వన్డేల్లోకి స్టోక్స్‌ రీఎంట్రీ

లండన్‌: వన్డేల్లో రిటైర్మెంట్‌ను వెనక్కు తీసుకొన్న స్టార్‌ ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌కు ఇంగ్లండ్‌ వరల్డ్‌కప్‌ జట్టులో చోటు దక్కింది. టెస్టు కెప్టెన్‌ అయిన స్టోక్స్‌ గతేడాది వన్డేలకు గుడ్‌బై చెప్పాడు. కానీ, బిగ్‌మ్యాచ్‌ ప్లేయర్‌ అయిన బెన్‌ను జట్టులోకి తీసుకోవాలని ఇంగ్లండ్‌ వన్డే కెప్టెన్‌ జోస్‌ బట్లర్‌ చేసిన ప్రయత్నం ఫలించింది. తొలుత స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగే నాలుగు వన్డేల సిరీస్‌ కోసం 15 మంది సభ్యుల ఇంగ్లిష్‌ జట్టును సెలెక్టర్లు ఎంపిక చేశారు. ఇందులో స్టోక్స్‌కు కూడా చోటు లభించింది. భారత్‌లో జరిగే వరల్డ్‌క్‌పనకు కూడా ఇదే ప్రాథమిక జట్టని సెలెక్టర్‌ లూక్‌ రైట్‌ స్పష్టం చేశాడు. మోకాలి నొప్పితో ఇబ్బందులు పడుతున్న బెన్‌ను స్పెషలిస్ట్‌ బ్యాటర్‌గా కొనసాగించనున్నారు. కాగా, యువ ఆటగాడు హ్యారీ బ్రూక్‌, పేసర్‌ జోఫ్రా ఆర్చర్‌కు జట్టులో స్థానం దక్కలేదు. 2019లో ఇంగ్లండ్‌ వన్డే వరల్డ్‌కప్‌ నెగ్గడంలో స్టోక్స్‌ కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. కాగా, వచ్చే నెల 5వ తేదీలోపు ప్రాబబుల్‌ టీమ్‌ను ఆయా బోర్డులు ఐసీసీకి సమర్పించాల్సి ఉంది.

ఇంగ్లండ్‌ వరల్డ్‌కప్‌ ప్రాథమిక జట్టు

బట్లర్‌ (కెప్టెన్‌), మొయిన్‌ అలీ, గస్‌ అట్కిన్సన్‌, బెయిర్‌స్టో, సామ్‌ కర్రాన్‌, లివింగ్‌స్టోన్‌, డేవిడ్‌ మలన్‌, ఆదిల్‌ రషీద్‌, జో రూట్‌, జేసన్‌ రాయ్‌, బెన్‌ స్టోక్స్‌, రీస్‌ టాప్లే, డేవిడ్‌ విల్లే, మార్క్‌ వుడ్‌, క్రిస్‌ వోక్స్‌.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *