హ్యాట్రిక్‌ కొట్టడమే లక్ష్యం

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి.. కేంద్రంలో హ్యాట్రిక్‌ కొట్టడమే లక్ష్యంగా బీజేపీ ఇప్పటినుంచే అడుగులు వేస్తోంది. ప్రతిపక్షాల అడుగులను గమనిస్తూ.. వాటిని తిప్పికొట్టేందుకు అవసరమైన వ్యూహరచనతో ముందుకెళ్తోంది. దీనిలో భాగంగా.. బీజేపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అగ్రనేతల కీలక సమావేశం జరిగింది. బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్‌ షా నేతృత్వంలో జరిగిన ఈ సమావేశానికి 24 మంది కేంద్రమంత్రులు హాజరయ్యారు. మిషన్‌ 2024లో భాగంగా వ్యూహాలు, ప్రణాళికలు సిద్దం చేస్తున్నారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో కొద్ది తేడాతో ఓడిన 144 నియోజకవర్గాలపై ఫోకస్‌ పెట్టింది బీజేపీ హైకమాండ్‌. రాష్ట్రాలు, జిల్లాల వారిగా 144 సీట్లను గ్రూపులుగా విభజించి, కేంద్ర మంత్రులకు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్‌, తెలంగాణ, మహారాష్ట్ర, ఉత్తర్‌ ప్రదేశ్‌ సహా వివిధ రాష్ట్రాల్లో ఆయా పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఇప్పటికే బీజేపీ అగ్రనాయకులు పర్యటించారు. ఆయా ప్రాంతాల్లో గెలుపు గుర్రాలను గుర్తించి నివేదికను సిద్ధం చేసినట్టు సమాచారం. మంత్రుల బృందం గుర్తించిన అంశాలు, లోపాలు, బలాలు, బలహీనతలపై సమావేశంలో లోతుగా సవిూక్షించినట్లు తెలుస్తోంది.మంత్రులిచ్చిన సమాచారంతో విజయానికి బ్లూ`ప్రింట్‌ తయారు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది. 2024 సార్వత్రిక ఎన్నికల్లో ఏయే రాష్ట్రాల్లో సీట్లు తగ్గుతాయి, తగ్గే సీట్లను ఏయే రాష్ట్రాల్లో భర్తీ చేయవచ్చనే పక్కా వ్యూహంతో బీజేపీ ముందుకెళ్తోంది. 2019లో పార్టీ స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయిన సీట్లలో గట్టి వ్యూహాలను అవలంభించాలని బీజేపీ చీఫ్‌ జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్‌ షా దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. గతం కంటే ఈ సారి ఎక్కువ సీట్లు గెలవాలని.. 2024 ఎన్నికల్లో 2019లో ఓడిపోయిన సీట్లలో 50 శాతం గెలుపే లక్ష్యంగా పనిచేయాలని అమిత్‌ షా చెప్పినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.2019లో 543 లోక్‌సభ స్థానాలకు గాను 303 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. దశాబ్దాల తర్వాత తొలిసారిగా ఒక పార్టీకి సొంతంగా భారీ మెజారిటీ వచ్చింది. అయితే.. 100 సీట్లకు పైగా విపక్షాలు గెలుపొందగా, కాంగ్రెస్‌కు అత్యధికంగా 53 సీట్లు వచ్చాయి.తెలంగాణపై ప్రత్యేక ఫోకస్‌ పెట్టింది భారతీయ జనతా పార్టీ.. టీఆర్‌ఎస్‌కు అసలైన ప్రత్యామ్నాయం తామేనని.. వచ్చే ఎన్నికల్లో విజయం మాదేనని బల్లగుద్ది చెబుతున్నారు ఆ పార్టీ నేతలు.. నాగార్జున సాగర్‌ మినహా.. వరుసగా ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడంతో.. క్రమంగా తమ గ్రాప్‌ పెరుగుతుంది అంటున్నారు. కాషాయం పార్టీ అగ్రనేతలు వరుసగా తెలంగాణను చుట్టేస్తున్నారు.. హైదరాబాద్‌ వేదికగా జాతీయ కార్యవర్గ సమావేశాలను నిర్వహించి.. ఆ తర్వాత భారీ బహిరంగ సభతో ప్రధాని నరేంద్ర మోడీ నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌.. ఇక, బీజేపీ నేతల కన్ను ఇప్పుడు సినీ పరిశ్రమపై పడిరది.. వరుసగా సినీ నటులతో పార్టీ అగ్రనేతలు సమావేశం అవుతుండడంతో.. అసలు బీజేపీ ప్లాన్‌ ఏంటి? అనే చర్చ సాగుతోంది. టాలీవువడ్‌ ప్రముఖులతో వరుసగా బీజేపీ అగ్రనేతలు భేటీ కావడం చర్చగా మారుతోంది.. జూనియర్‌ ఎన్టీఆర్‌ ట్రిపుల్‌ ఆర్‌ సినిమాలో కొమురం భీం పాత్ర పోషించి మెప్పించారు.. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చూసిన అమిత్‌షా.. ఎన్టీఆర్‌ను ప్రశంసించేందుకే సమావేశం అయ్యారని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ భేటీలో సీనియర్‌ ఎన్టీఆర్‌ గురించి కూడా చర్చ జరిగిందట.. ఎంతైనా ఎన్టీఆర్‌ విషయం వేరు అనుకోవచ్చు.. రాజకీయ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ కాబట్టి.. రాజకీయాలు కూడా చర్చించి ఉంటారు? పాలిటిక్స్‌లో ఏమైనా జరగొచ్చు? అనే చర్చ ఆసక్తిగా సాగుతుంది.. ఇక, ఇప్పుడు మరో టాలీవుడ్‌ హీరోతో భేటీకి ప్రాధాన్యత ఏర్పడిరది.. తెలంగాణ నుంచి టాలీవుడ్‌లో నిలదొక్కుకున్న హీరో నితిన్‌తో భేటీకి రెడీ అయ్యారు కమలం పార్టీ చీఫ్‌.. తెలంగాణ నుంచి సినీ పరిశ్రమలో నిర్మాతలు, దర్శకులు, నటులు ఉన్నా.. హీరోగా నిలదొక్కుకున్నారు నితిన్‌.. తెలంగాణపై ప్రత్యేకంగా దృష్టిసారించిన ఆ పార్టీ.. అందుకే నితిన్‌ని ఎంచుకున్నట్టు చర్చ సాగుతోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా చూసి ఎన్టీఆర్‌ నటకు ఫిదా అయిన షా.. అభినందించడానికే జూనియర్‌తో భేటీ అయ్యారు.. సరే.. మరి.. వరుసగా అంతరేజ్‌ హిట్లు లేని నితిన్‌ని ఎందుకు కలుస్తున్నారు..? నితిన్‌ను నటించిన తాజా చిత్రం మాచర్ల నియోజకవర్గం ప్లాప్‌ టాక్‌ తెచ్చుకుంది.. అయినా జేపీ నడ్డా ఎందుకు కలుస్తున్నారు? అనే ప్రశ్నించేవారు లేకపోలేదు. సినీ పరిశ్రమ వారికి పార్టీ కండువాలు కప్పడం, వారితో సమావేశమై.. వారు కూడా మాతోనే ఉన్నారనే సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం భారతీయ జనతా పార్టీ నేతల ప్లాన్‌గా అంచనా వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు.. అంతే కాదు.. ఈ మధ్యే ప్రముఖ రచయిత, ఎస్‌ఎస్‌ రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్‌ను రాజ్యసభలో కూర్చోబెట్టి గౌరవించింది బీజేపీ.. ఇప్పుడు.. టాలీవుడ్‌ ప్రముఖులతో బీజేపీ అగ్ర నేతలు భేటీ అయ్యేలా.. ఆయనే ప్లాన్‌ చేస్తున్నారనే ప్రచారం కూడా లేకపోలేదు. ముఖ్యంగా బీహార్‌ సీఎం, జేడీయూ నేత నితీష్‌ కుమార్‌ ఢల్లీి పర్యటనలో ఢల్లీి సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ తో పాటు వామపక్ష అగ్రనేతలను కలుసుకున్నారు. ఇదే సమయంలో బీజేపీ అగ్రనాయకులు ఢల్లీిలో సమావేశమై తాజా రాజకీయాలతో పాటు వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో అవలంభించాల్సిన వ్యూహాలపై చర్చించినట్లు తెలుస్తోంది. వీటితో పాటు గుజరాత్‌, హిమచల్‌ ప్రదేశ్‌ లో ఈఏడాది చివరిలో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. ముఖ్యంగా ఈఎన్నికలపై కూడా ఈసమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. బీజేపీ అగ్రనాయకుల కీలక సమావేశంలో ఎటువంటి అంశాలు చర్చించారనేదానిపై అధికారికంగా ఎటువంటి ప్రకటన వెలువడలేదు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *