కాంగ్రెస్‌ సీడబ్ల్యూసీలో తెలంగాణ నేతలు

హైదరాబాద్‌, జూన్‌ 27 :
కాంగ్రెస్‌ పార్టీలో అత్యున్నత నిర్ణయాధికారం దానిదే.. అదే సీడబ్ల్యూసీ` కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ.. ఏఐసీసీ జాతీయ అధ్యక్షుడిగా మల్లికార్జున్‌ ఖర్గే ఎన్నికైన తరువాత సీడబ్ల్యూసీ ని ఇంకా పునఃవ్యవస్థీకరణ చేయలేదు.. 2024ఎన్నికలు సవిూపిస్తుండడంతో అగ్రనాయకత్వం సీడబ్ల్యూసీపై దృష్టి సారించింది. సీడబ్ల్యూసీ సభ్యులను ఎన్నుకోవడానికి ఎన్నిక అవసరం లేదని రాయపూర్‌ లో జరిగిన కాంగ్రెస్‌ ప్లీనరీలో తీర్మానం చేశారు. నిర్ణయాధికారం అధ్యక్షుడు ఖర్గేకి కట్టబెట్టారు.. సీడబ్ల్యూసీలో మొత్తం 35 మంది సభ్యులు ఉంటారు. అందులో ఏఐసీసీ 12 మందిని ఎన్నుకుంటుంది. మిగిలిన వారిని అధ్యక్షుడు ఎంపిక చేస్తారు. వీరితో పాటు శాశ్వత సభ్యులు కూడా ఉంటారు. అయితే, ఈసారి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళా, మైనారిటీలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పించడంతో తెలంగాణ వారికి కూడా మొదటిసారి సీడబ్ల్యూసీ మెంబర్‌ దక్కనుంది.మరో రెండు రోజుల్లో సిడబ్ల్యూసి పునఃవ్యవస్తీకరణ జరుగనుంది.. తెలంగాణలో ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రానికి కూడా అధిష్టానం అవకాశం కల్పించనుందని సమాచారం.. ఇప్పటికే బీజేపీ సైతం వారి అత్యున్నత పార్లమెంటరీ బోర్డులో రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్‌ కి అవకాశం కల్పించారు.. దీంతో తెలంగాణ నుంచి సీడబ్ల్యూసి రెసులో ఎమ్మెల్యే సీతక్క పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. మహిళా, ట్రైబల్‌ విభాగంలో అగ్రనేత..కావున రాహుల్‌ గాంధీ సీతక్క పేరు సూచించినట్లు సమాచారం.. రాహుల్‌ గాంధీ భారత్‌ జోడోయాత్ర సమయంలో కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు నడిచి సీతక్క రాహుల్‌ దృష్టిని ఆకర్శించారు. అప్పటి నుంచి తెలంగాణకి సంబంధించిన ఏ కార్యక్రమంలో అయినా సీతక్క ని రాహుల్‌ గాంధీ ప్రత్యేకంగా గుర్తిస్తారు.మరోవైపు సీతక్కతో పాటు కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి, ఎంపీ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి పేర్లు సైతం పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. గతంలో సీడబ్ల్యూసీ కోసం జానారెడ్డి ఢల్లీి వెళ్లారు.. జానారెడ్డికి మద్దతుగా పిసిసి చీఫ్‌ రేవంత్‌ రెడ్డి సైతం గతంలో లేఖ రాశారు. సీడబ్ల్యూసీ కోసం నల్గొండ నేతలు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు.. గతంలో తనకి సీడబ్ల్యుసీ ఇవ్వాలని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా కోరారు.. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కూడా చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఎవరికి వరిస్తుందనేది.. కాంగ్రెస్‌ పార్టీ వర్గాల్లో హాట్‌ టాపిక్‌ గా మారింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *