ఐపీఎల్ ట్రోఫీకి ప్రత్యేక పూజలు చేయించిన చెన్నై టీం..!

ఐపీఎల్ 2023 సీజన్ కూడా ముగిసింది. ఎన్నో అంచనాలతో ఈ సీజన్ ప్రారంభించిన డిఫెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్.. ఫైనల్ మ్యాచ్‌లో చతికిలపడింది. రవీంద్ర జడేజా హీరో ఇన్నింగ్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ మరో టైటిల్‌ను తమ ఖాతాలో వేసుకుంది. దీంతో ఐపీఎల్‌లో అత్యధిక టైటిల్స్ నెగ్గిన జట్టుగా ముంబై రికార్డును సమం చేసింది.ఈ మ్యాచ్‌లో చెన్నై అద్భుతమైన విజయం సాధించడంతో తొలిసారి కెప్టెన్ ఎంఎస్ ధోనీ కూడా చాలా భావోద్వేగానికి గురయ్యాడు. విన్నింగ్ రన్స్ చేసిన జడేజాను గాల్లోకి ఎత్తుకొని సంతోషంతో కన్నీరు పెట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌తో రిటైర్‌మెంట్ ప్రకటించిన అంబటి రాయుడు కూడా అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు.అందుకే ట్రోఫీ అందుకునే అవకాశం అతనికే ఇచ్చాడు ధోనీ. ఇవన్నీ ముగిసిన తర్వాత అసాధ్యం అనుకున్న విజయాన్ని సాధించిన చెన్నై జట్టు.. ఐపీఎల్‌లో చరిత్ర సృష్టించింది. ఐదు వికెట్ల తేడాతో గుజరాత్‌ను చిత్తు చేసి ట్రోఫీని ముద్దాడింది. ఆ తర్వాత తమ ట్రోఫీకి ప్రత్యేకమైన పూజ చేయించిందీ టీం మేనేజ్‌మెంట్.

IPL 2023 SRH భవిషత్తు కోసం Kavya Maran రిస్క్ త్యాగరాయ నగర్ తిరుపతి దేవస్థానంలో ఈ ట్రోఫీకి ప్రత్యేక పూజలు చేయించిన ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. గతేడాది అత్యంత ఘోరమైన ప్రదర్శన చేసిన చెన్నై సూపర్ కింగ్స్.. ఈసారి కూడా టోర్నీని ఓటమితోనే ప్రారంభించింది. అయితే ఆ తర్వాత వరుస విజయాలతో దూసుకుపోయింది.గుజరాత్‌తో చెన్నై ఆడిన తొలి మూడు మ్యాచుల్లో విజయం గుజరాత్‌కే దక్కింది. అయితే ఐపీఎల్ మొదటి క్వాలిఫైయర్‌లో దీన్ని బ్రేక్ చేసిన చెన్నై టీం తొలి విజయం నమోదు చేసింది. ఆ తర్వాత మళ్లీ ఫైనల్‌లో అద్భుతమైన విజయంతో టైటిల్ నెగ్గింది. ఈ విజయం తర్వాత ఇంటికి బయలు దేరిన ధోనీకి అహ్మదాబాద్ ఎయిర్‌పోర్టులో కూడా ఫ్యాన్స్ మంచి సెండాఫ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో కూడా నెట్టింట వైరల్ అవుతోంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *