బండి ఇంట్లో బలగం సినిమా రిపీట్‌

రెండు అంశాలు ఇప్పుడు గట్టిగా వినిపిస్తున్నాయి… ఒకటి రాజకీయ పరంగా పదో తరగతి పరీక్షా పత్రాలు లీక్‌ కావటం.. అందులో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అరెస్టు కావటం.. మరోవైపు ఊరురా జనమంతా కలిసి బలగం సినిమా చూసి భావోద్వోగానికి లోనవుతుండటం. అయితే.. బండి సంజయ్‌ ఇంట్లో కూడా బలగం సినిమాలోని సన్నివేశం రిపీటయ్యింది. అదేలా అంటారా..? పేపర్‌ లీక్‌ కేసులో అరెస్టయిన బండి సంజయ్‌ ఈరోజు బెయిల్‌పైన విడుదల కాగా.. తన అత్తమ్మ అయిన చిట్ల విజయమ్మ దశదిన కర్మ కార్యక్రమంలో పాల్గొని.. జరగాల్సిన కార్యక్రమాలు ఆయన చేతుల విూదుగానే జరిపించారు. అయితే.. తన అత్త చనిపోయిన తర్వాత చేసే అన్ని కార్యక్రమాల్లో తాను పాల్గొనలేకపోయారు. కాగా.. ఆయనను తన అత్తమ్మ కన్న కొడుకులా చూసుకుందని.. తాను రాలేదని నైవేద్యాన్ని(పిండం) పక్షి ముట్టలేదని ఆయనే స్వయంగా చెప్పారు. బెయిల్‌ పిటిషన్‌పై విచారణ జరుగుతున్న సమయంలోనూ.. బండి సంజయ్‌ తరఫు న్యాయవాదులు జడ్జికి చెప్పిన కారణాల్లో ఆయన అత్తమ్మ దశదిన కర్మ కూడా ఒకటి.తెలంగాణలో.. ఎవరైనా మనలోని వ్యక్తి చనిపోతే.. మూడు, ఐదు రోజుల్లో గానీ.. దశదినకర్మ రోజు గానీ.. వాళ్లకు ఇష్టమైన అన్ని వంటకాలు వండి.. కుటుంబసభ్యులు, ఆత్మీయులు, సన్నిహితులు… ఇలా తన బలగమంతా వచ్చి నైవేద్యం పెట్టినప్పుడు పక్షులు వచ్చి ముడితే.. వారి ఆత్మ సంతృప్తి చెందినట్టుగా భావిస్తారు. ఒకవేళ పక్షి ముట్టకపోతే.. చనిపోయిన వ్యక్తికి ఇష్టమైన వ్యక్తి ఎవరో రాలేదని అందుకే.. పక్షి ముట్టట్లేదని నమ్ముతారు. అచ్చం అలాంటి ఘటనే ఇక్కడ బండి సంజయ్‌ అత్తమ్మ విషయంలోనూ జరిగిందని.. స్వయంగా ఆయనే చెప్పటం గమనార్హం. అయితే.. ఇప్పుడు తెలంగాణలో ఓ రేంజ్‌లో కనెక్ట్‌ అయిన సినిమా బలగం కూడా అచ్చం ఇదే కాన్సెప్ట్‌ విూద తీసిందే. దీంతో.. బండి సంజయ్‌ ఇంట్లో కూడా బలగం సినిమా సన్నివేశం రిపీటయ్యిందంటూ కామెంట్ల వర్షం కురుస్తోంది.తెలంగాణలో ప్రస్తుతం ఏ పల్లె చూసినా.. ఏ పట్టణం చూసినా ‘బలగం’ సినిమా ఫీవర్‌ నడుస్తోంది. పల్లెల్లో తెరలు కట్టి మరీ బలగం సినిమా ప్రదర్శిస్తున్నారు. కుటుంబ పెద్ద చనిపోతే.. ఆ కుటుంబసభ్యులు, బంధువులు, సన్నిహితులు పడే బాధ, వారి భావోద్వేగానికి తెలంగాణ ప్రజలంతా కనెక్ట్‌ అవుతున్నారు. సినిమాలో తెలంగాణ ప్రజలు ఆచరించే పద్ధతులు, కట్టుబాట్లను కళ్లకు కట్టినట్టు చూపించారు. తమలోని ఓ మనిషి చనిపోతే.. మూడో రోజున, దశదిన కర్మ రోజున వాళ్లకు ఇష్టమైన వంటకాలన్ని వండి పక్షికి పెట్టటమనే ఆనవాయితీని ఈ సినిమాలో ప్రధానాంశంగా చూపించారు. అయితే… సినిమాలో మాత్రం పక్షి ముట్టదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *