కూకుట్‌ పల్లిలో కుంగుతున్న భూమి

హైదరాబాద్‌, జూన్‌ 29
హైదరాబాద్‌ లోని కూకట్‌ పల్లిలో ఒక్కసారిగా భూమి కుంగిపోయింది. స్థానిక గౌతమ్‌ నగర్‌ కాలనీ లో ఒక ప్రైవేట్‌ హోమ్‌ కన్‌ స్ట్రక్షన్‌ నిర్మాణ సంస్థ పనులు చేస్తుండగా భూమి కుంగిపోయింది. ఒక్కసారిగా పెద్ద గుంత ఏర్పడటంతో కాలనీవాసులు భయాందోళనకు గురయ్యారు. అపార్ట్‌ మెంట్‌ సెల్లార్‌ లో జిలెటిన్‌ స్టిక్స్‌ వాడి బ్లాస్టింగ్‌ చేయడంతో రోడ్డు కుంగిపోయిందని స్థానికులు ఆరోపించారు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు. ఓ ప్రైవేట్‌ కన్‌ స్ట్రక్షన్‌ కు చెందిన సంస్థ భారీ ఎత్తున నిర్మాణం చేపట్టింది. నిర్మాణాలు చేపట్టగా సెల్లార్‌ కోసం తవ్వడంతో పక్కనే ఉన్న రోడ్డు సైతం కుంగిపోయింది. పెద్ద గుంతలా ఏర్పడటంతో కాలనీ వాసులు బయటికి వెళ్లలేని పరిస్థితి తలెత్తడంతో వారు ఆందోళన చేపట్టారు. కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఆ సంస్థ నిర్మాణం చేపట్టిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అర్ధరాత్రి సమయంలో అక్రమంగా బ్లాస్టింగ్‌ చేస్తున్నారని.. ఈ విషయాలపై స్థానిక ఎమ్మెల్యేతో పాటు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు.బిల్డింగ్‌ నిర్మాణానికి ముందు అనుమతి లేకుండా అదనపు అంతస్తు నిర్మాణం చేస్తే జీహెచ్‌ఎంసీ అధికారులు కూలగొట్టేస్తారని.. అయితే ఇంత పెద్ద నిర్మాణ సంస్థ అక్రమాలకు పాల్పడుతుంటే అధికారులకు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బాధ్యులపై చర్యలు చేపట్టి, తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.స్థానికులు విూడియాతో మాట్లాడారు.. మాకు చిన్న పర్మిషన్‌ లేషన్‌ ఇల్లు భాగాన్ని మూడుసార్లు జీహెచ్‌ఎంసీ అధికారులు కూలగొట్టారు. ఇప్పుడు ఏ పర్మిషన్‌ ఉందని ఇక్కడ తవ్వేస్తున్నారు. మా ప్రాణాలకు ఎవరు బాధ్యత వహిస్తారని ఓ మహిళ ప్రశ్నించారు. తన పాపకు ఆరోగ్యం బాగోలేదని ఆసుపత్రికి తీసుకెళదామంటే ఇంటి నుంచి వెళ్లేందుకు దారి కూడా లేదని తెలిపారు. 3 నెలల నుంచి కార్పొరేట్‌ ఆఫీసు చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. పెద్ద పెద్ద అపార్టుమెంట్లు, నిర్మాణాలు సైడ్‌ వాల్స్‌ లేకుండా నిర్మిస్తుంటే మా ప్రాణాలకు రక్షణ ఎలా ఉంటుందో చెప్పాలంటూ అధికారులను ప్రశ్నించారు. నిర్మాణం చేపట్టిన పక్కన స్తంభాలు పడిపోతున్నాయని, వందల కుటుంబాలు నివసిస్తున్నారని వారి ప్రాణాలంటే ప్రభుత్వానికి లెక్క లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌, మంత్రులు కేటీఆర్‌ ఏమైపోయారు.. నాలుగు రోజులు విద్యుత్‌ సౌకర్యం లేదని.. అప్పుడు ప్రభుత్వం, అధికారులు ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. ప్రజలు చనిపోతే తప్పా, ప్రభుత్వం చర్యలు తీసుకునేలా లేదన్నారు. చిన్న చిన్న కారణాలతో సామాన్యుల ఇళ్లు కూలగొట్టే జీహెచ్‌ఎంసీ అధికారులు ఇప్పుడు ఎక్కడున్నారు అని నిలదీశారు. ప్రణీత్‌ అని కన్‌ స్ట్రక్షన్‌ కంపెనీకి పర్మిషన్‌ ఇచ్చారని విూడియాకు స్థానికులు చెప్పారు. పిల్లలకు ఆరోగ్యం బాగాలేదంటే కూడా జీహెచ్‌ఎంసీ కనికరం చూపకుండా తమ ఇళ్లు కూలగొట్టి ప్రతాపం చూపించిందన్నారు. ఇప్పుడు 30`40 అంతస్తులకు ఎలా పర్మిషన్‌ ఇచ్చారు. మా ఓట్లు విూకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే పట్టించుకుంటారా అని గట్టిగానే అడిగారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *