రెండు రాష్ట్రాలపై కమలం గురి

ఉప రాష్ట్రపతి ఎన్నికలో ఎన్డీయే కూటమి అభ్యర్థిగా జగదీప్‌ ధనకర్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం జగదీప్‌ పశ్చిమబెంగాల్‌ గవర్నర్‌గా కొనసాగుతున్నారు. ఉపరాష్ట్రపతి ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ప్రక్రియ ముగియనుండటంతో శనివారం ఢల్లీిలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్‌, నితిన్‌ గడ్కరీ సహా పలువురు కేంద్రమంత్రులు, ఎంపీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలోనే తమ ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా జగదీప్‌ను జె.పి.నడ్డా ప్రకటించారు. రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్మును ఎంపిక చేసి ప్రతిపక్షాలను డిఫెన్స్‌లో పడేసిన బీజేపీ ఉప రాష్ట్రపతి అభ్యర్థి విషయంలోనూ అలాంటి వ్యూహాన్నే ఎంచుకుంది. జాట్‌ వర్గానికి చెందిన వ్యక్తిని ఉప రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం వెనకున్న అసలు వ్యూహం ఏంటి.?.పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌ఖర్‌ను వెనక్కి పిలిపించాలన్న ముఖ్యమంత్రి మమతా బెనర్జీ డిమాండ్‌కు కేంద్రం చెక్‌ పెట్టింది. ఊహించినట్లుగానే, భారతీయ జనతా పార్టీ (బిజెపి) పార్లమెంటరీ బోర్డు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కాంగ్రెస్‌ పాలిత రాజస్థాన్‌లో వేగంగా సవిూపిస్తున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శనివారం ఉపరాష్ట్రపతి పదవి అభ్యర్థిగా ధంఖర్‌ను ప్రకటించింది. ఆగస్టు 6న ఉప రాష్ట్రపతి ఎన్నిక జరగనున్న విషయం తెలిసిందే. ఇక ప్రతిపక్షం ఉపరాష్ట్రపతి రేసులో మాజీ కేంద్ర మంత్రి మార్గరెట్‌ అల్వాను పోటీకి దింపిన విషయం తెలిసిందే. ఆదివారం ప్రతిపక్షాల సమావేశం అనంతరం నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్‌ ఈ విషయాన్ని ప్రకటించారు.జగదీప్‌ ధంఖర్‌ ఉపరాష్ట్రపతిగా ఎంపికైతే ఓబీసీ, జాట్‌ సామాజిక వర్గానికి చెందిన తొలి సభ్యుడుగా నిలుస్తారు. అంతేకాకుండా రాజస్థాన్‌కు చెందిన తొలి వ్యక్తిగాకూడా అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నారు. ఛత్తీస్‌గఢ్‌తో పాటు కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో ఉన్న చివరి రెండు రాష్ట్రాల్లో రాజస్థాన్‌ కూడా ఒకటనే విషయం తెలిసిందే. వచ్చే ఏడాది నవంబర్‌`డిసెంబరులో ఎన్నికలు జరగనున్న ఈ రెండు రాష్ట్రాల్లోనూ అధికారాన్ని నిలబెట్టుకోవడం, కేంద్రంలో అధికారంలోకి రావాలన్న ఆశను నిలబెట్టుకోవాలంటే కాంగ్రెస్‌కు కీలకం, ఎందుకంటే ఈ రెండు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల్లో ఎన్నికలు వచ్చే నాలుగు నెలల ముందు జరుగుతాయి. ఈ ఎన్నికల నేపథ్యంలోనే బీజేపీ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభ్యర్థులను ఎంపిక చేసిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.ద్రౌపది ముర్ముతో చత్తీస్‌ఘడ్‌లో, ధన్‌ఖర్‌తో రాజస్థాన్‌లో రాజకీయంగా తమకు అడ్వాంటేజ్‌గా ఉంటుందని బీజేపీ భావిస్తోంది. రాజస్థాన్‌లో 200 మంది ఎమ్మెల్యేలలో 34 మంది జాట్‌లు కాగా, 25 మంది లోక్‌సభ సభ్యులలో ఐదుగురు జాట్‌లే. జాట్‌ కమ్యూనిటీ హర్యానా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ పశ్చిమ ప్రాంతాలలో విస్తరించి ఉంది. ధంఖర్‌.. హర్యానా రాజకీయాలతో లోతుగా అనుబంధం కలిగి ఉన్న ప్రముఖ జాట్‌ నాయకుడు, మాజీ ఉప ప్రధాన మంత్రి చౌదరి దేవి లాల్‌ ఆధ్వర్యంలో రాజకీయంగా ఓనమాలు నేర్చుకున్నాడు.వృత్తిరీత్యా న్యాయవాది అయిన ధంఖర్‌ 2019 నుంచి పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా పనిచేస్తున్నారు. రాజస్థాన్‌తో పోలిస్తే, హర్యానా రాజకీయాల్లో జాట్‌లు గణనీయమైన ప్రభావాన్ని కలిగి ఉన్నారు. రాష్ట్ర జనాభాలో 20 శాతానికి పైగా వీరే ఉంటారు. 2019 అక్టోబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జాట్‌ల మద్దతు పొందడంలో విఫలమైనందున హర్యానాలో బీజేపీ సొంతంగా మెజారిటీ సాధించలేకపోయింది. హర్యానా రాజకీయాలు జాట్‌, నాట్‌ జాట్‌గా విడిపోయాయి. 2014 నుంచి హర్యానా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ పంజాబీ జాట్‌లలో పెద్దగా ప్రాచుర్యం పొందలేదు.ఇక బీజేపీ హర్యానాలో ఎప్పటికప్పడు జాట్‌లను ప్రసన్నం చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంది. హర్యానాలో ప్రస్తుత బిజెపి అధ్యక్షుడు ఓం ప్రకాష్‌ ధంకర్‌ జాట్‌ వర్గానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ, అతనికి పెద్దగా ప్రజల్లో ఆదరణలేదు. హర్యానలో తమది జాట్‌ వ్యతిరేక పార్టీగా ఉన్న ముద్రను తొలగించాలనే సంకల్పంతో ఉంది. భారతదేశ్‌ తొలి జాట్‌ వైస్‌ ప్రెసెడిరట్‌ అభ్యర్థిగా ప్రకటించింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *