ఇండియాలో టాప్‌ టెన్‌ బ్రాండ్స్‌

ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ భారతదేశంలోనే అత్యంత విలువైన బ్రాండ్‌గా నిలిచింది. బ్రాండ్‌ కన్సల్టెన్సీ కంపెనీ ఇంటర్‌బ్రాండ్‌ ఈ రిపోర్ట్‌ను రిలీజ్‌ చేసింది. భారతదేశంలోని అత్యంత విలువైన బ్రాండ్‌లతో టాప్‌`50 లిస్ట్‌ను ప్రకటించింది. ఈ సంవత్సరం ఎడిషన్‌లోని మొత్తం కంపెనీల విలువ రూ. 8,31,005 కోట్లు (వి100 బిలియన్లు). గత దశాబ్ద కాలంలో ఈ విలువ ఏకంగా 167% పెరిగింది. లిస్ట్‌ మొత్తం విలువ వి100 బిలియన్‌ మార్కును దాటడం ఇదే తొలిసారి.ఇంటర్‌బ్రాండ్‌ రిపోర్ట్‌ ప్రకారం,
ఫస్ట్‌ ర్యాంక్‌లో ఉన్న టీసీఎస్‌ బ్రాండ్‌ వాల్యూ రూ. 1,09,576 కోట్లు.
సెకండ్‌ ర్యాంక్‌లో ఉన్న రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ బ్రాండ్‌ విలువ రూ. 65,320 కోట్లు.
మూడో స్థానంలో ఉన్న ఇన్ఫోసిస్‌ బ్రాండ్‌ వాల్యూ రూ. 53,324 కోట్లు.
4. హెడిఎఫ్సీ బ్యాంక్‌ ` రూ. 50,291 కోట్లు.
5. జియో ` రూ. 49.027 కోట్లు.
6. ఎయిర్‌టెల్‌ ` రూ. 46,553 కోట్లు
7. లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ (ఒఎఅ) ` రూ. 33,792 కోట్లు
8. మహీంద్ర డ మహీంద్ర ` రూ. 31,136 కోట్లు
9. స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ూఃఎ) ` రూ. 30.055 కోట్లు
10. ఐసిఐసిఐ బ్యాంక్‌ ` రూ. 25,915 కోట్లు
టాప్‌`10 బ్రాండ్‌ల మొత్తం విలువలో మొదటి మూడు బ్రాండ్‌ల వాటానే 46% (దాదాపు సగం వాటా). టాప్‌`5 బ్రాండ్‌ల మొత్తం వాల్యూ, పట్టిక మొత్తం విలువలో 40%కు సమానం. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే, గత దశాబ్దంలో కాలంలో తొలిసారిగా మూడు టెక్నాలజీ బ్రాండ్‌లు టాప్‌`5లో చోటు సంపాదించాయి.టాప్‌ టెన్‌ బ్రాండ్‌ల మొత్తం వాల్యూ రూ. 4,94,992 కోట్లు. లిస్ట్‌ మిగిలిన 40 కంపెనీల బ్రాండ్‌ల విలువ రూ. 3,36,013 కోట్లు. అంటే, ఈ 40 కంపెనీల బ్రాండ్‌ విలువ కన్నా టాప్‌`10 కంపెనీల బ్రాండ్‌ వాల్యూ ఎక్కువ.’’టాప్‌`10 బ్రాండ్‌ల అసాధారణ పనితీరు వాటి స్ట్రాటెజిక్‌ ఫోకస్‌, సమర్థతను స్పష్టంగా చెబుతోంది. హోమ్‌ బిల్డింగ్‌ డ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, టెక్నాలజీ రంగాల్లో చెప్పుకోదగ్గ పెరుగుదల కనిపించిందన్నారు. 2014 నుంచి ఏడు కొత్త బ్రాండ్‌లు ఈ లిస్ట్‌లోకి వచ్చాయి’’ ` ఇంటర్‌బ్రాండ్‌ ఇండియా డ దక్షిణాసియా సీఈవో ఆశిష్‌ మిశ్రాపదేళ్లుగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రంగాల్లో… ఎఫ్‌ఎంసీజీ సెక్టార్‌ 25% సీయేజీఆర్‌ వృద్ధితో టాప్‌లో ఉంది. ఆ తర్వాత గృహ నిర్మాణం డ మౌలిక సదుపాయాలు 17% సీయేజీఆర్తో, టెక్నాలజీ సెక్టార్‌ 14% సీయేజీఆర్‌ వద్ద వృద్ధి చెందాయి.హోమ్‌ బిల్డింగ్‌ డ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ రంగం రూ. 6,900 కోట్ల నుంచి రూ. 34,400 కోట్లకు ఎగబాకింది. టెక్నాలజీ సెక్టార్‌ రూ. 69,300 కోట్ల నుంచి రూ. 2.5 లక్షల కోట్లకు విస్తరించింది.’’వి100 బిలియన్‌ డాలర్ల మార్కును అధిగమించడం అద్భుతమైన ఫీట్‌. ప్రపంచ స్థాయిలో ఇండియన్‌ బ్రాండ్‌ల బలం, సామర్థ్యానికి ఇది నిదర్శనం’’ ` ఇంటర్‌బ్రాండ్‌ గ్లోబల్‌ సీఈవో గొంజలో బ్రూజోటాప్‌`50 లిస్ట్‌లో ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెక్టార్‌ నుంచి 9 సంస్థలు చోటు దక్కించుకున్నాయి. హోమ్‌ బిల్డింగ్‌ డ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సెక్టార్‌ నుంచి 7 కంపెనీలు ఉన్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *