G84, G62, G60 నెంబర్ల నుంచి కాల్‌ వస్తే ఎత్తొద్దు..

వాట్సాప్‌ కాల్‌ వస్తుంది. ఆ వెంటనే కట్‌ అవుతుంది. వారం రోజులుగా వాట్సాప్‌ యాజర్లు ఫేస్‌ చేస్తున్న ప్రాబ్లమ్‌ ఇది. G84, G62, G60 ఇంకా మరిన్ని అంతర్జాతీయ నంబర్‌ల నుండి తెలియని కాల్స్‌ వస్తుండటంతో చాలా మంది అందోళనకు గురవుతున్నారు. ఇవన్నీ ఇథియోపియా, మలేషియా, ఇండోనేషియా, కెన్యా, వియత్నాం దేశాలకు చెందిన కోడ్స్‌. ఈ కోడ్స్‌ నుంచి కాల్స్‌ వస్తే లిఫ్ట్‌ చేస్తే ఏమౌతుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి వాట్సాప్‌ కాల్‌ నెంబర్లను ఎట్టి పరిస్థితుల్లోనూ స్పందించకూడదని సైబర్‌ నిపుణులు చెబుతున్నారు. సైబర్‌ మోసాలకు ఇదోక ఎత్తుగడ అని అంటున్నారు. తెలియని కాలర్‌ విూ డేటా లేదా డబ్బును దొంగిలించడానికి ఏదైనా మాల్వేర్‌ని ఇంజెక్ట్‌ చేయవచ్చని చెబుతున్నారు. విూకు ఇలాంటి ఫోన్‌ కాల్‌ వస్తే ముందుగా వాటికి ఆన్సర్‌ చేయొద్దని, ఆయా లింకులపై ఎట్టి పరిస్థితుల్లోనూ క్లిక్‌ చేయోద్దని అంటున్నారు. ఆ కాల్‌ కట్‌ అయ్యాక రిపోర్ట్‌ చేసి బ్లాక్‌ చేయాలని సూచిస్తున్నారు. అయితే ఈ కోడ్‌ కాల్స్‌ పై వాట్సాప్‌ స్పందించింది. వాట్సాప్‌ యూజర్లను సురక్షితంగా ఉంచడానికి ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌, ఇతర అత్యాధునిక టెక్నాలజీపై స్థిరమైన పెట్టుబడి పెట్టామని పేర్కొంది. గుర్తుతెలియని నంబర్ల నుంచి ఫోన్‌ కాల్స్‌ వస్తే లిప్ట్‌ చెయోద్దని తెలిపింది. మన భారతీయుల నెంబర్లు వారికి ఎలా చేరాయని అందరూ అనుమాన పడుతున్నారు. కొన్ని నెలల కిందట ఫేస్‌ బుక్‌ ఖాతాల నుంచి లెక్కలేనన్ని ఫోన్‌ నంబర్లు స్కామర్లకు అందాయి. అదే టైమ్‌ లో ఇన్‌?స్టాగ్రామ్‌ అకౌంట్‌ పై కూడా హ్యాకింగ్‌ జరిగి, లక్షలాది భారతీయుల నంబర్లు బయటకొచ్చాయి. ఈ డేటా మొత్తాన్ని కొంతమంది కొన్ని అంతర్జాతీయ ఏజెన్సీలకు అమ్మేశారని తెలుస్తోంది. అలా చాలామంది వ్యక్తుల వ్యక్తిగత మొబైల్‌ నంబర్లు, ఇప్పుడు అంతర్జాతీయ ఏజెన్సీల చేతికి చేరాయి. వాటి నుంచి స్పామర్లు, ఆన్‌ లైన్‌ మోసాలకు పాల్పడేవారికి ఈ నంబర్లు వెళ్లాయని సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *