రఘురాముడు రంగు మార్చేశారు….

విజయవాడ, జూలై 1
వచ్చే ఏడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పోటీ కోసం మరోసారి రఘురామ కృష్ణంరాజుకు టికెట్‌ ఇవ్వాలనుకోవట్లేదు వైసీపీ అగ్రనాయకత్వం. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తొలి రోజుల నుంచీ రాజకీయంగా ఇబ్బందులకు గురి చేస్తోన్న రఘురామకు బదులుగా నర్సాపురం లోక్‌సభలో కొత్త నాయకత్వం కోసం అన్వేషిస్తోంది. ఈ ప్రయత్నాలు ఫలించినట్టే కనిపిస్తోంది. . రఘురామ కృష్ణంరాజు కూడా ఈ సామాజిక వర్గానికి చెందిన నాయకుడే. 2019 నాటి ఎన్నికల్లో 32 వేల ఓట్ల తేడాతో ఆయన వైఎస్‌ఆర్సీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. అనంతరం పార్టీకి దూరంగా ఉంటోన్నారు. సొంత పార్టీపైనే తిరుగుబాటు లేవనెత్తారు. రెబెల్‌గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం ఆయన అమెరికాలో పర్యటిస్తోన్నారు. టెక్సాస్‌ స్టేట్‌లోని డల్లాస్‌లో నార్త్‌ అమెరికా తెలుగు అసోసియేషన్‌ కన్వెన్షన్‌కు హాజరు కానున్నారు. 30వ తేదీ నుంచి జులై 2వ తేదీ వరకు టెక్సాస్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో తానా సభలు ఏర్పాటు కానున్న విషయం తెలిసిందే. ఇందులో పాల్గొనడానికి ఇప్పటికే అమెరికా వెళ్లారాయన. హ్యూస్టన్‌, ఫిలడెల్ఫియా, పెన్సిల్వేనియాల్లో తెలుగు అసోసియేషన్‌ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఏపీకి మరో తీపి కబురు చెప్పిన కేంద్రం` 19 రాష్ట్రాలకు నిధులు తాజాగా ఇర్వింగ్‌లో తెలుగు ప్రముఖులను కలుసుకున్నారు. విూట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘురామ కృష్ణంరాజు.. పచ్చకండువాను మెడలో వేసుకుని కనిపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ కార్యక్రమం పొడవునా ఆయన పచ్చకండువాతోనే కనిపించారు. వైఎస్‌ఆర్సీపీ దూరంగా ఉంటోండటం, అదే సమయంలో తెలుగుదేశం పార్టీకి చేరువ కావడం వంటి పరిణామాల నేపథ్యంలో` ఇక వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *