దూకుడు పెంచిన సీబీఐ

మాజీ మంత్రి వివేక హత్య కేసులో సీబీఐ దూకుడుగా విచారణ జరుపుతోంది. వివేకకు పీఏగా ఉన్న కృష్ణారెడ్డిని ప్రశ్నిస్తున్నారు సీబీఐ అధికారులు. వివేక హత్య తర్వాత లెటర్‌, మొబైల్‌ దాయడంలో ఆయనదే ప్రధాన పాత్ర అని అవినాష్‌ రెడ్డి ఆరోపిస్తున్నారు. కడప నుంచి పులివెందుల వచ్చిన సీబీఐ అధికారులు వివేక పీఏ కృష్ణారెడ్డి ఇంటికి వెళ్లారు. ఆ విషయాన్ని గ్రహించిన ఆయన ఇంటి నుంచి బయటకు రాలేదు. తలుపులు కూడా తీయలేదు. ఆయన స్పందన కోసం సీబీఐ అధికారులు చాలా సమయం అక్కడే ఉన్నారు. కాసేపటి తర్వాత కృష్ణారెడ్డే వచ్చి తలుపు తీశారు. లోపలికి వెళ్లిన సీబీఐ అధికారులు ఆయన్ని ప్రశ్నించారు. కృష్ణారెడ్డి ఓ టీవీఛానల్‌తో మాట్లాడుతూ సంచలన కామెంట్స్‌ చేశారు. వివేకానందరెడ్డి చనిపోయారని సునీత, రాజశేఖర్‌ రెడ్డికి ఫోన్‌ చేస్తే… ఏం జరిగింది ఎలా జరిగిందో అని ఆరా తీయకుండా ఓకే అని ఫోన్‌ పెట్టేశారన్నారు. ఆ రోజు ఉదయం ఐదున్నరకు వివేకా ఇంటికి వెళ్లానని అన్నారు. అక్కడే ఉన్న ముందు గేట్‌ ఓపెన్‌ అయి ఉందని… అది గమనించి లోపలికి వెళ్లానని అన్నారు. అప్పటికీ వివేకా లేవలేదని తెలిపారు. పడుకున్నారేమో అని మళ్లీ నేను బయటకు వచ్చేశానని… ఆయన భార్య సౌభాగ్యకు ఫోన్‌ చేశానని తెలిపారు. నైట్‌ లేట్‌గా వచ్చారని ఇంకా కాసేపు పడుకోనిలే అన్నారని వివరించారు. ఇంతలో వంట మనిషి వచ్చినట్టు చెప్పారు. కాసేపు వెయిట్‌ చేసినా ఆయన ఇంకా లేవలేదు. మళ్లీ లేపలేదు ఎందుకని తిడతారని వెనుక నుంచి వెళ్లి పిలిచామన్నారు. అప్పటికే రంగన్న ముందు గేట్‌ వద్ద పడుకొని ఉన్నారని మా అలికిడి విని లేచారన్నారు. ఆయన బయటకు వెళ్లి పరుగెత్తుకొని వచ్చి సార్‌ పడిపోయాడని చెప్పాడు. లోపలికి వెళ్లి చూస్తే రక్తంతో నిండిపోయింది. బాత్రూమ్‌లోకి వెళ్లి చూస్తే వివేక పడిపోయి ఉన్నారు. నాడి చూసి చనిపోయినట్టు గుర్తించామన్నారు. బయటకు వచ్చి నర్రెడ్డి రాజేశేఖర్‌కు ఫోన్‌ చేశామన్నారు. అహా అని చెప్పి ఫోన్‌ పెట్టేశారని అన్నారు. అలా ఆ ఇంట్లో ఓ చోట ఫోన్‌ కనిపించదని… దాన్ని జేబులో పెట్టుకున్నానని చెప్పారు కృష్ణారెడ్డి. వీల్‌ చైర్‌ వద్ద పేపర్‌ పడి ఉందన్నారు. ఓపెన్‌ చేస్తే తెలుగులో ఉందన్నారు. మళ్లీ ఈ విషయాన్ని రాజశేఖర్‌కు చెప్పామన్నారు. ఆ లెటర్‌ను దాచిపెట్టమన్నారని తెలిపారు. పోలీసులతో సమస్య అవుతుందంటే… నేను వచ్చి చెప్పుకుంటాలే అన్నారని వివరించారు. అక్కడి కాసేపటికి అవినాష్‌ రెడ్డి వచ్చారన్నారు కృష్ణారెడ్డి. వాళ్లకు విషయం చెప్పానన్నారు. ఇంతలో సీఐ వచ్చారని ఆయన వెనుకాలే గంగిరెడ్డి వచ్చారని తెలిపారు. వచ్చీరాగానే సార్‌ వామ్‌టింగ్‌ చేసుకున్నారేంటీ అని అన్నాడని తెలిపారు. ఇంతలా రక్తం ఉంటే వాంతులు అంటారేంటీ అని అడిగానని పేర్కొన్నారు. బాత్రూమ్‌లోకి వెళ్లి చూసి రక్తం చింది ఉందేంటీ అని అడిగితే కమోడ్‌కు కొట్టుకొని రక్తం వచ్చి ఉంటుందిలే అని సర్ది చెప్పాడని వివరించారు. పోలీస్‌ కంప్లైంట్‌ ఇద్దామంటే వద్దని కూడా చెప్పారన్నారు. ఇంతలో రాజశేఖర్‌ రెడ్డి ఫోన్‌ చేస్తే గంగిరెడ్డితో జరిగిన సంభాషణ గురించి చెప్తే… పక్కనే ఉన్న సీఐకి ఫోన్‌ ఇమ్మని చెప్పారని కృష్ణారెడ్డి తెలిపారు. కొద్ది సేపటికి గంగిరెడ్డి… ఇనాయతుల్లాకు పిలిచి.. నీళ్లు తీసుకురమ్మని చెప్పారు. పని మనిషి లక్ష్మీ వచ్చి ఆ రక్తం తుడుస్తూ కళ్లు తిరుగుతున్నాయని వెళ్లిపోయారన్నారు. తర్వాత మరో ఇద్దరు వ్యక్తులు వచ్చి రక్తాన్ని తుడిచారన్నారు.తాము జైల్లో ఉన్నప్పుడు సునీత రాజశేఖర్‌ రెడ్డి వచ్చి చూసి వెళ్లేవాళ్లని చెప్పారు కృష్ణారెడ్డి. గంగిరెడ్డి, తనతో వేర్వేరుగా మాట్లాడేవారన్నారు. తర్వాత ఓసారి ఢల్లీి వెళ్లి వచ్చిన తర్వాత నన్ను టార్గెట్‌ చేశారన్నారు. నా బిడ్డను కూడా టెన్షన్‌ పెట్టారన్నారు. తర్వాత తానే మాట్లాడి వాళ్ల ఆఫీస్‌కు వెళ్లి మాట్లాడామన్నారు. వెళ్లిన వెంటనే సునీత తీసుకున్నారని తెలిపారు. అక్కడ చాలా ప్రశ్నలు అడిగారన్నారు. ఎవరైనా బెదిరిస్తే చెప్పమన్నారు. రాంసింగ్‌కు సహకరించాలని చెప్పారు. ఓ దశలో సునీత తనపై కోప్పడిరదని… అప్పుడు రాజశేఖర్‌రెడ్డి శాంతింపజేశారన్నారు. అప్పుడే ఆయన సహకరించకుంటే నువ్వు జైలుకు వెళ్తావని రాజేశేఖర్‌ రెడ్డితో సునీత అన్నట్టు చెప్పారు కృష్ణారెడ్డి. టీవీ చానల్స్‌తో చెప్పిన విషయాలన్నీ కృష్ణారెడ్డి సీబీఐ అధికారులుకు చెప్పే అవకాశం ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *