వానలే..వానలు

భాగ్య నగరంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఉదయం నుంచి నగరాన్ని మేఘాలు కమ్ముకున్నాయి. నగరం పూర్తిగా కారుమబ్బులతో పూర్తిగా చీకటిమయంగా మారింది. ఉదయం 8 గంటల నుంచి అక్కడక్కడ చిరజల్లులు కురుస్తున్నాయి. నేడు నగరంలో భారీ వర్షాలు పడే అవకాశం వుందని హైదరాబాద్‌ వాతావరణ శాఖ వెల్లడిరచింది. దీంతో ట్రాఫిక్‌ పోలీసులు అలర్ట్‌ అయ్యారు. నగర ప్రజలకు పలు సూచనలు జారీ చేసారు. ప్రజలు ఉదయం 9 నుంచి 11 గంటల వరకు భారీగా వర్షం పడే అవకాశం వుందని, ఈ సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాహనదారులు గంట ఆలస్యంగా తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకోవాలని పేర్కొన్నారు.వర్షం తగ్గిన గంట తర్వాత వాహనదారులు బయటికి రావాలని ప్రకటించారు. వరద నీరు భారీగా రోడ్లపై చేరితే ట్రాఫిక్కు అంతరాయం కలిగే అవకాశం వుందని, కొన్ని ముఖ్యమైన రోడ్లలో వాహనదారులు ఇతర మార్గాలను వెళ్లాల్సిన అవసరం వుందని జాయింట్‌ సీపీ సూచించారు. అయితే.. ఉత్తర, దక్షిణ భారత ప్రాంతాల మధ్య 900 విూటర్ల ఎత్తున గాలులతో ఉపరితలద్రోణి ఏర్పడిరది. ఇది ఛత్తీస్‌గఢ్‌ నుంచి తెలంగాణ విూదుగా శ్రీలంక సవిూపంలో కోమరీన్‌ ప్రాంతం వరకూ విస్తరించింది. కాగా..మరోవైపు తమిళనాడుపై 1500 విూటర్ల ఎత్తున గాలులతో ఉపరితల ఆవర్తనం ఏర్పడి.. రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయి. వీటి ప్రభావం వల్ల నేడు ఒక మోస్తరుగా, బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణశాఖ తెలిపింది.నిన్న నగరాన్ని భారీ వర్షం ముంచెత్తింది. సోమవారం ఉదయం నుంచి వాతావరణంలో మార్పులు కనిపించింది. ఉదయం కాస్త ఎండ నగరాన్ని తాకిన ఉదయం 10.45 గంటల నుంచి వర్షం ముంచెత్తింది. దీంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌, పంజాగుట్ట, ఖైరతాబాద్‌, లక్డీకపూల్‌, ఎస్‌ఆర్‌ నగర్‌, కూకట్‌పల్లిలో కుండపోత వర్షం కురుస్తోంది. గండిపేట, బండ్లగూడ, రాజేంద్రనగర్‌, గచ్చిబౌలి,షేక్‌పేట, మణికొండ, బషీరాబాద్‌, చిక్కడపల్లి, రాంనగర్‌, కవాడిగూడ, దోమల్‌గూడ, భోలక్‌పూర్‌, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌, జవహర్‌ నగర్‌, గాంధీనగర్‌, షేక్‌పేట, రాయదుర్గం, రాజేంద్రనగర్‌, కిస్మత్‌పురా, సికింద్రాబాద్‌, బేగంపేట, దిల్‌సుఖ్‌నగర్‌, చాదర్‌ఘాట్‌ ఎల్బీనగర్‌, వనస్థలిపురంతో పాటు నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
స్టేట్‌వైడ్‌గా 66.4 సెంటీవిూటర్ల రెయిన్‌ఫాల్‌
సమ్మర్‌లోనే కాదు వర్షాకాలం సీజన్‌లోనూ రికార్డులు బద్దలవుతున్నాయి. కుండపోత వర్షాలతో తన రికార్డులను తనే బ్రేక్‌ చేస్తున్నాడు వరుణుడు. కురవాల్సిన వాన కంటే వందా రెండొందల శాతం అధికంగా కురుస్తూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాడు. జూన్‌, జులై నెలల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు వర్షపాతం నమోదైంది. లాస్ట్‌ 30 డేస్‌ వర్షపాతం చూసుకున్నా రికార్డులు బ్రేక్‌ అయ్యాయి. జులై నెలలో ఇంతటి వర్షపాతాన్ని గతంలో చూడలేదంటున్నారు వాతావరణశాఖ అధికారులు. జూన్‌ ఒకటి నుంచి ఇప్పటివరకు స్టేట్‌వైడ్‌గా 66.4 సెంటీవిూటర్ల రెయిన్‌ఫాల్‌ రికార్డైంది. ఇది సాధారణ వర్షపాతం కంటే 107శాతం అధికమని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లోనూ కొత్త రికార్డులు నమోదయ్యాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లోనూ సాధారణం కంటే 100శాతం అధికంగా వర్షం దంచికొట్టింది. ఒక్క వారం రోజుల్లోనే సరికొత్త రికార్డు నమోదైంది. జులై 21 నుంచి 27వరకు హైదరాబాద్‌లో 137శాతం అదనపు వర్షం కురిసిందని అధికారులు తెలిపారు. అధికంగా మేడ్చల్‌ జిల్లాలో 253శాతం, రంగారెడ్డి జిల్లాలో 191శాతం అదనపు వర్షం కురవడంతో కొత్త రికార్డులు క్రియేట్‌ అయ్యాయి. ఓవరాల్‌గా ఉఊఓఅ పరిధిలో ఇప్పటివరకు 49.3 సెంటీవిూటర్ల వర్షం కురిసింది. ఇది సాధారణం కంటే 70.9శాతం అదనం అని వాతావరణశాఖ అధికారులు పేర్కొంటున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *