ఆస్కార్‌ టీమ్‌ కు షా విందు…

నాటు నాటు పాటకు ఆస్కార్‌ గెలుచుకున్న ట్రిపుల్‌ ఆర్‌ సినిమా టీంకు అమిత్‌ షా విందు ఇవ్వనున్నారు. తెలంగాణ పర్యటనకు వస్తున్న అమిత్‌ షా.. హైదరాబాద్‌లోనే ఈ విందు ఇవ్వనున్నారు. .ఈ విందు భేటీ దాదాపుగా 40 నిమిషాల సేపు ఉంటుంది. ఆస్కార్‌ గెలిచినందుకు అమిత్‌ షా ఆత్మీయ సన్మానం చేయనున్నట్లుగా తెలుస్తోంద. ట్రిపుల్‌ ఆర్‌ దర్శకుడు, హీరోలతోపాటు కీలకమైన యూనిట్‌ మొత్తాన్ని ఆహ్వానించినట్లుగా చెబుతున్నారు. దేశానికి గర్వకారణం అయిన విజయం సాధించినందుకు గుర్తుగా ఈ విందు ఏర్పాటు చేస్తున్నట్లుగా బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. ఇందులో ఎలాంటి రాజకీయం లేదని చెబుతున్నారు.నిజానికి ఆర్‌ ఆర్‌ ఆర్‌ టీం ఆస్కార్‌ అవార్డుల తర్వాత విడివిడిగా ఇండియాకు చేరుకున్నారు. చిరంజీవి, రామ్‌ చరణ్‌ ఇండియాకు వచ్చిన తర్వాత అమిత్‌ షాను కలిశారు. అలాగే సినిమా ఇంకా ఆస్కార్‌ విజయం సాధించకముందు హైదరాబాద్‌ పర్యటనకు వచ్చినప్పుడు అమిత్‌ షా.. జూనియర్‌ ఎన్టీఆర్‌ ను హోటల్‌కు పిలిపించుకుని అభినందించారు. అయితే ఇప్పుడు అధికారికంగా టీం మొత్తానికి సన్మానం ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నారు. ఆస్కార్‌ అవార్డు సాధించినప్పటి నుండి రాజమౌళి టీంకు వరుసగా సన్మానాలు జరుగుతూనే ఉన్నాయి. టాలీవుడ్‌ మొత్తం హైదరాబాద్‌ శిల్పకళావేదికలో తెలుగు చిత్రపరిశ్రమ ఘనంగా సత్కరించింది. తెలుగు సినిమాను ప్రేమించే ప్రతి ఒక్కరికీ ఈ సన్మాన కార్యక్రమం ఓ మంచి జ్ఞాపకం, గర్వించదగ్గ ప్రోత్సాహం అయిందని అందరూ సంతోషం వ్యక్తం చేశారు. అలాగే వివిధ నగరాల్లో విదేశాల్లో కూడా సన్మాన కార్యక్రమాలు జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా త్వరలో సన్మాన సభను ఏర్పాటు చేయనుంది. ఆస్కార్‌ అవార్డ్‌ ను అందుకున్న ఏకైక తెలుగు చలనచిత్రం ఖీఖీఖీ . ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీ లో నాటు నాటు పాటకు ఆస్కార్‌ అవార్డు రావడం పట్ల తెలుగు రాష్ట్రాలు, దేశం గర్వపడుతుందని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా ప్రపంచవ్యాప్తంగా విజయం సాధించింది. బాక్సాఫీస్‌ దగ్గర భారీ వసూళ్లు సాధించింది. భారత సినీ చరిత్రలో అతి భారీ విజయాన్ని నమోదు చేసింది. జపాన్‌ వంటి దేశాల్లోనూ మంచి వసూళ్లు రాబట్టింది. నాటు నాటు పాటు పిల్లలకు కూడా నోటెడ్‌ అయిపోయింది. ఇంత భారీ విజయం సాధించిన సినిమాకు.. ఆస్కార్‌ కూడా రావడంతో తిరుగులేకుండా అయినట్లయింది. ఆ సినిమా టీంను గౌరవించుకునేందుకు ప్రభుత్వాలు కూడా పోటీ పడుతున్నాయి.
చేరికలపై షా… ఆరా
ఇదే ఏడాది అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతోంది తెలంగాణ. ఇప్పటికే ప్రధాన పార్టీలు నువ్వా `నేనా అన్నట్లు ముందుకెళ్తున్నాయి. అధికార బీఆర్‌ఎస్‌ మరోసారి గెలిచి హ్యాట్రిక్‌ కొట్టాలని చూస్తుంటే… ఇప్పటికే రెండుసార్లు అధికారానికి దూరమైన తెలంగాణ కాంగ్రెస్‌…ఈసారి ఎలాగైనా గెలిచాలని చూస్తోంది. ఇదిలా ఉంటే బీజేపీ మాత్రం… తెలంగాణపై సీరియస్‌ గా ఫోకస్‌ పెట్టేసింది. గత కొంతకాలంగా ఆ పార్టీ బలపడుతూ వస్తోంది. కీలమైన ఉపఎన్నికలతో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటిన కమలనాథులు… రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ జెండాను ఎగరవేయాలని చూస్తున్నారు. ఈ క్రమంలో అగ్రనేతలు కూడా వరుసగా రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఇటివలే ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటనకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే? కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షాకు కూడా తెలంగాణ పర్యటనకు రానున్నారు. పర్యటనలో భాగంగా చేవెళ్ల పార్లమెంట్‌ పరిధిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది. ఈ బహిరంగ సభ నుంచే అమిత్‌ షా ఎన్నికలకు సమర శంఖారావం పూరించనున్నట్లు తెలుస్తోంది. గత కొద్దిరోజుల కిందట రాష్ట్రానికి వచ్చిన అమిత్‌ షా? ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇదే సమయంలో పార్టీ నేతలతో కూడా మంతనాలు జరిపారు. అయితే ఈసారి మాత్రం ప్రత్యేకంగా పార్టీ ఏర్పాటు చేయనున్న భారీ సభకు హాజరుకానున్న నేపథ్యంలో అమిత్‌ షా ప్రసంగంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 90 స్థానాల్లో గెలుపు లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతుంది.ఇప్పట్నుంచే ప్రజల్లో ఉంటూ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతంపై చూసే అంశాలపై ప్రధానంగా దృష్టి సారించింది. ఆయా నియోజకవర్గాల స్థానాల్లో బలమైన అభ్యర్థుల కోసం బీజేపీ హైకమాండ్‌ ఫోకస్‌ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే పార్టీ బలహీనంగా ఉన్న స్థానాల్లో చేపట్టాల్సిన చర్యలపై కూడా లోతుగానే చర్చిస్తోంది. ఈ సీట్లలో బలమైన అభ్యర్థులను తెరపైకి తీసుకురావటంతో పాటు పార్టీ పరంగా చేపట్టాల్సిన కార్యాచరణపై కూడా కసరత్తు చేస్తోంది. ఇక చేవెళ్ల సభ వేదికగా భారీగా చేరికలు ఉంటాయన్న లీకులు కూడా వస్తున్నాయి. బీఆర్‌ఎస్‌ కు చెందిన పలువురు కీలక నేతలు కమలం కండువా కప్పుకొనే ఛాన్స్‌ ఉందన్న చర్చ జోరుగా వినిపిస్తోంది. అయితే దీనిపై బీజేపీ నేతల నుంచి క్లారిటీ లేదు. ఫలితంగా చేరికల విషయంపై ఉత్కంఠ నెలకొందనే చెప్పొచ్చు. మొత్తంగా మరికొద్ది నెలల్లోనే ఎన్నికలు సవిూపిస్తున్న క్రమంలో….బీజేపీ మరింత దూకుడు పెంచే అవకాశం ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *