టీ కాంగ్రెస్‌ లో కల్లోలం

తెలంగాణ కాంగ్రెస్‌ లో కల్లోలం రేగింది. అగ్రనేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతుండటం ప్రకంపనలు రేపుతున్నాయి. అయితే టీ`కాంగ్రెస్‌ రాజకీయం అంతా ఒక్కసారిగా ఢల్లీికి మారింది. కోమటిరెడ్డి బ్రదర్స్‌ ఒకవైపు, టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డి మరోవైపు ఢల్లీి వేదికగా సాగించిన రాజకీయం తెలంగాణ కాంగ్రెస్‌ లో అలజడి పుట్టిస్తోంది. అయితే ఇవన్నీ హస్తినలోని 10 జన్‌పథ్‌ చుట్టే జరుగుతున్నా.. ఏఐసీసీ ఏం చేస్తోందన్న ప్రశ్న ఇప్పుడు అందరి ఆలోచనల్లో మెదులుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి, దాసోజు శ్రవణ్‌ లాంటి అతి కీలకమైన వ్యక్తులు పార్టీని వీడుతుంటే.. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం నిశ్చేష్టగా వ్యవహరించడం సర్వత్రా చర్చనీయాంశం అవుతోంది.రాజగోపాల్‌ రెడ్డి ఎపిసోడ్‌ లో తొలుత కాంగ్రెస్‌ అధిష్టానం కొంత ప్రయత్నాలు చేపట్టింది. అగ్రనేతలు దిగ్విజయ్‌ సింగ్‌, భట్టి విక్రమార్క, వంశీచందర్‌, ఉత్తమ్‌ తో రాయబారం సాగించింది. కానీ రాజగోపాల్‌ రెడ్డి మాత్రం వెనక్కి తగ్గబోయేది లేదని స్పష్టం చేయడంతో చేసేదేమి లేక అధిష్టానం నిర్ణయం కోసం ఎదురు చూడసాగారు నేతలు. ఇంతలో గత సోమవారం రాష్ట్ర నేతలకు ఏఐసీసీ నుండి పిలుపు వచ్చింది. ఈ అంశంపై చర్చించేందుకు ఢల్లీిలోని పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ నివాసంలో అరగంట పాటు మంతనాలు సాగించారు. ఈ చర్చలో పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇన్‌ ఛార్జీ మాణిక్కం ఠాగూర్‌, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, సీఎల్‌ పీ నాయకుడు మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, మాజీ మంత్రి జానారెడ్డిలు పాల్గొన్నారు. రాజగోపాల్‌ రెడ్డిపై వేటు వేయాలా? వద్దా? అనే అంశంపై సమాలోచనలు చేశారు. రాజగోపాల్‌ రెడ్డి ప్రకటనకు కంటే ముందే అతడిపై వేటు వేయాలని అధిష్టానం భావిస్తుండగానే.. అంతలోనే ఆయన పార్టీకి రాజీనామా చేస్తున్నానని ప్రకటన చేసేశాడు. దాంతో పార్టీ బహిష్కరించడం కంటే ముందే రాజగోపాల్‌ రెడ్డి తానే తప్పుకున్నట్లైంది. ఈ క్రమంలో శుక్రవారం రేవంత్‌ రెడ్డి విషయంలో దాసోజు శ్రవణ్‌ అసంతృప్తిని వ్యక్తం చేస్తూ పార్టీని వీడటం వెనుక పార్టీ పెద్దల వైఫల్యం కొట్టొచ్చినట్లు కనపడుతోందనే టాక్‌ వినిపిస్తోంది.పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు పార్టీ నుండి వీడి వెళ్తుంటే.. అధిష్టానం కనీసం సంప్రదింపులు జరపలేదనేది అసంతృప్తుల ఆరోపణలు. 2018 ఎన్నికల తర్వాత 12 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు వేరే పార్టీలో చేరుతుంటే.. ఈ అంశంలో పార్టీ పెద్దలు సీరియస్‌ గా వ్యవహరించలేదనే విమర్శలు ఉన్నాయి. తాజాగా పార్టీలోకి చేరికలను రేవంత్‌ రెడ్డికి అనుమతి ఇచ్చిన అధిష్టానం.. అప్పటికే ఆ స్థానాల్లో ఉన్న సీనియర్లను బుజ్జగించడంలో పూర్తిగా వైఫల్యం చెందిందనే మాట వినిపిస్తోంది. సీనియర్లకు భరోసా కల్పించకుండానే కొత్తవారిని చేర్చుకోవడం, అందులో కొందరు పార్టీ కష్టకాలంగా ఉండగా వదిలేసి ఇప్పుడు వస్తున్న వారు ఉండటం మరింత అగ్గిరాజుకోవడానికి కారణం అవుతోంది. ఇదిలా ఉంటే శుక్రవారం ఢల్లీి వేదికగా తెలంగాణ కాంగ్రెస్‌ లో జరిగిన నాటకీయ పరిణామాలు అంతా ఇంతా కాదు. కోమటి రెడ్డి వెంకట్‌ రెడ్డి ఓ వైపు రేవంత్‌ పై గుర్రుగా ఉన్నారు. తనను వ్యక్తిగతంగా రేవంత్‌ రెడ్డి విమర్శలు చేశారని వెంకట్‌ రెడ్డి చేసిన ఆరోపణలపై ఓ క్లారిటీ రాకముందే.. ఎన్నికల్లో ఆయనకు వ్యతిరేకంగా పనిచేసిన చెరుకు సుధాకర్‌ కు కాంగ్రెస్‌ పార్టీ కండువా కప్పించారు రేవంత్‌ రెడ్డి. అది కూడా మల్లికార్జుక ఖర్గే లాంటి పెద్ద నేతల సమక్షంలో పార్టీలోకి ఆహ్వానించడం కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డిని చిర్రెత్తుకొచ్చేలా చేసింది. ఈ పరిణామంతో ఆయన ఒక్కసారిగా రేవంత్‌ రెడ్డిపై నిప్పులు చెరిగారు. మరోవైపు ఢల్లీికి వచ్చి రాజగోపాల్‌ రెడ్డి అమిత్‌ షాతో భేటీ అయి తాను పార్టీలోకి వస్తున్న సంగతిని ఖరారు చేశారు. పార్టీ ప్రధాన కార్యాలయానికి కూత వేటు దూరంలోనే ఇంతటి పరిణామాలు జరుగుతుంటే.. ఏఐసీసీ పెద్దలు మాత్రం చొరవతీసుకుని రాష్ట్ర నేతలతో చర్చించలేకపోయారనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. తెలంగాణ కాంగ్రెస్‌ పట్ల ఇలాంటి నిర్లక్ష్య ధోరణి ప్రదర్శిస్తే రాబోయే రోజుల్లో అధికారం కాదు కదా.. కాంగ్రెస్‌ ఉనికి పోరాటం చేయక తప్పదనే హెచ్చరికలు రాజకీయ వర్గాల నుండి వ్యక్తం అవుతున్నాయి. ఇకనైనా పార్టీని గాడిన పెట్టేందుకు ఏఐసీసీ రంగంలోకి దిగుతుందా? లేక చేతులు కాలాక ఆకులు పట్టున్న చందంగా పరిస్థితి చేజారాక రంగంలోకి దిగుతుందా? అనేది కాలమే సమాధానం చెప్పాల్సి ఉంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *