపై నిర్వాహకులను కస్టమర్లు సంప్రదిస్తే… పొంతనలేని కబుర్లు చెప్పారు.డబ్బులు తిరిగి రావాలంటే పేపాల్‌ కొనండి, సర్వర్‌ కొనండి అంటూ మెసేజ్‌ లు పెట్టారు. అంతే కాకుండా రూ.4 వేల నుంచి రూ.20వేల వరకు పెట్టుబడి పెడితే విూ సొమ్ము తిరిగి వస్తుందని నమ్మించి మరికొందరిని మోసం చేశారు. ఈ మాటలు నమ్మి చాలామంది సర్వర్‌ రూ.8 వేలు పెట్టి కొన్నారు. అయినా డబ్బు తిరిగి రాకపోవడంతో మోసం పోయామని బాధితులు గుర్తించారు. లబోదిబో అంటూ పోలీసులను ఆశ్రయించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *