యూనివర్శిటీల్లో హోలీపై పాక్ నిషేధం..

రంగులు చల్లుకుంటూ కోలాహలంగా సందడి చేసే ‘హోలీ’ (Holi) పండుగపై పాకిస్థాన్ హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ (Pakistan Higher Education commission- HEC) కన్నెర్ర చేసింది. యూనివర్శిటీల్లో హోలీ వేడుకలను నిషేధిస్తున్నట్టు (Ban) ప్రకటించింది. ఇస్లామాబాద్‌లోని క్వాయిడ్-ఐ-ఆజం యూనివర్శిటీ(Quaid-i-Azam University) క్యాంపస్‌లో జూన్ 12న హోలీ వేడుకలు జరగడం, ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో హెచ్ఈసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇలాంటి చర్యల వల్ల దేశ సామాజిక సంస్కృతి విలువలు పూర్తిగా దూరమవుతాయని, ఐస్లామిక్ ఐడెంటిటీకి విఘాతం కలుగుతుందని పేర్కొంది.

యూనివర్శిటీ వేదికగా విస్తృత ప్రచారం జరిగిన వేడుకలు తీవ్ర ఆందోళనలకు, దేశ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని క్వాయిడ్-ఐ-ఆజం యూనివర్శిటీ క్యాంపస్‌లో జరిగిన హోలీ వేడుకలను పరోక్షంగా ప్రస్తావిస్తూ హెచ్ఈసీ పేర్కొంది. ఇలాంటి వాటికి దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించింది.

ఈ నెల ప్రారంభంలో క్వాయిడ్-ఐ-ఆజం యూనివర్శిటీలో జరిగిన హోలీ వేడుకల్లో విద్యార్థులు రంగులు చల్లుకుంటూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ఒక్కసారిగా వైరల్ అయింది. యూనివర్శిటీకి చెందిన రాజకీయేతర సాంస్కృతిక సంస్థ అయిన మెహ్రాన్ స్టూడెంట్స్ కౌన్సిల్ ఈ వేడుకను నిర్వహించింది. కాగా, దీనికి ముందు గత మార్చిలో పంజాబ్ యూనివర్శిటీ ఆవరణలో జరిగిన హోలి వేడుకలను రాడికల్ ఇస్లామిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ అడ్డుకోవడంతో సుమారు 15 మంది హిందూ విద్యార్థులు గాయపడ్డారు.x

Leave a comment

Your email address will not be published. Required fields are marked *