3 నెలలు…ఇక నిధుల వరద

గుంటూరు, అక్టోబరు 18
ఇప్పుడు అన్ని రాష్ట్రాల్లోనూ ఎన్నికలు సంక్షేమం చుట్టూ తిరుగుతున్నాయి. సంక్షేమమే అధికారంలోకి తీసుకొస్తాయని అన్ని పార్టీలు నమ్ముతున్నాయి. తాజాగా తెలంగాణలోనూ బీఆర్‌ఎస్‌ సంక్షేమమే లక్ష్యంగా మూనిఫెస్టో ప్రకటించింది. ఆ సమయంలోనూ సీఎం జగన్‌ అమలు చేస్తున్న సంక్షేమాన్ని కేసీఆర్‌ ప్రస్తావించారు. ఏపీలో జగన్‌ 2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 2024లో తిరిగి గెలవటానికి ఇదే తన గెలుపు మంత్రగా ఫిక్స్‌ అయ్యారు. సీఎం జగన్‌ ఎన్నికల వ్యూహాలు: ముఖ్యమంత్రి జగన్‌ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. ఇప్పటికే ఎన్నికల కార్యాచరణ ఫిక్స్‌ చేసిన జగన్‌ పాలనా పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాను నమ్ముకున్న సంక్షేమ ఓట్‌ బ్యాంక్‌ ను పెంచుకొనే ప్రయత్నం చేస్తున్నారు. జగన్‌ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు రూ 2.35 లక్షల కోట్ల మేర సంక్షేమం పేదలకు అందించారు. దీంతో, జగన్‌ కు కౌంటర్‌ గా చంద్రబాబు పార్టీ మహానాడు వేదికగా సంక్షేమ మేనిఫెస్టో ప్రకటించారు. 2014`19 కాలంలో ఇచ్చిన హావిూలు అమలు చేయకపోవటంతో జగన్‌ తన పాదయాత్ర సమయంలో చంద్రబాబు విశ్వసనీయతను దెబ్బ తీయటంలో సక్సెస్‌ అయ్యారు. తాను చెప్పిన మాట నిలబెట్టుకుంటూ 2019లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పథకాలను ఎన్ని సమస్యలు వచ్చినా అమలు చేస్తున్నారు.సంక్షేమ ఓట్‌ బ్యాంక్‌ లక్ష్యంగా: ఇక, వచ్చే ఎన్నికల్లో తన సంక్షేమమే తనను గెలిపిస్తందనే ధీమాతో ఉన్నారు. ఇటు పార్టీ నేతలకు ఎన్నికల రోడ్‌ మ్యాప్‌ ఫిక్స్‌ చేస్తూనే..ప్రతీ ఇంటికి వెళ్లి జగన్‌ ఏపీకి ఎందుకు అవసరమో వివరించేలా కొత్త కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. జగనన్న సురక్ష ద్వారా ప్రతీ ఒక్కరి ఆరోగ్యం పైన ప్రభుత్వం శ్రద్ద చూపిస్తుందనే సంకేతాల ద్వారా వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇక, ప్రతీ సంక్షేమ పథకం మహిళల పేరుతో అమలు చేయటం ద్వారా మహిళా ఓట్‌ బ్యాంక్‌ తన వైపు ఉండేలా జాగ్రత్త పడ్డారు. వచ్చే ఎన్నిలకు సరిగ్గా మూడు నెలల ముందు నుంచి పథకాల ద్వారా మహిళలకు నిధుల వరద అమలు చేయనున్నారు. వచ్చే జనవరి నుంచి పెన్షన్‌ రూ 3000కి పెంచనున్నారు. జనవరి 10 నుంచి వైఎస్సార్‌ చేయూత ప్రారంభం కానుంది. మరో అయిదు వేల కోట్ల మేర ఇవ్వటం ద్వారా ఈ పధకం ద్వారా రూ 19 వేల కోట్లు మహిళల ఖాతాల్లో జమ కానున్నాయి, ఏంరా బచ్చా ఫ్రీగా తిరుగుతున్నామని చులకనా ?, ఆర్‌ టీసీ కండెక్టర్‌ ను లేడీస్‌ ఏం చేశారంటే? జనవరి నుంచి నిధుల విడుదల: జనవరి 20`30 వరకు వైఎస్సార్‌ ఆసరా చివరి విడత నిధులను విడుదల చేయనున్నారు. నాలుగు విడతల్లో పొదుపు సంఘాల రుణాల 19,178 కోట్లు మూడు దఫాలు ఇచ్చారు. చివరి విడతా మరో 6,500 కోట్లు ఇవ్వనున్నారు. దీని ద్వారా మొత్తంగా 26 వేల కోట్లు అందించినట్లవుతుంది. దీనికి కొనసాగింపుగా సున్నా వడ్డీ ద్వారా మరో అయిదు వేళ కోట్లు ఇవ్వటం జరిగింది. పొదుపు సంఘాల మహిళలకు రూ 31 వేల కోట్లు అందించామని ప్రభుత్వం చెబుతోంది. ఫిబ్రవరిలో మరో సారి జగనన్ననే తెచ్చుకుందాం అనే నినాదంతో ఎన్నికలకు సిద్దం కావాలని పిలుపునిచ్చారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *