షారుఖ్ ఖాన్ ‘డంకి’ విడుదల వాయిదా, ‘సలార్’ కి పోటీ లేదు

షా రుఖ్ ఖాన్ (ShahRukhKhan) ఈ ఏడాది రెండు సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చాడు. ఒకటి ‘పఠాన్’ #Pathaan అయితే రెండోది ఈమధ్యనే విడుదలైన ‘జవాన్’ #Jawan. ఈ రెండూ ఈ సంవత్సరమే విడుదలై సంచనలం సృష్టించటమే కాకుండా, కొన్నేళ్ల నుండి హిట్స్ లేని బాలీవుడ్ కి ఈ రెండు సినిమాలు జీవం పోశాయి. అదే తరహాలో మూడో సినిమా ‘డంకి’ #Dunki కూడా ఈ సంవత్సరమే విడుదలవ్వాలి. అది డిసెంబర్ 22న విడుదల చేస్తాము అని అధికారికంగా ప్రకటించారు కూడా.

అయితే ప్రభాస్ (Prabhas), ప్రశాంత్ నీల్ (PrashanthNeel) కాంబినేషన్ లో వస్తున్న ‘సలార్’ #Salaar సినిమా సెప్టెంబర్ 28 న విడుదలవ్వాల్సి వుంది, కానీ వాయిదా పడింది. ఇప్పుడు ఆ సినిమా డిసెంబర్ 22న, ‘డంకి’ సినిమా విడుదలప్పుడే విడుదలవుతోంది. అంటే షారుఖ్ ఖాన్ సినిమా, ప్రభాస్ సినిమా రెండో ఒకేరోజు బాక్స్ ఆఫీస్ దగ్గర పోటీ పడుతున్నాయి అని అనుకున్నారు.

ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, షారుఖ్ ఖాన్ తన సినిమా ‘డంకి’ విడుదల ఆలస్యం చేద్దామని అనుకున్నాడు అని తెలుస్తోంది. అతను ప్రభాస్ సినిమాకి సోలో గా విడుదల ఇవ్వాలని, వచ్చే సంవత్సరం తన సినిమా విడుదల చేసుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే రెండు పెద్ద సినిమాలు ఒకేరోజు విడుదల అయితే రెండు సినిమాల ఆదాయం దెబ్బతింటుంది. అందుకని షా రుఖ్ ఖాన్ వెనక్కి తగ్గుదామని అనుకొని తన సినిమా విడుదలని వాయిదా వెయ్యాలని అనుకుంటున్నట్టుగా తెలిసింది. ‘డంకి’ సినిమాకి రాజ్ కుమార్ హిరానీ (RajkumarHirani) దర్శకత్వం వహిస్తే, తాప్సి పన్ను (TapseePannu) కథానాయికగా నటించింది.

షా రుఖ్ ఖాన్ ఈ సంవత్సరం రెండు హిట్ సినిమాలు ఇచ్చాడు, అందుకని ఈసారి ఛాన్స్ ప్రభాస్ కి ఇవ్వమని రెండు సినిమాల నిర్మాతలు మాట్లాడుకున్నారు అని, అందుకని షా రుఖ్ ఖాన్ సినిమా వచ్చే సంవత్సరానికి వాయిదా పడొచ్చు అని అంటున్నారు. ప్రభాస్ కి ఇప్పుడు ఒక మంచి బ్రేక్ కావాల్సి వుంది, అది ఈ ‘సలార్’ తో వస్తుంది అని అనుకుంటున్నారు. ఇక ప్రభాస్ సినిమా ‘సలార్’ పార్టు వన్ లో శృతి హాసన్ (ShrutiHaasan) కథానాయికగా నటించగా, మలయాళం నటుడు పృథ్విరాజ్ సుకుమారన్ (PruthvirajSukumar) విలన్ గా నటించాడని తెలుస్తోంది. ఇందులో శ్రీయ రెడ్డి (SriyaReddy) కూడా ఒక ముఖ్య పాత్రలో కనపడనుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *