యూజీ పనుల్లో కనిపించని నాణ్యత

గజ్వేల్‌లో అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ పనులు అస్తవ్యస్తంగా కొనసాగుతున్నట్లు పట్టణ ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిర్మాణ పనుల్లో నాణ్యత లోపించడం, మిషన్‌ భగీరథ పైప్‌ లైన్‌ల ధ్వంసం, పనులు నెలల తరబడి పెండిరగ్‌లో పెట్టడం వల్ల వీధుల్లో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, పాలకవర్గానికి చెప్పిన పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. రూ 100 కోట్లతో గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలో యూజీడీ పనులు కొనసాగుతుండగా నాణ్యత లేవని పట్టణానికి చెందిన పలువురు మున్సిపల్‌ కమిషనర్‌కు, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. గజ్వేల్‌ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్‌ పెద్ద మొత్తంలో నిధులు కేటాయించారు.అయితే అధికారుల పర్యవేక్షణ లోపం, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల అనుకున్న మేర పనులు కొనసాగడం లేదని పట్టణవాసుల్లో ఆందోళన వ్యక్తం అవుతుంది. పనుల్లో శాస్త్రీయత లోపించిందని మిషన్‌ భగీరథ పైపు లైన్ల ధ్వంసం, చాంబర్‌లు సరిగా నిర్మించడం లేదంటున్నారు. అన్ని పనుల్లో నాణ్యత లోపించిందని ఆరోపణలు ఉన్నాయి. వీధుల్లో పైప్‌ లైన్‌ల కోసం చాంబర్‌ కోసం గుంతలు తీసి అనేక రోజుల పాటు పనులు పెండిరగ్‌ పెట్టడంతో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. చాంబర్ల నిర్మాణంతో పాటు పైప్‌లైన్ల పూర్తి తర్వాత రోడ్డు లెవెల్‌ పూర్చకపోవడంతో ప్రయాణ ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. మిషన్‌ భగీరథ పైప్‌లైన్లను ధ్వంసం కాకుండా చూడాలని ఇంటి నుండి కలిపే కలెక్షన్‌లు సరిగా ఉండేట్లు చూడాలని పట్టణ వాసులు చెప్పిన పట్టించుకోవడం లేదు.గజ్వేల్‌ పట్టణంలో యూజీడీ పనులు మందకొడిగా కొనసాగుతున్నాయి. అనేక నెలలు గడిచిన పనులు పూర్తి కాకపోవడంతో పట్టణ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వీధుల్లో అసంపూర్తి పనుల వల్ల కొత్త సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. పలు వీధుల్లో ద్విచక్ర వాహనాలు, కార్లు కూరుకుపోతున్నాయి.ముఖ్యమంత్రి కేసీఆర్‌ గజ్వేల్‌ ను ఆదర్శంగా తీర్చిదిద్దాలని భావించారు. అందుకు తగ్గట్టే పనుల్లో యూజీడి పనుల్లో నాణ్యత పెంచాలి. అనేక సంవత్సరాల పాటు ఉండే పనులను భావితరాలకు అనుకూలంగా నిర్మాణాలు చేపట్టాలి. మున్సిపల్‌ అధికారులు పాలకవర్గం నాణ్యత పై తగిన బాధ్యత వహించాలి. అలా జరిగితేనే కేసీఆర్‌?భావించినట్లుగా గజ్వేల్‌ ఆదర్శంగా నిలుస్తుంది.గజ్వేల్‌ యూజీడీ పనుల్లో నాణ్యత లోపించింది. చాంబర్‌ల నిర్మాణం సరిగా చేపట్టడం లేదు. మిషన్‌ భగీరథ పైప్‌ లైన్‌లను ధ్వంసం చేస్తున్నారు. పనిరాని వారితో పనులు చేయించడంతో నాణ్యత లోపిస్తుంది. రోడ్లన్ని చదును చేయకపోవడంతో చిత్తడిగా మారాయి. మున్సిపల్‌ కమిషనర్‌ కు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *