ఆంధ్రా సరిహద్దులో మరో వివాదం

ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ మధ్య సరికొద్ద సరిహద్దు వివాదం మొలకెత్తింది. అయితే ఈ వివాదానికి కేంద్రం రాజకీయమే కారణమన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రసాద్‌ చేసిన ఒక ప్రకటన ఈ వివాదానికి కారణమన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ఆంధ్రప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాల మధ్య కోరాపుట్‌ జిల్లాలో ఉన్న కోటియా అనే ప్రాంతంనుంచి ఏపీ పోలీసులు వైదొలగాలంటూ చేసిన ప్రకటన ఈ సరికొత్త సరిమద్దు వివాదానికి కారణమైంది. కోటియా ప్రాంతంలోని 21 గ్రామాల నుంచి ఏపీ పోలీసులు వెనక్కు వెళ్లాలని ప్రధాన్‌ ఒడిశా అవతరణ దినోత్సవం వేదికగా ఒక ప్రకటన చేశారు. ప్రస్తుతం ఈ ప్రకటనే సరికొత్త వివాదానికి కారణమైంది. వాస్తవానికి సరిహద్దు వివాదం సుప్రీం కోర్టులో ఉండగా సరిగ్గా ఒడిశా అవతరణ దినోత్సవం నాడు కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ వివాదాస్పద ప్రకటన చేశారు.ఇది రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. సహజంగానే ప్రదాన్‌ ప్రకటనను బీజేపీ ఒడిశా శాఖ సమర్ధించింది. అదే సమయంలో ప్రధాన్‌ వ్యాఖ్యలను అధికార బీజు జనతాదళ్‌ ఖండిరచింది. దీంతో బిజూ జనతాదళ్‌, బీజేపీల మధ్య తీవ్రస్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. బిజూ జనతా దళ్‌ నాయకురాలు, రాష్ట్ర రెవెన్యూ మంత్రి ప్రవిూలా మల్లిక్‌ ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలంటూ ఎన్‌.డి.ఏ ప్రభు త్వాన్ని డిమాండ్‌ చేశారు.ఇది సుప్రీం కోర్టు విచారణలో ఉండగా కేంద్ర మంత్రి దీని గురించి వ్యాఖ్యానించవచ్చా, ఈ విధంగా వ్యాఖ్యానించడం కోర్టు ధిక్కరణ కిందకు రాదా అన్న చర్చ మొదలైంది. రెండు రాష్ట్రాలు చర్చల ద్వారా ఈ సమస్యను పరిష్కరించుకోవాలంటూ కొద్ది కాలం కిందట కేంద్ర మంత్రి ధర్మేంద్ర పధాన్‌ స్వయంగా ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులకూ లేఖ రాశారు. ఇంతలోనే ఈ విషయంలో ఆయన వివాదాస్పద ప్రకటన చేయడం రాజకీయ లబ్ధి కోసమేనన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వచ్చే ఏడాది సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేడీని ఇరకాటంలో పెట్టడమే లక్ష్యంగా ఆయనీ వ్యాఖ్యలు చేసినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కోరాపుట్‌ జిల్లా గత ఇరవై ఏళ్లుగా బీజేడీ ఓటు బ్యాంకుగా, పటిష్ఠమైన కంచుకోటగా ఉంది. ఇప్పుడు ఈ జిల్లాపై బీజేపీ కన్ను వేసింది. దేశవ్యాప్తంగా ఆదివాసీ లేక గిరిజన ప్రాంతాలను చేజిక్కించుకోవడంలో భాగంగా కేంద్రంలోని పాలక బీజేపీ ప్రభుత్వం ఒడిశాలో కూడా ఆదివాసీల అభివృద్ధికి, సంక్షేమానికి అనేక పథకాలను, కార్యక్రమాలను చేపట్టినప్పటికీ, ఒడిశా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి పోటీగా స్వయంగా కొన్ని పథకాలను ప్రారంభించి, విజయవంతంగా అమలు చేస్తోంది. దీంతో నవీన్‌ పట్నాయక్‌ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టి పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశంతోనే ప్రధాన్‌ సరిహద్దు ఉరుములేని పిడుగులా సరిహద్దు వివాదానికి తెరతీశారని అంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *