లక్షకు లక్ష ఇస్తానని మోసం

చాలా మంది అధిక వడ్డీ వస్తుందంటే చాలు ముందు వెనుక ఆలోచించకుండా తాము కష్టపడి దాచుకున్న డబ్బులు తీసుకొచ్చి.. మాయమాటలు చెప్పిన వాళ్ల చేతిలో పెట్టేస్తారు. వాళ్లకు ఆశ చూపించి.. దాన్నే ఆసరాగా చేసుకుని.. వచ్చికాడికి నొక్కేసి ఉడాయిస్తుంటారు. అచ్చం అలాంటి ఘటనే వనస్థలిపురంలో చోటుచేసుకుంది. లక్ష ఇస్తే.. దానికి ఇంకో లక్ష కలిపి ఇస్తా.. అంటూ అమాయక మహిళలను తమ మాటలతో బురిడి కొట్టించి ఓ కిలేడి కోట్లు కొట్టేసిన ఘటన హైదరాబాద్‌లోని వనస్థలిపురంలో చోటుచేసుకుంది. అధిక వడ్డీ, రియల్‌ ఎస్టేట్‌ పేరుతో భారీ మోసానికి పాల్పడ్డ ఒక మహిళపై వనస్థలిపురంలో కేసు నమోదయ్యింది.వనస్థలిపురం పరిధిలో నివాసముంటున్న స్వర్ణలత అనే మహిళ అధిక వడ్డీ, రియల్‌ ఎస్టేట్‌ పేరుతో అమాయకమైన జనాలకు మాయమాటలు చెప్పి బుట్టలో వేసుకుంది. లక్షకు లక్ష రూపాయలు ఇస్తానని నమ్మబలికింది. ఆమె మాటలు నిజమని నమ్మిన అమాయకపు జనం ఆమెకు లక్షల్లో డబ్బులు ఇచ్చారు. ఇలా.. స్వర్ణలతకు ఏకంగా 50 మంది మహిళలు డబ్బు ఇవ్వగా.. సుమారు 14 కోట్ల రూపాయల వరకు వసూలైంది. ఇంకేముంది.. కోట్లు కొంగున కట్టేసుకుని.. సైలెంట్‌గా అక్కడి నుంచి ఉడాయించింది. ఈ విషయం తెలుసుకున్న బాధితులు తాము మోసపోయామని గ్రహించి.. గుండెలు బాధుకుంటూ పోలీసులను ఆశ్రయించారు.బాధితు మహిళలంతా కలిసి ఎల్బీనగర్‌ డీసీపీ సాయిశ్రీని ఆశ్రయించి.. తమకు జరిగిన మోసాన్ని వివరించారు. అయితే స్వర్ణలతపై గతంలో వనస్థలిపురం పోలీస్‌ స్టేషన్‌లోనే ఒక చీటింగ్‌ కేసు కూడా నమోదు అయినట్లుగా పోలీసులు గుర్తించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్వర్ణలతపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *