నదీ బోర్డులలో డబ్బుల్‌ నిల్‌

రెండు రాష్ట్రాలదీ అదే తీరు కృష్ణా, గోదావరి రివర్‌?మేనేజ్‌ మెంట్‌?బోర్డుల అకౌంట్లు ఖాళీ అయ్యాయి. రెండు బోర్డులు ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని, కార్లల్లో ఫ్యూయల్‌?కూడా పోయించలేని దుస్థి తికి చే రాయి. కృష్ణా బోర్డు (కేఆర్‌ఎంబీ)లో ఉన్న నిధు లతో జులై వరకు మాత్రమే నిర్వహణ సాధ్యమని, ఆలోగా నిధులివ్వకుంటే ఇబ్బందులు తప్పవని కేంద్రానికి బోర్డు అధికారులు నివేదించారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల నుంచి నిర్వహణకు నిధులు ఇప్పించాలని కేంద్ర జలశక్తి శాఖ ఉన్నతాధికారులను వేడుకు న్నారు. గోదావరి బోర్డు (జీఆర్‌ఎంబీ) నిర్వహణకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు రెండేళ్లుగా నిధులు ఇ వ్వడం లేదని.. కేంద్ర ప్రభుత్వం గ్రాంట్‌?ఇస్తే తప్ప బో ర్డును నడపడం సాధ్యం కాదని కేంద్రానికి ఆ బోర్డు అధికారులు కూడా తేల్చిచెప్పేశారు. తాము ఎన్నిసార్లు కోరినా ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిధుల విడుదలకు చొరవ చూపడం లేదని, ఇలాం టి పరిస్థితుల్లో బోర్డు నడిపేందుకు కేంద్రం ‘‘కన్సాలిడేటెడ్‌ ?ఫండ్‌?ఆఫ్‌?ఇండియా’’ నుంచి లోన్‌ లేదా గ్రాంట్‌?రూపంలో నిధులు ఇప్పించాలని కొన్ని రోజుల క్రితం విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ రీఆర్గనైజేషన్‌?యాక్ట్‌(2014)లోని సెక్షన్‌?85 ప్రకారం కృష్ణా, గోదావరి బోర్డుల ను ఏర్పాటు చేసింది. రెండు రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల నిర్వహణ, నీటి విడుదలను రెగ్యులేట్‌?చేయడం సహా అనేక బాధ్యతలను ఈ బోర్డులకు అప్ప గించారు. ఆయా బోర్డుల నిర్వహణకు అవసరమైన నిధులు ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు క్రమం తప్పకుండా చెరి సగం రూ. 100 కోట్ల చొప్పున విడుదల చేయాల్సి ఉంటుంది. అలాగే జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి చైర్మన్‌ గా, రెండు రాష్ట్రాల సీఎంలు సభ్యులుగా అపెక్స్‌?కౌన్సిల్‌ ఏర్పాటు చేశారు. రెండో అపెక్స్‌?కౌన్సిల్‌?సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు కృష్ణా, గోదావరి బోర్డుల పరిధి (జ్యూరిస్‌?డిక్షన్‌) నిర్ధారిస్తూ కేంద్రం గెజిట్‌?నోటిఫికేషన్‌ జారీ చేసింది. అయితే, ‘‘మా ప్రాజెక్టులను స్వా ధీనం చేసుకోవడానికి బోర్డుకున్న అధికారాలేమిటి.. కేంద్రం కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ పేరుతో శిఖండి వ్యవస్థలు ఏర్పాటు చేసి పెత్తనం చేయాలని చూ స్తోంది’’ అని తెలంగాణ ప్రభుత్వ పెద్దలు బాహాటం గానే ఆరోపణలు చేశారు. అప్పటి నుంచే బోర్డులకు నిధులు ఇవ్వడం ఆపేశారు. బోర్డుల గెజిట్‌?ను స్వాగతించిన ఏపీ ప్రభుత్వం నిధులను నిలిపేసింది.రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు ఒకదానిపై ఒకటి ఫిర్యాదు చేసేందుకు మాత్రమే రెండు బోర్డులను వేదికగా వాడుకుంటున్నాయి. కానీ బోర్డుల నిర్వహణను మాత్రం పట్టించుకోవడంలేదు. రెండు బోర్డుల్లో రెండు రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులే 95 శాతం మంది డిప్యుటేషన్‌ పై పని చేస్తున్నారు. అయినా, కేంద్రంపై ఆగ్రహంతో తెలంగాణ, ఇతర కారణాలతో ఏపీ సకాలంలో నిధులు ఇవ్వకపోవడంతో రెండు రాష్ట్రాలకు చెందిన ఉద్యోగులే ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో కృష్ణా బోర్డులో ప్రస్తుతం రూ.3.80 కోట్లు మాత్రమే ఉన్నాయని, వాటితో ఈ ఏడాది జులై వరకే బోర్డు నిర్వహణ సాధ్యమవుతుందని కేంద్రానికి బోర్డు అధికారులు నివేదించారు. దీంతో ఆ బోర్డుకు బోర్డుకు వెంటనే నిధులు విడు దల చేయాలని రెండు రాష్ట్రాల చీఫ్‌?సెక్రటరీలకు కేంద్ర జలశక్తి శాఖ ఇటీవల లేఖ రాసింది. ఈ లేఖపై రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా స్పందిస్తాయో చూడాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *