ఏపీలో సీబీఐ బ్యాన్‌..?

అవును .. ఇప్పుడు ఇదే ప్రచారం. సోషల్‌ విూడియాలో జోరుగా సాగుతుంది. జగన్‌ ప్రభుత్వం సీబీఐని ఏపీలోకి రానివ్వకుండా ఉత్తర్వులు జారీ చేస్తుందన్న ప్రచారం ఊపందుకుంది. వైఎస్‌ వివేకా హత్య కేసులో జరుగుతున్న పరిణామాలు జగన్‌ ను సీబీఐని బ్యాన్‌ చేసే దిశగా ఆలోచింప చేస్తున్నాయని చెబుతున్నారు. కేవలం ఏకపక్షంగా సీబీఐ విచారణ జరుగుతుందని వైసీ?పీ నేతలు బహిరంగంగానే చెబుతున్నారు. వాస్తవాలను పట్టించుకోకుండా కొందరి మాటలను నమ్మి సీబీఐ అధికారులు ఏకపక్షంగా విచారణ చేయడాన్ని జగన్‌ కూడా తప్పు పట్టినట్లు తెలిసింది. ఈ మేరకు ముఖ్య నేతల వద్ద ఆయన సీబీఐ పనితీరుపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. వైసీపీ నేతలు సీబీఐ విూద చేస్తున్న కామెంట్స్‌ చూస్తుంటే సీబీఐని ఏపీలోకి రాకుండా నిషేధించే అవకాశాలున్నాయని తెలుస్తోంది.ఈ నేపథ్యంలోనే జగన్‌ డీజీపీతోనూ ప్రభుత్వ సలహాదారులతోనూ సమావేశమై సీబీఐ పనితీరుపై చర్చించారని చెబుతున్నారు. గత చంద్రబాబు పాలనలో సీబీఐని రాకుండా ఉత్తర్వులు జారీ చేశారు. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని భావించి సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వకుండా చంద్రబాబు ప్రభుత్వం నాడు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే జగన్‌ ప్రభుత్వం 2019లో వచ్చిన తర్వాత ఆ జీవోను తొలగించింది. ఏపీలో సీబీఐ అధికారుల విచారణకు అనుమతిచ్చింది. అయితే తాజాగా జరుగుతున్న పరిణామాలతో జగన్‌ కూడా చంద్రబాబు తరహాలోనే సీబీఐని బ్యాన్‌ చేయాలని భావిస్తున్నారని సమాచారం. లేని పోని చికాకులను కల్గించే లక్ష్యంతోనే సీబీఐ పనిచేస్తుందని వైసీపీ నేతలు కూడా నమ్ముతున్నారు.ఇప్పటికే పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో సీబీఐని బ్యాన్‌ చేసింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో వైరం పెట్టుకున్న తర్వాత అనవసర కేసులు చుట్టుముడుతాయేమోనని కేసీఆర్‌ సర్కార్‌ సీబీఐని తెలంగాణలో నిషేధించింది. అయితే ఢల్లీి లిక్కర్‌ స్కామ్‌ అక్కడ కేసు నమోదు కావడంతో వారు కల్వకుంట్ల కవితను సీబీఐ అధికారులు విచారించారు. అంతే తప్ప తెలంగాణలో నమోదయిన కేసులపై విచారణ చేయడానికి వీలులేదు. ఇక అత్యున్నత న్యాయస్థానం ఆదేశిస్తే తప్ప. ఇలా తెలంగాణలోనూ సీబీఐ నిషేధానికి గురయింది. సీబీఐ అధికారులు విచారణ చేయాలంటే ముందుగా అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. ఫాంహౌస్‌ లో ఎమ్మెల్యే కొనుగోలు విషయంలోనూ కోర్టు ఆదేశించినప్పటికీ సీబీఐకి సిట్‌ అధికారులు దాని వివరాలను అందించలేదు. ఇప్పుడు జగన్‌ ప్రభుత్వం కూడా వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు కాదు. రానున్న ఏడాది కాలంలో మరెన్నో ఇలా బయటకు వచ్చి తమను రాజకీయంగా ఇబ్బంది పెడతాయని భావిస్తుంది. కేంద్ర ప్రభుత్వంలోనూ జగన్‌ కు సంబంధాలు అంతగా మంచిగా లేవన్న ప్రచారమూ జరుగుతుంది. ఈ నేపథ్యంలో సీబీఐని రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉత్తర్వులు జారీ చేయడంపై పరిశీలిస్తున్నట్లు చెబుతున్నారు. అయితే దీనిపై పూర్తిగా క్లారిటీ రావాల్సి ఉంది. ‘ సీబీఐని ఇప్పటికిప్పుడు బ్యాన్‌ చేస్తే కేవలం వివేకా హత్యకేసు కోసమే చేసినట్లవుతుందన్న సంశయమూ లేకపోలేదు. అలాగే చంద్రబాబుకు తనకు తేడా ఉండదని అనుకుంటే జగన్‌ ఈ నిర్ణయం తీసుకోకపోవచ్చని అంటున్నారు. అయితే దీనిపై కసరత్తు మాత్రం వైసీపీ సర్కార్‌ లో జరుగుతుందని తెలిసింది. త్వరలోనే దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *