బ్రాండెడ్‌ లిక్కర్‌ అడిగితే నో స్టాక్‌

పల్నాడు జిల్లాలో బ్రాండెడ్‌ లిక్కర్‌ అడిగితే నో స్టాక్‌ అంటున్నారు. చీకటి పడితే చీప్‌ లిక్కర్‌ కూడా దొరకడం లేదట. ఇదేదో మద్యపాన నిషేధం దిశగా సర్కార్‌ వేస్తున్న అడుగులు అనుకుంటే పొరపడినట్లే. ఇంతకీ?పల్నాడులో కిక్కు కోసం మందుబాబు పడుతున్న పాట్లు ఏంటి?పల్నాడు జిల్లాలో చీకటి పడితే చాలు మందుబాబులకు చుక్కలు కనిపిస్తున్నాయి. రాత్రి 7 గంటలకే ప్రభుత్వ మద్యం దుకాణాల్ని మూసేస్తుండడంతో కిక్కు కోసం అగచాట్లు తప్పడం లేదు.పల్నాడులోని గురజాల, దాచేపల్లి, మాచర్ల, పిడుగురాళ్ల ఇలా చెప్పుకుంటూ పోతే అనేక ప్రాంతాల్లో రాత్రి 7 నుంచి 8 గంటల మధ్యలోనే ప్రభుత్వ మద్యం షాపులు మూత బడిపోతున్నాయట.సాయంత్రానికల్లా తమ పనులు ముగించుకుని? చుక్కేసి సేద తీరాలని భావించే వాళ్లకు నిజంగానే చుక్కలు కనిపిస్తున్నాయి. చివరికి బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు వెళ్లి చేతి చమురు వదలించుకోవాల్సి వస్తోంది.ఇదంతా పక్కా ప్లాన్‌తోనే జరుగుతోంది. పల్నాడు ప్రాంతంలోని బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు లైసెన్స్‌ తీసుకున్న వ్యాపారులు సిండికేటయ్యారు. భారీగా సొమ్ము చెల్లించి పర్మిషన్లు తీసుకోవడం వల్ల తమ పెట్టుబడిని రాబట్టుకునే పనిలో పడ్డారు. మందు బాబులంతా బార్‌ అండ్‌ రెస్టారెంట్లకే వచ్చి తాగేలా స్కెచ్చేశారు. రాత్రి పది గంటల వరకు వైన్‌ షాపులు నడిస్తే తమ దగ్గరకు ఎవరూ రారని గ్రహించి? ప్రభుత్వ మద్యం దుకాణాల్ని ఓ మూడు గంటలు ముందుగానే మూయించేస్తున్నారు. దీని కోసం స్థానికంగా పలుకుబడి గల రాజకీయ నాయకులు, పోలీసులు, ఎక్సైజ్‌ అధికారులతో ఒప్పందాలు కుర్చుకుంటున్నారు. అంతేకాదు? ప్రభుత్వ మద్యం షాపులకు వచ్చిన బ్రాండెడ్‌ లిక్కర్‌ మొత్తం బార్‌ అండ్‌ రెస్టారెంట్లకు తరలించేస్తున్నారు. మద్యం షాపుల్లో సూపర్వైజర్ల చేతులు తడిపి స్టాక్‌ మొత్తం పట్టుకుపోతున్నారు బార్‌ల నిర్వాహకులు.మరోవైపు పలనాడు వ్యాప్తంగా ఉన్న చిన్న చిన్న దాబాలు, రెస్టారెంట్లలో అమ్ముతున్న మద్యం కూడా తమ దగ్గరే కొనుగోలు చేయాలని హుకుం జారీ చేసింది లిక్కర్‌ మాఫియా. అంతేకాదు? ప్రభుత్వ మద్యం షాపుల నుంచి బ్రాండెడ్‌ లిక్కర్‌ మొత్తం కొనుగోలు చేసి? అక్కడ స్టాక్‌ లేకుండా చేస్తున్నారు. ఇలా బ్లాక్‌ చేసిన మద్యాన్ని అధిక ధరలకు రెస్టారెంట్లకు అమ్ముతున్నారట. కాదు కూడదంటూ బయటి నుంచి లిక్కర్‌ తెచ్చే డాబాలపై అధికారులతో దాడులు చేయించి కేసుల్లో ఇరికిస్తున్నారట. ఆఖరికి గ్రామాల్లోని బెల్ట్‌ షాపులను కూడా ఈ మాఫియాయే నడిపిస్తుందట. ప్రత్యేక లేబుళ్లు వేసి గ్రామాల్లో అధిక రేట్లకు మద్యం బాటిళ్లను అమ్ముతున్నారు.పలనాడు లిక్కర్‌ సిండికేట్‌లో రాజకీయ నాయకుల కూడా వాటాలు ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. దీంతో చర్యలు తీసుకోవాల్సిన అధికారులు కూడా మన కెందుకు ఈ పంచాయితీ అని చూసీచూడనట్టు వదిలేస్తున్నారనే టాక్‌ నడుస్తోంది

Leave a comment

Your email address will not be published. Required fields are marked *