ఉత్తుత్తి కేసులతో ప్రతీకారం

టెన్త్‌ ప్రశ్నా పత్రాల లీకేజీ వ్యవహారం ఢల్లీి దాకా వెళ్ళింది. ఈ కేసులో కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ అరెస్టయిన నేపథ్యంలో నిబంధనల ప్రకారం లోక్‌ సభ సెక్రటేరియట్‌ బులిటెన్‌ రిలీజ్‌ చేసింది. 151 సీఆర్పీసీ కింద ముందస్తు కస్టడీలోకి తీసుకున్నామని బొమ్మల రామారం పోలీసులు తెలిపినట్లు బులిటెన్‌ లో తెలిపింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నందుకే బండి సంజయ్‌ ని అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. కరీంనగర్‌ లో సంజయ్‌ ని అరెస్ట్‌ చేసి తర్వాత రాజకొండ పరిధిలోని బొమ్మల రామారం స్టేషన్‌ కు తరలించినట్లు బులిటెన్‌ లో వెల్లడిరచారు. అనంతరం కస్టడీ నుంచి విడిచిపెట్టినట్లు లోక్‌ సభ ప్రివిలేజ్‌ కమిటీకి కరీంనగర్‌ పోలీసులు తెలిపారు. అదలా ఉంటే 10వ తరగతి పేపర్‌ లీకేజీ కేసులో అరెస్ట్‌ అయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ రిమాండ్‌ను రద్దు చేయాలని కోరుతూ దాఖలైన లంచ్‌ మోషన్‌ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ జరిపింది. ఇరు పక్షాల వాదనలు విన్న హైకోర్టు…. ఈ కేసులో కౌంటర్‌ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది. ఈలోపు బండి సంజయ్‌ బెయిల్‌ పిటిషన్‌ వేసుకోవచ్చని తెలిపింది. అయితే విచారణ సందర్భంగా హై కోర్ట్‌, టెన్త్‌ క్వశ్చన్‌ పేపర్‌ పబ్లిక్‌ డొమైన్‌లోకి వచ్చాక అది లీకేజ్‌ ఎలా అవుతుందని తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. అసలు బండి సంజయ్‌ చేసిన తప్పేంటని అడిగింది. పేపర్‌ బయటకు వచ్చాక వాట్సాప్‌లో ఫార్వార్డ్‌ మాత్రమే చేశారని.. కానీ పేపర్‌ లీకేజీలో బండి సంజయ్‌ పాత్ర లేదు కదా అని ప్రశ్నించింది. పేపర్‌ బయటకు వచ్చాక ప్రతిపక్ష నేతగా ఈ అంశాన్ని ఎలా అయినా వాడుకోవచ్చని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వం నెత్తిన మినీ మొట్టికాయలు వేసింది. ఇప్పటికే కింది కోర్టులో బెయిల్‌ పిటిషన్‌ వేశామని బండి సంజయ్‌ తరపు న్యాయవాది రామచంద్రరావు హైకోర్టుకు తెలిపారు. దానిపై ఏప్రిల్‌ 06వ తేదీనే తీర్పు వచ్చేలా ఆదేశాలని ఇవ్వాలని కోరారు. మార్చి8వ తేదీన ప్రధాని మోదీ పర్యటన ఉండటంతో .. సంజయ్‌పై కింది కోర్టు ఇచ్చిన రిమాండ్‌ రిజెక్ట్‌ చేయాలని కోరారు. దీనిపై హైకోర్టు స్పందిస్తూ.. కింది కోర్టులో బెయిల్‌ రాకుంటే హైకోర్టులో హౌజ్‌ మోషన్‌ పిటిషన్‌ వేసుకోవాలని సూచించింది. రిమాండ్‌ క్వాష్‌ పిటిషన్‌పై విచారణను ఈనెల 10కి వాయిదా వేసింది. అయితే, ఈకేసుకు సంబంధించి అంతిమ తీర్పు ఎలా ఉంటుందనేది పక్కన పెడితే, ఈ కేసు రాజకీయంగా మరింత సంచలనంగా మారే సంకేతాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర శాసన సభ ఎన్నికలు సవిూపిస్తున్న సమయంలో ఢల్లీి మద్యం కుంభకోణం కుసు, సుఖేష్‌ చంద్రశేఖర్‌ కేసు, టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీ కేసును అస్త్రాలుగా చేసుకుని బీఆర్‌ఎస్‌ ను ఇరకాటంలో పెట్టేందుకు ఢల్లీి నుంచి బీజేపీ పావులు కదుపుతుంటే, అందుకు ప్రతిగా బీజేపీకి దీటుగా సమాధానం చెప్పడానికి బిఆర్‌ఎస్‌ రెడీ అయింది. రాష్ట్రంలో బిజెపి నాయకులను ఉక్కిరిబిక్కిరి చేయాలని నిర్ణయించుకున్న బీఆర్‌ఎస్‌ తన వ్యూహంలో భాగంగా బిజెపి స్లీపర్‌ సెల్స్‌ పై నిఘా పెట్టడమే కాకుండా, వారి వ్యూహాలను ఎప్పటికప్పుడు ముందే గుర్తించి ప్రజా క్షేత్రంలో ప్రజలకు అర్థమయ్యేలా చెప్పేందుకు సిద్దమైంది. అయితే న్యాయస్థానాలు చేసే వ్యాఖ్యలు, ఇచ్చే తీర్పులు ఎలా ఉన్నా అంతిమంగా ప్రజలు ఎలాంటి తీర్పు ఇస్తారు అనేదే కీలకమని అంటున్నారు. నిజానికి ఈ మొత్తం వ్యవహారం కాంగ్రెస్‌ నాయకులు అభిప్రాయ పడుతున్నట్లుగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ ఉమ్మడి వ్యూహంలో బాగంగా సాగుతున్న రాజకీయ క్రీడ అయిన కావచ్చు అనే అనుమానాలు లేక పోలేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *