తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం

తెలుగు రాష్ట్రాల్లో భానుడు ప్రతాపం చూపుతున్నాడు. ఉదయం 9 గంటల నుంచే ఎండ వేడిమిని తట్టుకోలేకపోతున్నారు ప్రజలు. అందులోనూ మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు అత్యవసరమైతే తప్ప.. బయటకు రాకపోవడం మంచిదని వాతావరణ శాఖ హెచ్చరించింది. మరికొన్ని రోజులు పరిస్థితి ఇలాగే ఉండనుంది. అకాల వర్షాలతో ఏప్రిల్‌ నెలలో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి. కానీ గత 10 రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో సగటున 41 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండగా, కొన్ని జిల్లాల్లో 45, 46 డిగ్రీలు నమోదు అవుతున్నాయి. ఈ ఏడాదిలో విజయవాడలో అత్యంత వేడిగా ఉన్న రోజుగా మే 15 నిలిచిందని ఏపీ వెదర్‌ మ్యాన్‌ తెలిపారు. విజయవాడ, చుట్టుపక్కల ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రత 45 డిగ్రీల నమోదైనట్లు వెల్లడిరచారు. ప్రకాశం జిల్లా తర్లపాడు లో గరిష్టంగా 46 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత ఉంది. ఏలూరు, గుంటూరు, ఉభయ గోదావరి జిల్లాలు, నంద్యాల, విజయనగరం, పల్నాడు జిల్లాల్లోని కొన్ని పట్టణాలలో 45
నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రతలతో ప్రజలు ఠారెత్తిపోతున్నారు. అత్యంత వేడి వాతావరణం ఉందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.ఏపీతో పాటు తెలంగాణలోనూ ఎండలకు ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. తెలంగాణలో 42 డిగ్రీల నుంచి 45 డిగ్రీలమధ్య సగటు ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఆదివారం అత్యధికంగా మంచిర్యాల జిల్లా కొండపూర్‌లో 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌ వాతావరణ శాఖ 18 జిల్లాలకు ఆరెంజ్‌ ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. అంటే ఆ జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చని అంచనా వేస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది. హైదరాబాద్‌ లో 41 నుంచి 43 డిగ్రీల మధ్య గరిష్ట పగటి ఉష్ణోగ్రత నమోదు కానుంది. మంచిర్యాల, జగిత్యాల, కుమురం భీమ్‌, నిజామాబాద్‌, నల్గొండ జిల్లాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేసింది వాతావరణ కేంద్రం. రంగారెడ్డి, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ జారీ చేసి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నివారం గరిష్ఠంగా వీణవంక మండలంలో 45.8 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదు కాగా, ఆదివారం 45.9 డిగ్రీలతో మంచిర్యాల జిల్లా కొండాపూర్‌ ఆ రికార్డు బ్రేక్‌ చేసింది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *