పల్నాడులో మృగజీవులు..

ఈ మధ్య జనావాసాలోకి పులులు రావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. నెలరోజుల క్రితం రెండు పెద్ద పులులు పల్నాడు జిల్లాలో ప్రత్యక్షమవ్వడం కాగా ఇప్పడు మరో చిరుత పులి సంచరించడం కలకలం రేపుతోంది. నాగార్జునసాగర్‌ శ్రీశైలం రిజర్వ్‌ ఫారెస్ట్‌ ను పులుల అభయారణ్యంగా మార్చిన విషయం తెలిసిందే. అయితే పల్నాడు ప్రాంతానికి అత్యంత్య సవిూపంలోనే ఈ ఎన్‌?ఎస్‌?టీ?ఆర్‌ ఉంది. అభయారణ్యం నుండి నెల రోజుల క్రితం బయటకొచ్చిన రెండు పులులు పల్నాడు అటవీ ప్రాంతంలోకి ప్రవేశించాయి. అంతేకాకుండా దుర్గి మండలం గజాపురం పొలాల్లో ఆవుపై దాడి చేసి చంపేశాయి. ఆ తర్వాత రాజానగరం, కాకిరాలలో సంచరించినట్లు స్థానికులు గుర్తించారు.దీంతో ఒక్కసారిగా అప్రమత్తమైన అటవీ శాఖ అధికారులు ప్రజల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. రెండు పులులు సంచరిస్తున్నట్లు గుర్తించామని అయితే అవి మనుషుల్ని తినేవి కాదని ప్రజలు భయపడవద్దని చెప్పారు. ఆ తర్వాత ట్రాప్‌ కెమెరాలు ఏర్పాటు చేసి పులులు కదలికలనును ట్రాక్‌ చేశారు. ఇరవై రోజుల తర్వాత తిరిగి అవి ఎన్‌?ఎస్‌?టిటీఆర్‌?లోకి వెళ్ళిపోయినట్లు ట్రాప్‌ కెమెరాల ఆధారంగా గుర్తించారు. దీంతో పల్నాడు జిల్లా వాసులు ఊపిరి పీల్చుకున్నారు. ఇది జరిగిన నెల రోజుల తర్వాత గురజాల పట్టణంలో మరో చిరుత సంచారం కలకలం రేపింది. పట్టణంలోని మాడుగుల రోడ్డులోని జియో టవర్‌ వద్ద చిరుత సంచరించినట్లు స్థానికులు గుర్తించారు.వెంటనే అటవీ శాఖ అధికారులు సమాచారం ఇచ్చారు. పాద ముద్రలను బట్టి నాలుగేళ్ళ వయస్సున్న చిరుతగా అధికారులు గుర్తించారు. ఈ చిరుత ఎటు వైఫు నుండి వచ్చింది ఎటు వెళ్తోంది అన్న అంశాన్ని తేల్చేందుకు ఐదు ట్రాప్‌ కెమెరాలను ఏర్పాటు చేసి అధికారులు పర్యవేక్షిస్తున్నారు. స్థానికులు ఎవరు భయపడవద్దని పల్నాడు జిల్లా డిఎఫ్‌వో రామచంద్రరావు చెప్పారు. చిరుతలు మనుషులుపై దాడి చేసే అవకాశం లేదని కేవలం వన్య ప్రాణులపైనే మాత్రమే దాడి చేస్తాయంటున్నారు. చిరుతను అడవిలోకి మళ్ళించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అయితే పెద్ద పులులు భయాందోళనలు తొలగిపోకముందే చిరుత సంచారంతో పల్నాడు వాసులు బెంబేలెత్తి పోతున్నారు.
ఇటీవలే ఏలూరు జిల్లాలో పులి సంచారం
ఏలూరు జిల్లాలో చిరుత పులి సంచారం కలకలం రేపింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో చిరుత సంచారం కనిపించింది. ఈరోజు తెల్లవారుజామున ప్రాజెక్టులో కార్మికులు ప్రయాణిస్తున్న ఓ కారుకు చిరుత పులి అడ్డం వచ్చింది. ఒక్కసారిగా కారుకి అడ్డంగా చిరుత రావడంతో వాళ్లంతా భయపడ్డారు. అయితే కారును చూసినా.. అందులో ఉన్న వ్యక్తుల్ని చూసినా… చిరుత పులి ఏవిూ అనకుండా అక్కడి నుండి వెళ్లిపోయింది. పోలవరం ముంపు గ్రామాలను అధికారులు గతంలోనే ఖాళీ చేయించడంతో… ప్రస్తుతం ఖాళీగా ఉన్న గ్రామాల్లో అడవి జంతువులు తిరుగుతున్నాయి. ఇక్కడికి చాలా దగ్గరలోనే పాపికొండల అభయారణ్యం ఉండడంతో ఖాళీ అయిన 19 గ్రామాలలో.. అడవి జంతువులు సంచరిస్తున్నాయి. రాత్రి వేళలో గోదావరి నది వద్దకు వచ్చి నీరు తాగుతున్నట్లు కార్మికులు చెబుతున్నారు. కార్మికులతోపాటు అక్కడ పని చేస్తున్న అధికారులు కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఎప్పుడు, ఎటు నుంచి చిరుత పులి వస్తుందో తెలియక గజగజా వణికిపోతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *