బీఆర్ఎస్ గెలుపుపై కేటీఆర్ ఏమన్నారంటే..!
హైదరాబాద్: తెలంగాణలో ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతోందని మంత్రి కేటీఆర్ జోస్యం చెప్పారు. ఈ మేరకు ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘‘ఆదిలాబాద్ నుండి అచ్చంపేట దాకా… సిర్పూర్ నుంచి అలంపూర్ దాకా… భద్రాచలం నుంచి జహీరాబాద్ దాకా… తాండూర్ నుంచి చెన్నూర్ దాకా… మధిర నుంచి ముధోల్ దాకా… మక్తల్ నుంచి జుక్కల్ దాకా… తెలంగాణ అంతటా కారు జోరు! మళ్లీ రానున్నది కేసీఆర్ సర్కారు!’’ అంటూ వ్యాఖ్యానించారు.